-నిస్వార్ధంగా సమాజం కోసం సేవ చేసే సంస్థ ఐఫోకస్
-మంత్రి హరీశ్ రావు
ఐ ఫోకస్ వ్యవస్థాపకులు వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులు మంత్రి హరీష్ రావు ని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావుకి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రానికి మంచి చేస్తున్న బీ ఆర్ ఎస్ పార్టీకి తోడుగా ఉంటామని అన్నారు.
రాజకీయాలకు అతీతంగా సమాజం కోసం పాటుపడే హరీష్ రావు లాంటి మంచి నాయకులు ప్రజలకు, సమాజానికి అవసరమని నిస్వార్ధంగా సేవ చేసే నాయకులు చాలా అరుదుగా కనిపిస్తారని అందులో ఒకరు మంత్రి హరీష్ రావు అని వారు కొనియాడారు.
ఎన్నికల్లో హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ మంచి విజయం సాధించి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రం మరింత బాగుపడాలంటే మంచి నాయకత్వం ఉంటేనే సాధ్యమవుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నిస్వార్ధంగా సమాజం కోసం సేవ చేసే సంస్థ ఐఫోకస్ అని తెలిపారు. అందరూ వారి వారి కుటుంబము, వ్యక్తిగత జీవితంలో ఉండిపోతారు కానీ ఐఫోకస్ సంస్థ మాత్రం సమాజం కోసం నిస్వార్ధంగా పనిచేసే కార్యకర్తలను తయారు చేసి, సమాజ హితం కోసం పాటుపడుతుందన్నారు. ఐఫోకస్ సంస్థ వారికి అభినందనలు తెలిపారు. రాష్ట్రం బాగుండాలంటే ఏబుల్ లీడర్, స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలని అలాంటి మంచి పార్టీని మీరంతా దీవించాలని మంత్రి కోరారు.