Suryaa.co.in

Andhra Pradesh

హక్కుల కమిషన్ ఆశ్రయించే బాధితుల సమస్యల పరిష్కారానికి సత్వర చొరవ…

కర్నూల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో గురువారం ఉద్యోగులుచే నిర్వహించబడిన ఆత్మీయ సమావేశంలో కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి , కమిషన్ సభ్యులు జుడిషియల్ సుబ్రహ్మణ్యం , మరో కమిషన్ సభ్యులు డాక్టర్ శ్రీనివాస రావు గార్ల మొదటి సంవత్సర పదవి కాలం పూర్తయిన సందర్భంగా ఉద్యోగులచే నిర్వహించబడిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న గౌరవ కమిషన్ చైర్మన్ సభ్యులు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కమిషన్ చైర్మన్ సీతారామ మూర్తి మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో కమిషన్ ఆశ్రయించిన బాధితులకు సమస్యల పరిష్కారానికి సత్వర చోరవ చూపడం జరిగిందని ఈ నేపథ్యంలో కమిషన్ కు సహకరించిన ప్రభుత్వానికి మరియు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తమ ఆదేశాలను ఎప్పటికప్పుడు సత్వరం అమలు జరిగేటట్టు కృషి చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి అధికారులకు అభినందనలు తెలిపారు.

అదేవిధంగా కమిషన్ను ఆశ్రయించిన బాధితులకు సత్వరమే వారి ఫిర్యాదులను తమ నిబంధనల ప్రకారం సిబ్బంది తమ ముందు ఉంచడం అభినందనీయం అని కొనియాడారు.. అదే విధంగా ఈ సంవత్సర కాలంలో ఎక్కువ సమస్యలు పరిష్కారానికి చొరవ చూపడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అదేవిధంగా కమీషన్ జుడిషియల్ సభ్యులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కమిషన్లో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో కమిషన్ అనతికాలంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా అభినందిస్తున్నానని తెలియజేశారు.

అదేవిధంగా కమిషన్ లోని మరో సభ్యులు డాక్టర్ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ కమీషన్ లో తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ సిబ్బంది ఎంతో అంకితభావంతో పని చేస్తున్నారని ఈ సందర్భంగా ఉద్యోగులు అందరినీ పేరుపేరునా అభినందిస్తున్నానని తెలిపారు. త్వరలో ఉద్యోగుల విభజన అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిష్కారం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు తమకు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో లో కమిషన్ కార్యదర్శి  రమణ మూర్తి , కమిషన్ పౌరసంబంధాల అధికారి రవి కుమార్ , కమిషన్ విభాగ అధికారులు  సునిత, తారక నరసింహ కుమార్ బొగ్గరం గార్లు పలువురు సిబ్బంది పోలీసు అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE