– తొలి కేసు నమోదు
న్యూ ఢిల్లీ : దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల కింద తొలి ఎఫ్‌ఐఆర్ ఢిల్లీలోని కమ్లా మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఈరోజు నమోదైంది. ఓవర్‌బ్రిడ్జి పక్కనే విక్రయాలు జరిపిన వీధి వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతిపక్షాలు అభ్యంతరం చేసినప్పటికీ కొత్త చట్టాలను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది.