Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో ఎన్నికల వరకు రాష్ట్రపతి పాలన విధించండి

రాష్ట్రంలోని న్యాయస్థానాలలో కూడా భారత రాజ్యాంగం అమలు కావడం లేదు
ప్రజల ప్రాథమిక హక్కులను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ అందరూ రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాయండి
ఒక ఎంపీ తన సొంత నియోజకవర్గానికి వెళ్లలేని దుస్థితిని కల్పించిన జగన్మోహన్ రెడ్డి పాలన
జాతీయ మీడియా ఇంటర్వ్యూలలో తడుముకోకుండా నిప్పులాంటి చంద్రబాబు గురించి నిజాలను చెప్పిన నారా లోకేష్
జాతీయ మీడియా నారా లోకేష్ ను పట్టించుకోలేదన్న సాక్షి మీడియా ప్రచారం శుద్ధ అబద్ధం… అర్ణబ్ గోస్వామి షో, టైమ్స్ నౌ, సీఎన్ఎన్, టీవీ 18 లో లోకేష్ ఇంటర్వ్యూలు సాక్షి ఛానల్ కంటికి కనిపించడం లేదా?
పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు దత్తపుత్రుడు కాదు… సొంత కొడుకు లాంటివాడే
కంటేనే కొడుకు కాదు… కనిపెట్టుకొని ఉండేవాడు కూడా కొడుకే
చంద్రబాబుకు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కొడుకులైతే నేను తమ్ముడి లాంటి వాడిని
ఎన్డీఏలో జనసేన భాగస్వామి కాగా … జనసేన, టిడిపి పొత్తుతో టిడిపి కూడా ఎన్డీఏలో భాగస్వామి కింద లెక్కే
ఇండియా కూటమి నేతలు బాబుకు మద్దతు ప్రకటించారంటే మా పార్టీ వారిని తిట్టినట్లు… ఆ విషయం కూడా మా తింగరోల్లకు అర్థం కావడం లేదు
సోనియా ఎదిరించడం కాదు ఆమె కాళ్ళపై పడిన సంగతి తెలియనిదా?… ఎవరు వెళ్లి కాళ్లు మొక్కితే జగన్ జైలు నుంచి బయటకు వచ్చాడో తెలియనిదా??
ఒక్క అర్ణబ్ కాదు… 100 మంది అర్ణబ్ లు వచ్చిన సమాధానం చెబుతానన్న రీతిలో సమాధానమిచ్చిన లోకేష్ మగధీరుడు అయితే మా వాళ్ళు మాడాగాలంటున్న ప్రజలు
ఆరవ రోజు జైలులో చంద్రబాబని సాక్షిలో రాయడం హేయం… రాష్ట్ర హైకోర్టులోనే నూటికి నూరు శాతం న్యాయం జరిగే అవకాశం
నీతికి అవినీతికి మధ్య యుద్ధం అన్న జగన్ వ్యాఖ్యలు నిజమే… అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ జమోరె అయితే నీతికి నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడు
చంద్రబాబు విడుదల కోసం శాంతియుత నిరసనలు, ప్రార్థనలు చేయడంతో పాటు రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తూ రాష్ట్రపతి, ప్రధానికి ప్రజలంతా లేఖలు రాయాలి
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

రాష్ట్రంలో ప్రాథమిక హక్కుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వ పెద్దల్లో మార్పు రాదని భావిస్తే, ఎన్నికల వరకు రాష్ట్రపతి పాలనైనా విధించండని రాష్ట్రపతి, ప్రధానమంత్రికి ప్రజలంతా నాలుగు లైన్ల ఈమెయిల్, లెటర్, పోస్టు కార్డుల ద్వారా తమ వినతి పత్రాలను అందజేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కోరారు. రాష్ట్రంలోని న్యాయస్థానాలలో కూడా భారత రాజ్యాంగం అమలు కావడంలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని ప్రజలంతా కోరాలన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను హరించే విధంగా పనికిమాలిన నాయకులు చెబుతున్న మాటలు విని పోలీసులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల తప్పుడు వైఖరిని న్యాయస్థానాలలో ప్రశ్నిస్తే, కనీసం కోర్టులలో కూడా భారత రాజ్యాంగం అమలు కాకపోవడమన్నది రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకే స్ఫూర్తికే పూర్తి విరుద్ధమని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుత పాలకుల కంటే బ్రిటిష్ వారే నయం
రాష్ట్రంలోని ప్రస్తుత పాలకుల కంటే బ్రిటిష్ వారే ఎంతో నయమని రఘురామకృష్ణం రాజు అన్నారు. అల్లూరి సీతారామరాజును అక్రమంగా కాల్చి చంపిన రూథర్ ఫోర్డ్ ను ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక ఎంపీ తన సొంత నియోజకవర్గానికి వెళ్లలేని పరిస్థితిని కల్పించారు. చంద్రబాబు నాయుడు పై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కీం స్కామ్ కేసులో ఆయన్ని విచారించాలి అంటే తప్పనిసరిగా గవర్నర్ అనుమతి తీసుకోవాలని చట్టంలోని 17A నిబంధన స్పష్టం చేస్తోంది. అయినా పోలీసులు ఈ నిబంధనను కనీసం పాటించలేదు. దీని కోసమేనా తెల్లవారితో పోరాటం చేసి స్వాతంత్రాన్ని సాధించుకుందని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

డ్రైవర్ సుబ్రహ్మణ్యమును హత్య చేసి శవాన్ని పార్సిల్ చేశారు. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ నడిరోడ్డుపై చంపేశారు. నన్ను కూడా చంపాలని చూశారు. కానీ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల త్రుటిలో తప్పించుకున్నాను. చంద్రబాబు నాయుడుని విడుదల చేయాలని కోరుతూ శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో హైదరాబాద్లోని ఐటి హబ్ ప్రాంతంలో నిరసన తెలుపుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించడం విడ్డూరంగా ఉంది. రాజ్యాంగంలో ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులలో శాంతియుతంగా నిరసన తెలియజేయడం కూడా ఒక హక్కేనని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గుర్తించాలి. రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా వ్యవహరించడం వల్ల, దాని ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది.

చంద్రబాబు నాయుడు జైల్లో నడుస్తూ ఉంటే, ఖైదీలంతా ముక్తకంఠంతో ఆయనకు సంఘీభావాన్ని తెలియజేస్తూ… మళ్లీ బాబే కావాలి సీఎం అంటూ నినదించారు. జైల్లో ఉన్న ఖైదీలను మా వారు ఏమి చేస్తారో… వారిని అరెస్టు చేయలేరు. చేయగలిగితే రాజమహేంద్రవరం జైలు నుంచి మరొక జైలుకు బదిలీ చేయడమేనని రఘు రామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. రాజమహేంద్రవరం జైలు జైలర్ రాహుల్ సతీమణి క్యాన్సర్ తో బాధపడుతున్నప్పటికీ, ఇంత అర్ధాంతరంగా చనిపోవడం అనుమానాలకు తావునిస్తోంది. ఒకవేళ భార్య ఆరోగ్య పరిస్థితి అంత శృతి మించితే ఆయన ముందుగానే సెలవులు పెట్టి ఉండేవాడు కదా?!. సొంత బాబాయిని చంపివేసి వాళ్లే చంపుతారు… కేసులు పెడతారని వెధవ డ్రామాలు ఆడారు. అటువంటి మా వారిపై అనుమానం తలెత్తడం సహజం. బాబాయిని ఎవరు చంపారో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమేనని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

పప్పు అన్నారు కదరా… మీ తుప్పు వదిలించాడు!
తన తండ్రికి జరిగిన అన్యాయంపై అర్ణబ్ గోస్వామి లాంటి సీనియర్ జర్నలిస్టు సంధించిన ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏ మాత్రం తడుముకోకుండా సమాధానాలు చెప్పారని రఘురామకృష్ణంరాజు కితాబునిచ్చారు. అర్ణబ్ గోస్వామి షో కు వెళ్లిన చాలామంది మా పార్టీ నాయకులు బె.. బ్బే అంటూ నీళ్లు నమ్మడం చూశామన్నారు. చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదు కాబట్టి, నిప్పు లాంటి మనిషి గురించి నిజాలు చెప్పాలంటే ఎవరైనా ఏ మాత్రం తడుముకోవలసిన అవసరం ఉండదు. నారా లోకేష్ ను పప్పు అని అన్నారు కదరా… ఇప్పుడు మీ తుప్పు వదిలించాడు.

నారా లోకేష్ లో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. యువ గళం పాదయాత్ర ద్వారా ఆయనలోని నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తే, జాతీయ మీడియాకు ఏమాత్రం గుక్క తిప్పుకోకుండా ఇచ్చిన సమాధానాల ద్వారా నాయకుడిగా తానేమిటో నిరూపించుకున్నారని రఘురామకృష్ణంరాజు ప్రశంసించారు. దేశం లోని జాతీయ మీడియా ఛానల్ లో రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే అర్ణబ్ షో టాప్ షో. అర్ణబ్ సంధించిన ప్రశ్నలకు, ఆయనే బిగుసుకుపోయే విధంగా లోకేష్ సమాధానాలు చెప్పారు.

స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో భాగంగా ఓకే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సునీత అనే అధికారి సూచించారట కదా అని ప్రశ్నించగా, సునీత ముఖ్యమంత్రి కాదు కదా … రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ఏకకాలంలో అనేక కేంద్రాలను ప్రారంభించడం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఎంతోమంది విద్యావంతులు ఉండగా వారి నైపుణ్య శిక్షణ కోసం కేవలం 370 కోట్ల రూపాయలు వెచ్చించగా , ఇందులో జీఎస్టీ రూపంలో 40 కోట్ల రూపాయలు కేంద్రానికే వెళ్తాయి. కేవలం 330 కోట్ల రూపాయలతో లక్షలాది మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం తప్పా అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. గుజరాత్ కు వెళ్లి అధ్యాయనం చేసిన బృందంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యదర్శి ప్రేమ్ చంద్రా రెడ్డి తో పాటు, సునీత కూడా ఉన్నారని వారి ప్రతిపాదననే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని గుర్తు చేశారు.

స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో అసలు స్కాం ఎక్కడ జరిగింది. మనీ ట్రయల్ అన్నదే లేదు. మనీ ట్రయల్ జరిగితే, ఆధారాలతో చూపెట్టి ఉండేవారు కదా?. ప్రస్తుతం ఏపీ సీఐడీ చీఫ్ గా కొనసాగుతున్న సంజయ్ ను హైదరాబాద్ వెస్ట్ జోన్ డిసిపి గా పనిచేస్తున్న సమయంలో సస్పెండ్ చేశారు. చెట్టు కింద ప్లీడర్ ను, సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి పెర్ఫామెన్స్ నిన్నటి మీడియా సమావేశంలో చూశాము కదా. గంగా నది పుట్టుక గురించి రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో మతాబుల్లా పేలుతున్నాయి. ఇంతటి పరిజ్ఞానం ఉన్న న్యాయవాది చెప్పిన మాటలను ఏసీబీ న్యాయస్థానం ఏకీభవించడం విడ్డూరంగా ఉంది.

జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తింగరి పనులన్నీ చూసి ఇంకా రెండు మూడు నెలల తరువాత కుదరాల్సిన పొత్తు తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య ముందే కుదిరింది. గతంలో నాకు కష్టం వచ్చినప్పుడు నాకు, నా కుటుంబానికి చంద్రబాబు నాయుడు ఎంతో అండగా నిలిచారు. ఇప్పుడు ఆయనకు కష్టం వచ్చింది. అండగా నిలవాల్సిన బాధ్యత నాకు ఉంది. లోకేష్ ను శుక్రవారం నాడు ప్రత్యేకంగా కలిశాను. ఈరోజు కూడా కలుస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. లోకేష్ ఇంటర్వ్యూలను జాతీయ మీడియా ఛానల్లు కవర్ చేయలేదని సాక్షి ఛానల్ పేర్కొనడం చూస్తే కళ్ళుండి కూడా చూడలేని కబోది గుర్తుకు వస్తుంది.. అర్ణబ్ షో, అంబానీ కి చెందిన సీఎన్ఎన్, టీవీ 18 లు కవర్ చేశాయి కదా.

జాతీయ ఛానల్స్ లోకేష్ ఇంటర్వ్యూ కవర్ చేశాయో లేదో చూడకుండా, కవర్ చేయలేదని సాక్షి మీడియాలో కథనాలు ప్రసారం చేసుకుంటే, ప్రజలేమైనా సాక్షి మీడియాను చూసి నిర్ధారణకు వస్తారని అనుకుంటున్నారా అంటూ అపహాస్యం చేశారు. ఉషోదయ పబ్లికేషన్ దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు తీర్పు ఇస్తే సాక్షి దినపత్రిక సర్కులేషన్ మరో నాలుగు లక్షల పడిపోవడం ఖాయమని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

టిడిపి, జనసేన పొత్తుతో మా పార్టీ పని అయిపోయింది
ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీ, జనసేన వేరువేరుగా పోటీ చేస్తాయని, మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పుకున్న నా ప్రస్తుత పార్టీ నాయకుల ఆశలన్నీ తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు అధికారికంగా ఖరారు కావడంతో ఆవిరైపోయాయి. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడని సంబోధించడం మానండి జగన్మోహన్ . చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు కాదు. సొంత పుత్రుడే. కంటేనే కొడుకు కాదు. కనిపెట్టుకొని ఉండేవాడు కూడా కొడుకే. నా వయసు కొంచెం ఎక్కువ కాబట్టి… నేను చంద్రబాబు నాయుడు కి తమ్ముడిని. చంద్రబాబు నాయుడు కి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కొడుకులైతే, నేను తమ్ముడిని అని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భాగస్వామి. జనసేన, టిడిపి పొత్తు వల్ల, టిడిపి కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కిందే లెక్క.

చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై బిజెపి అగ్ర నాయకులు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, బండి సంజయ్ వంటి వారు స్పందించారు. బిజెపి తరపున ఎవరు మాట్లాడినా మాట్లాడినట్టే. ప్రధానమంత్రి మోడీనే మాట్లాడాలన్నా నిబంధన ఏదీ లేదు. ఎన్డీఏ భాగస్వామిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ బిజెపి నాయకత్వం ఈసారి మేము ఆంధ్రాలో పోటీచేయం. కూటమి తరుపున నువ్వు పోటీ చెయి అని అంటే… ఎన్నికల్లో నెగ్గిన తర్వాత అవన్నీ ఎన్డీఏ కూటమి స్థానాలే అవుతాయి. పవన్ కళ్యాణ్ దెబ్బకు మా పార్టీ నాయకుల మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇకపై దత్త పుత్రుడు అనే మాట మానేయ్ జగన్మోహన్… పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుకి సొంత పుత్రుడు కిందే లెక్క.

ఇండియా కూటమి కి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సన్నితంగా ఉన్నారనే భ్రమను కల్పించే ప్రయత్నాన్ని మా పార్టీ నాయకులు చేస్తున్నారు. ఇండియా కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించారు అంటే మా పార్టీని తిట్టినట్లని మా తింగరోల్లకు అర్థం కావడం లేదు. రాజకీయాలు వేరు… వ్యక్తిగత స్నేహాలు వేరు. ఇండియా కూటమిలోని నాయకులు చంద్రబాబు నాయుడు కి మద్దతును తెలియజేసి, ఈ అక్రమ అరెస్టును ఖండించడం వారి మానవత్వానికి నిదర్శనం. ఈ అరెస్టు ద్వారా మీరెంత చెత్త వ్యక్తులో వారికి కూడా అర్థమయింది. అందుకే చంద్రబాబు నాయుడు కి మద్దతు ఇస్తున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

అసలు నీ పార్టీ ఏ కూటమినో ఫస్ట్ చెప్పు
జాతీయస్థాయిలోని కూటములలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ కూటమినో జగన్మోహన్ రెడ్డి చెప్పాలని రఘు రామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి నిన్ను దగ్గరకు రానివ్వదు. ఎందుకంటే మీది క్రిస్టియన్ పార్టీ. బిజెపి అనేది హిందూ పార్టీ. నువ్వు ఇండియా కూటమిలోకి వెళితే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడుతుంది. సోనియాని ఎదిరించిన ధీరుడు అని ప్రచారం చేసుకున్నారు. ఏందిరా ఎదిరించింది. సోనియా గాంధీ కాళ్ళ మీద పడిన సంగతి తెలియనిదా?, సోనియా గాంధీ కాళ్ళ మీద వెళ్లి ఎవరు పడితే జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చారో తెలియనిదా?? అంటూ ప్రశ్నించారు.

శత ధ్రువంశ యోధునిలా మాట్లాడిన నారా లోకేష్
ఒక్కఅర్ణబ్ కాదు… వందమంది అర్ణబ్ లు వచ్చిన సమాధానం చెబుతానని శతు ధ్రువంశ యోధునిలా నారా లోకేష్ మాట్లాడారని రఘు రామకృష్ణంరాజు పేర్కొన్నారు. అసలు సిసలు మగధీర నారా లోకేష్ అయితే… మా పార్టీ నాయకులను మాడగాళ్లని ప్రజలు అనుకుంటున్నారు. కమర్షియల్ టాక్స్ లో చిరు ఉద్యోగి అయినా సూర్యనారాయణ పై ఐపీసీ సెక్షన్ లతోపాటు, అవినీతి నిరోధక కేసులను బనాయించి అరెస్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నించింది. ఈ కేసుల నుంచి యాంటిస్పేటరీ బెయిల్ కోసం రాష్ట్ర హైకోర్టును సూర్యనారాయణ ఆశ్రయించగా, తిరస్కరించింది. అదే సుప్రీంకోర్టులో పూర్తి వాదనలు వినకముందే యాంటిస్పేటరీ బెయిల్ మంజూరు చేసింది.

రాష్ట్రంలో న్యాయం సక్రమంగా అమలు జరగడంలేదని సుప్రీం కోర్టు భావించడం వల్లే, వాదనలను పూర్తిగా వినక ముందే తీర్పును వెల్లడించి ఉంటుంది. మంగళవారం రాష్ట్ర హైకోర్టులోనే నారా చంద్రబాబు నాయుడుకి న్యాయం జరిగే అవకాశం ఉంది. లేనిపక్షంలో సుప్రీంకోర్టులో కచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది.. చట్టంలోని 17A నిబంధనను అనుసరించాల్సి ఉండగా, ఈ కేసులో రాష్ట్ర పోలీసులు అనుసరించలేదు. డీజీపీ స్థాయి పోలీస్ అధికారి కేసు విచారణ అధికారిగా వ్యవహరించాల్సి ఉండగా, డీఎస్పీ స్థాయి అధికారి ధనుంజయుడు విచారణ అధికారిగా వ్యవహరించినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కేసులోని రిమాండ్ రిపోర్ట్ చెల్లదు. నిబంధనలను ఏమాత్రం అనుసరించలేదు. మనీ ట్రయల్ అన్నది జరగలేదు. అయినా సునీత అనే అధికారి ఏమి మాట్లాడిందో తెలియదు… ఈ లెక్కన నూటికి నూరుపాళ్ళు రాష్ట్ర హైకోర్టులోనే న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు.

42 నైపుణ్య శిక్షణ కేంద్రాలలోని పరికరాలు జగన్ కళ్ళకు కనిపించడం లేదా?
గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 42 నైపుణ్య శిక్షణ కేంద్రాలలోని పరికరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ళకు కనిపించడం లేదా అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం 370 కోట్ల రూపాయలను విడుదల చేయగా, అందులో 40 కోట్ల జీఎస్టీ కోసమే వెచ్చించడం జరిగింది. ఇక మిగిలిన 330 కోట్ల రూపాయలతో 42 నైపుణ్యా శిక్షణా కేంద్రాలలో లక్షలాదిమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. విశాఖపట్నంలోని నైపుణ్య శిక్షణ కేంద్రం అద్భుతంగా ఉన్నదని దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నాతో చెప్పారు. 42 నైపుణ్య శిక్షణ కేంద్రాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి తోపాటు తొట్టి గ్యాంగ్ అంతా పరిశీలిస్తే, వారికి నైపుణ్య శిక్షణ కేంద్రాలలో పరికరాలు ఉన్నాయా? లేదా? అన్నది తెలుస్తుందని ఎద్దేవా చేశారు.

కేవలం 370 కోట్ల రూపాయల కోసమే నానా యాగి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో తన పార్టీ రంగులు వేయడానికి ఖర్చు చేసిన ప్రజాధనం ఎంత?, లిక్కర్, ల్యాండ్, శ్యాండ్ లో ఎంతెంత దోచారు. ఇసుక తవ్వకాలలో మద్రాసు వాడిని ముందు పెట్టి, అక్రమాలకు పాల్పడితే వాడు పారిపోయింది నిజం కాదా?. నీతికి అవినీతికి మధ్య యుద్ధం అని జగన్మోహన్ రెడ్డి నిజమే చెప్పారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి అయితే, నీతికి నిలువెత్తు నిదర్శనం నారా చంద్రబాబు నాయుడు. గత ఎన్నికల కురుక్షేత్రంలో నీతిని కాదనుకొని రాష్ట్ర ప్రజలు అవినీతికి చక్రవర్తిని ఆరాధించారు.

కానీ ఈసారి అటువంటి పొరపాటు చేయరు. 43 వేల కోట్ల అవినీతి సామ్రాట్ కు, 370 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలను మాత్రమే ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడు కి మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రజలంతా చంద్రబాబు వైపే ఉన్నారు. ఇప్పటికే మన పని అయిపోయింది. సొల్లు ఆపేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. చంద్రబాబు నాయుడు పై కక్ష సాధింపులో భాగంగా పిటి వారెంట్లు జారీ చేస్తున్నారు. ఎన్ని పీటి వారెంట్లు జారీ చేసిన ఆయన్ని ఏమీ చేయలేరన్నది జగమెరిగిన సత్యమైతే, అది జగన్ ఎరుగని సత్యమని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు.

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. ఇదే కేసులో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం నుంచి నమోదు చేసిన 161 స్టేట్మెంట్ లో వాయిస్ రికార్డు కూడా ఉండి ఉంటే, వివేక హత్య అందరికంటే ముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసునని తేలిపోతుంది. ఆ విషయం నిర్ధారణ అయితే జగన్మోహన్ రెడ్డి శివ గోవిందా గోవిందా అని పాట పాడుకోవాల్సిందేనని రఘురామకృష్ణం రాజు అన్నారు. చంద్రబాబు నాయుడు విడుదల కోసం శాంతియుత నిరసనలతో పాటు, రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాయాలని, అలాగే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని రఘురామకృష్ణం రాజు ప్రజలను కోరారు.

LEAVE A RESPONSE