Suryaa.co.in

Andhra Pradesh

బక్రీద్ పండుగ రోజు ముస్లిం సోదరుడి అక్రమ అరెస్టా?

– మాచర్ల లో అన్వర్ బాషా అరెస్ట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపాటు

ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా…లేక రాక్షస రాజ్యమా? మీరు మనుషులేనా….మీకు మానవత్వం ఉందా…? ఒక ముస్లిం సోదరుడిని బక్రీద్ పండుగ రోజు తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేస్తారా? ఎప్పుడో ఎక్కడో జరిగిన వివాదంతో ముడిపెట్టి…ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టి పండుగ పూట జైలుకు పంపుతారా?

మాచర్లలో టీడీపీ కార్యకర్త సయ్యద్ అన్వర్ బాషా అరెస్టు జగన్ రెడ్డి ఫాసిస్టు పాలనకు నిదర్శనం. తండ్రిని పోలీసులు తీసుకువెళుతుంటే తల్లడిల్లుతున్న ఆ బిడ్డకు మీరు ఏం సమాధానం చెపుతారు? ఈ వికృత రాజకీయ క్రీడకు, అమానవీయ పోకడలకు మీరు, మీ పార్టీ నేతలు ఇంతకంటే ఎక్కువ మూల్యం చెల్లిస్తారు. బక్రీద్ నాడు అరెస్టుతో ఒక ముస్లిం కుటుంబాన్ని క్షోభకు గురి చేసిన పాపం పోలీసులను, కుట్ర చేసిన వైసీపీ నేతలను వెంటాడుతుంది. ముస్లిం సమాజం మీ చర్యను గమనిస్తోంది. మీకు గట్టిగా బుద్ధి చెబుతుంది.

LEAVE A RESPONSE