– నచ్చచెప్పిన పోలీసులు
– అంగీకరించిన వ్యాపారులు
– ఫలించిన వీహెచ్‌పీ ప్రయత్నం
గోదావరిఖనిలో జట్కా మాంసం కోసం విహెచ్ పి చికెన్ మటన్ నిర్వాహకులకు వినతి పత్రం అందజేశారు .అనంతరం వారు మాట్లాడుతూ హలాల్ మా హిందువుల సంప్రదాయం కాదని , హలాల్ అనేది కేవలం ముస్లింలు మాత్రమే చేస్తారని..గత కొన్ని సంవత్సరాలుగా హలాల్ చేస్తున్న మాంసం , హిందువులకు అమ్మకాలు జరుగుతున్నయన్నారు.
ఈ పద్ధతి హిందువులది కాదని ప్రతి గ్రామంలో హిందువుల కొరకు ప్రత్యేకంగా చికెన్, మటన్ దుకాణాలు ఏర్పాటు చేసి మా హిందూ సాంప్రదాయం ప్రకారం మా హిందువులకు విక్రయించాలని డిమాండ్
చేశారు , వెంటనే స్పందించిన వ్యాపారస్థులు ,ఎవరి పద్దతిలో వారికి ముస్లిం లకు హలాల్హిం. హిందువులకు జట్కా ( మురుదాల్ ) పద్దతిలో ఇస్తామని అంగీకారం తెలిపారని నాయకులు అన్నారు . పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తెలియజేస్తూ, పోలీసులకు వినతిపత్రం అందజేశామన్నారు. పోలీసులు ప్రజల మనోభావాలను గుర్తించి తగు సూచనలు చేయడం జరిగిందని హిందూ పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు.