దేశ ఆర్థిక వ్యవస్థపై రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం లజ్జాకరమైనవే కాదు, ఒక జాతీయ నాయకుడికి తగిన ఆలోచనా స్థాయికి దూరంగా ఉండటాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. ఆర్థిక పురోగతి విషయంలో భారత్ వేసిన దృఢమైన అడుగుల వెనుక శ్రమించిన మహానుభావులు ఉండగా, వారిని అవమానించడానికి ఇలాంటి మాటలు అర్హతలేని రాజకీయ దురాశకు ప్రతీకగా నిలుస్తున్నాయి.
పి.వి. నరసింహారావు పాలనలో మొదలైన ఆర్థిక సంస్కరణలు, అటల్ బిహారీ వాజ్పేయి విధానాలు దేశానికి బలమైన ఆర్థిక పునాదులు వేసాయి. ఈ మార్గాన్ని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ధైర్యంగా కొనసాగించి, దేశాన్ని గ్లోబల్ అభివృద్ధిలో నిలిపారు. ఈ తరుణంలో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను క్రమంగా అధిగమిస్తూ ముందుకు సాగుతోంది.
ఇలాంటి సమయంలో, దేశ పురోగతిని విమర్శించడం ద్వారా రాహుల్ గాంధీ తన రాజకీయ ఆపరిపక్వత నే కాక, అసహనాన్ని, అసూయను,దేశం పట్ల అత్యంత చులకన భావం ని మాత్రమే బయటపెడుతున్నారు.
గతంలో అదే పార్టీకి చెందిన పి.వి. నరసింహారావు కి గౌరవం ఇవ్వకపోవడం, నేడు మోదీ పాలన పట్ల ఇదే ధోరణి కొనసాగించడమే ఇందుకు ఉదాహరణ.
నాయకత్వం అనేది కేవలం విమర్శించడం మాత్రమే కాదు; ఎవరైనా మంచి పనులు చేస్తే వాటిని గౌరవించగల శక్తి ఉండాలి. ఇది ప్రజాస్వామ్యంలో ఎదిగే ప్రతి నాయకుడికి అవసరమైన విలువ. కానీ రాహుల్ గాంధీ ప్రవర్తనలో ఇది అస్సలు కనిపించటం లేదు.
ఇలాంటి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఆయనకు హానికరం కావడమే కాదు. ఆయన పార్టీ ఐన కాంగ్రెస్ కు మరణ శాసనం కానుంది. కాంగ్రెస్ పార్టీముఖ్యమంత్రుల పరిపాలనను కూడా సంక్లిష్టంగా మార్చే ప్రమాదం ఉంది.
ఈ సందర్భంలో భగవద్గీతలోని మహత్తర బోధన గుర్తుకు వస్తుంది —
“కామం, క్రోధం, లోభం వంటి వాటి వశమై మనిషి వివేకం కోల్పోతాడు.”
ఇందులో రాహుల్ గాంధీ గారు కూడా తాము పడే అహంకారానికీ, అధికారం పట్ల ఉన్న ఆకాంక్షలకూ బలవుతున్నట్టు అనిపిస్తోంది.
దేశ ప్రజలు రాహుల్ గాంధీ ని వ్యతిరేకించటం లేదు. కానీ దేశానికి మేలుచేసే పాలకుల పట్ల తగిన గౌరవం చూపని, అభివృద్ధిని అంగీకరించలేని తీరు మాత్రం ఖచ్చితంగా తిరస్కరిస్తారు. దేశానికి అవసరం వ్యక్తిగత దురాశలకు అతీతంగా ఉండే నాయకత్వం ..ఆ విలువలను గుర్తించగల రాజకీయ సంస్కృతి. గౌరవంతో,
– పి.వి. రావు
వరంగల్లు