– ముస్లిం, క్రిస్టియన్గా పుట్టుంటే ఎప్పుడో మత బహిష్కరణకు గురయ్యేవాడు
– బీజేపీ చెంతన చేరినప్పుడే హిందువుల భజన
– బీజేపీ నాయకులు బుద్ధి చెప్పాలి లేదా వదిలించుకోవాలి
– ముస్లింలకు ఏం సమాధానం చెబుతావు?
– తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి
తాడేపల్లి: హిందూ మతానికి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని, ఆయన ముస్లింగానో లేదా క్రిస్టియన్గానో పుట్టి ఉంటే ఈపాటికి ఆ మతాల్లో నుంచి చంద్రబాబు బహిష్కరణకు గురయ్యేవార ని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి స్పష్టం చేశారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, దేవుడి మీద విష ప్రచారం చేస్తూ హిందూ మత విశ్వాసాలను నాశనం చేస్తున్న చంద్రబాబుకి.. బీజేపీ నాయకులు బుద్ధి చెప్పడమో, లేదా ఆయన్ను వదిలించుకోవడమో చేయాలని సూచించారు.
చంద్రబాబుకి దేవుడంటే భయం కానీ, భక్తి కానీ లేనే లేవని.. భయభక్తులు ఉన్నవారు ఇంత నీచంగా తిరుమల లడ్డూ ప్రసాదం గురించి విష ప్రచారం చేయరని మండిపడ్డారు. తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఉన్నాదిలా మారిపోయి కుల మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని చెప్పారు.
1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే తనకు ఏ దేవుడు మీదా నమ్మకం లేదని చెప్పాడు. కానీ 2024లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తన రాజకీయ అవసరాల కోసం శ్రీ వేంకటేశ్వరుడు కుల దైవం అని కొత్తగా ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీని ప్రసన్నం చేసుకోవడం కోసం అదేపనిగా దేవుడి జపం చేస్తున్నాడే కానీ ఆయనకు దేవుడంటే భయం కానీ, భక్తి కానీ లేదు. నిజంగా దేవుడంటే భయభక్తులు ఉన్నవాడు ఇంత నీచంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని, బాత్రూమ్లు కడిగే రసాయనాలు కలిపారని చెబుతారా? ఏ మతంలోనైనా ఇంత నీచంగా దిగజారి దేవుడి మీదనే నిందలు వేసిన వారున్నారా? ఇతర మతాల్లో అయితే చంద్రబాబులా తప్పుడు ప్రకటనలు చేసిన వారిని మత బహిష్కరణ చేసేవారు.
2024లో ఈవీఎంలు మేనేజ్ చేసి చంద్రబాబు ఎలా అధికారంలోకి వచ్చాడో పరకాల ప్రభాకర్ ఆధారాలతో సహా రుజువులు చూపిస్తుంటే, దానిపై టీడీపీ నాయకులు ఎవరూ స్పందించకుండా రెండేళ్లుగా తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు. 1994లో ఎన్టీఆర్ 258 సీట్లతో టీడీపీని అధికారంలోకి తీసుకొస్తే ఈనాడులో నాపై తప్పుడు వార్తలు రాయించి, నన్ను బూచిగా చూపించి 8 నెలల్లోనే అధికారం లాగేసుకున్నాడు. పిల్లనిచ్చి మామ అనే గౌరవం లేకుండా ఎన్టీఆర్ వ్యక్తిత్వం గురించి ఎన్ని రకాలు విషప్రచారం చేశాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
యూనివర్సిటీ స్థాయి నుంచే రెడ్డి, కమ్మ అంటూ కుల విద్వేషాలు రెచ్చగొట్టడం చంద్రబాబుకి అలవాటు. అవసరానికి బీజేపీ పంచన చేరడం, హిందూ మతోద్ధారకుడిలా ప్రచారం చేసుకోవడం.. బీజేపీ నుంచి బయటకొచ్చినప్పుడు ఇతర మతాల పక్షాన మాట్లాడటం ఆయన నైజం. బీజేపీ నుంచి బయటకొచ్చాక ముస్లింలకు క్షమాపణలు చెప్పాడు. ఎప్పటికీ బీజేపీ పంచన చేరనన్నాడు. ఇప్పుడు ముస్లింలకు ఏం సమాధానం చెబుతాడు? కులమతాలను రాజకీయ అవసరాలకే తప్ప, చంద్రబాబుకి దేవుడంటే భక్తి విశ్వాసం ఏమాత్రం లేదు. ఎన్టీఆర్ కుటుంబం అంటే ఆయనకు ఏమాత్రం అభిమానం లేదు. హెరిటేజ్ సంస్థలో పెట్టుబడులు పెట్టించి చంద్రబాబు తనను ముంచేశాడని మోహన్ బాబే చెప్పారు.