– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విజ్ఞప్తి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అంతటా 2025–26 విద్యా సంవత్సరానికి డిగ్రీ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్లల లో తీవ్రమైన జాప్యం జరుగుతోందని విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఆందోలన వ్యక్తం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ దృష్ట్యా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ఇప్పటికే తన అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. కాని నేటికి కూడా ఆంధ్రప్రదేశ్లో స్పష్టత లేకపోవడం వల్ల జాప్యం నెలకొందన్నారు. దీంతో విద్యార్థులకు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని మాధవ్ తెలిపారు.
ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వీరంతా ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, హాస్టళ్లు, స్కాలర్షిప్లు , ఫీజు రీయింబర్స్మెంట్లపై ఎక్కువగా ఆధారపడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లోని వేలాది మంది విద్యార్థుల విద్యా ప్రయోజనాలను కాపాడటానికి, మన ఉన్నత విద్యా సంస్థల ఖ్యాతిని చెక్కుచెదరకుండా ఉంచడానికి ప్రభుత్వం సత్వర చర్య తీసుకోవాలని మాధవ్ కోరారు.