ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తి రూ.5 కోట్లు.. ఇప్పుడు ఆయన ఆస్తి వెయ్యి కోట్లు
-దోచుకున్న డబ్బు మొత్తం కక్కిస్తా
-రూ.5 కోట్లు మాత్రమే ఉంచి మిగిలిన రూ.995 కోట్లు పేదలకి పంచుతాం
-టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం
-జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం
-మహిళల తాళిబొట్లు తాకట్టు పెడుతున్నాడు చోర్ మోహన్
-బీసీల రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం
-బీసీ సంక్షేమం పై నేను చర్చకు సిద్ధం
-ఎవరి హయాంలో బీసీలకు మేలు జరిగిందో చర్చించేందుకు నువ్వు సిద్ధమా జగన్?
-ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి బహిరంగ సభలో నారా లోకేష్
చేనేత పుట్టినిల్లు ధర్మవరం. పేరులోనే కాదు ఈ నేలలోనే ధర్మం ఉంది.చిత్రానదికి అడ్డుకట్ట వేసి నీరు నిలిపి సస్యశామలం చేసిన ప్రాంతం ఇది.ఎంతో శక్తివంతమైన లక్ష్మీ చెన్నకేశవస్వామి, కోరిన కోర్కెలు తీర్చే కాటి కోటేశ్వర స్వామి కొలువై ఉన్న నేల ఇది.ఇలాంటి గొప్ప నేల పై పాదయాత్ర చేసే అవకాశం రావడం నా అదృష్టం. యువగళం పాదయాత్ర 58 రోజులు అయ్యేసరికే 4గురు మంత్రులు ప్యాకప్ అంట.ఇక 400 రోజుల పాదయాత్ర పూర్తయితే ఫ్యాన్ మాడి మసైపోవడం ఖాయం. నేను ముందే చెప్పా మై డియర్ జగన్ రెడ్డి…నేను టెర్రరిస్టును కాదు…వారియర్ ని అని.అయినా వినలేదు రాజారెడ్డి రాజ్యాంగం పట్టుకొని వచ్చాడు. నేను అంబేద్కర్ గారి రాజ్యాంగం పట్టుకొని నడిచాను.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎం అయ్యిందో చూసారుగా ప్రజలు కొట్టిన దెబ్బకి గిలగిలా కొట్టుకుంటున్నాడు.జగన్ రెడ్డి చేసేవి అన్ని దొంగ పనులే అందుకే ఆయనకి చోర్ మోహన్ అని పేరు పెట్టా. ఎందుకో చెప్పమంటారా? కోడికత్తి, బాబాయ్ గుండెపోటు అంటూ డ్రామాలు ఆడాడు. ఇప్పుడు మరోసారి ఏప్రిల్ 1న రాష్ట్ర ప్రజల్ని మరోసారి ఫూల్స్ చెయ్యాలని కొత్త డ్రామా మొదలుపెట్టాడు. శ్రీకాళహస్తి లో ఒక బడా చోర్ ఉన్నాడు. అతను నోటికొచ్చింది మాట్లాడతాడు. జగన్ సీఎం కాకుండా ఉండేందుకు చంద్రబాబు గారు నరబలి ఇచ్చారు అని ఆరోపణలు చేస్తున్నాడు. అయ్యా బడా చోర్ నరబలి ఇచ్చింది మీ అధ్యక్షుడు చోర్ మోహన్. సీఎం పదవి కోసం సొంత బాబాయ్ ని నరబలి ఇచ్చాడు.చోర్ మోహన్ ఇంకో ప్రచారం మొదలుపెట్టాడు. టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తుంది అని వాలంటీర్లతో ప్రచారం చేయిస్తున్నాడు.
రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసిందే టిడిపి.టిడిపి హయాంలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యాలి అంటే నీ తరం కాదు జగన్.అన్న క్యాంటీన్, పండుగ కానుక, పెళ్లి కానుక, ఫీజు రీయింబర్స్మెంట్, చంద్రన్న భీమా, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్య, 6 లక్షల పెన్షన్లు ఇలా అనేక కార్య్రమాలను కట్ హిస్టరీ చోర్ మోహన్ ది. చోర్ మోహన్ దగ్గర రెండు బటన్స్ ఉంటాయి. ఒక బటన్ నొక్కితే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడతాయి. బల్ల కింద ఉండే రెండో బటన్ నొక్కితే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతాయి. కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచాడు , ఇంటి పన్ను పెంచాడు , చెత్త పన్ను వేసాడు, ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచాడు , నిత్యావసరాలు ధరలు, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపీ నంబర్1.
చోర్ మోహన్ యువతను నమ్మించి చీట్ చేసాడు.జగన్ పాలనలో ఖైదీలకు ఇచ్చే సౌకర్యాలు కూడా విద్యార్థులకు ఇవ్వడం లేదు. ఖైదీలకు నెలకు రెండు వేలు ఖర్చు చేస్తుంటే విద్యార్థులకు కేవలం వెయ్యి రూపాయిలు మాత్రమే మెస్ ఛార్జీలు ఇస్తున్నారు.జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.మహిళల తాళిబొట్లు తాకట్టు పెడుతున్నాడు చోర్ మోహన్మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25వేల కోట్లు అప్పు తెచ్చాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు.
టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం.రైతుల్ని ముంచేసాడు చోర్ మోహన్.జగన్ పరిపాలన లో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. అవి ఏంటో తెలుసా గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. , అర్బికే సెంటర్లు ఒక మోసం…మొత్తం నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు రాష్ట్రంలో అందిస్తున్నారు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. ఉద్యోగస్తులను వదిలిపెట్టలేదు చోర్ మోహన్.వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. బీసీలకు వెన్నుపోటు పొడిచాడు చోర్ మోహన్. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం.బీసీ సంక్షేమం పై నేను చర్చకు సిద్ధం. ఎవరి హయాంలో బీసీలకు మేలు జరిగిందో చర్చించేందుకు నువ్వు సిద్ధమా జగన్? మైనార్టీ సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు.మైనారిటీలను వైసిపి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది.దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు.మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు.పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది.
కర్నూలు లో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లికి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది. బిజేపి తో పొత్తు లో ఉన్నప్పుడు కూడా టిడిపి మైనార్టీలను ఇబ్బంది పెట్టలేదు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం.చోర్ మోహన్ నేను రాయలసీమ బిడ్డ అంటాడు కానీ ఆయన రాయలసీమ కు పట్టిన క్యాన్సర్ గడ్డ. అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది.రాయలసీమ రైతులకు టిడిపి హయాంలో ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసాడు జగన్ రెడ్డి. ఎస్సి,ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ, మిగిలిన వారికి 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. ఇక్కడ ఉన్న చీని, టమాటో, వేరుశనగ రైతులకు గిట్టుబాటు ధరతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. హంద్రీనీవా, గాలేరు నగరి ఇలా టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. జగన్ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే.అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు.రిలయన్స్, అమరరాజా, జాకీ వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు.
ధర్మవరం ఎమ్మెల్యే పేరు కేతిరెడ్డి. వెంకటరామిరెడ్డి. మీ ఎమ్మెల్యే చేసిన అరాచకాల గురించి తెలుసుకున్నాకా ఆయన కేతిరెడ్డి కాదు నంబర్ వన్ కేటు గాడు అని అర్థమైంది. ఎమ్మెల్యే అయిన తరువాత ఆయనకి ప్రతి రోజూ గుడ్ మార్నింగే! ఎందుకో తెలుసా ముందు రోజు కలక్షన్ అంతా ఉదయమే ఇంటికి వచ్చేస్తుంది.ఈయన ఎమ్మెల్యే అయిన తరువాత ధర్మవరం ప్రజలకు మాత్రం ప్రతిరోజూ బ్యాడ్ మార్నింగే! ఎందుకో తెలుసా ఎమ్మెల్యే ఎవరి స్థలం కబ్జా చేస్తాడో అన్న భయం. టిడిపి హయాంలో ధర్మవరం ధర్మం ఉండేది. కేటు గాడు ఎమ్మెల్యే అయ్యాకా ధర్మవరంలో మొత్తం అధర్మమే!గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఉదయాన్నే టౌన్లో నడుస్తాడు. ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయా అని చూస్తాడు. సాయంత్రానికి ఎమ్మెల్యే కబ్జా గ్యాంగ్ రంగంలోకి దిగి భూమిని కబ్జా చేస్తుంది. ఇలా ఒక్క ధర్మవరం టౌన్ లోనే 50 ఎకరాలు కొట్టేసాడు. ధర్మవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ప్రతినెల 30 లక్షల వాటా వెళ్తుంది. ఎవరైనా వెంచర్ వెయ్యాలి అంటే ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే.ధర్మవరం టౌన్ ని అనుకోని ఉన్న ఎర్రగుట్టను మింగేసి ఫామ్ హౌస్ కట్టాడు. 20 ఎకరాల భూమి స్వాహా. ఎస్టీ భూములను దౌర్జన్యంగా లాక్కొని తమ్ముడి భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఫామ్ హౌస్ లో రేసింగ్ ట్రాక్, గుర్రపు స్వారీ కోసం ప్రత్యేక రోడ్డు వేయించుకున్నాడు. బోటింగ్ కోసం చెరువులో ప్రత్యేక పాయింటు ఏర్పాటు చేసుకున్నాడు.
గుట్టపై ఉన్న అమ్మవారి ఆలయాన్ని పడగొట్టేసి అందులో ఉన్న గుప్తనిధుల్ని కాజేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విషయం బయటకు రాకుండా జేసిబి డ్రైవర్ ను చంపేశారానే ఆరోపణలు ఉన్నాయి. ఈయన ఎంత దుర్మార్గుడు అంటే ఈయన సరదగా బోటులో తిరగడానికి వాటర్ లెవల్ ఉండాలని వ్యవసాయానికి నీరు వదలలేదు. 2 వేల ఎకరాలకు నాలుగేళ్లుగా నీరు విదుదల చెయ్యలేదు. భూములు కబ్జా చేయడంలో ఎమ్మెల్యే స్టైలే వేరు.. ముందు తాను కాజేయాలనుకున్న భూమి యజమానికి లేదా రైతుకు రెవెన్యూ అధికారుల ద్వారా నోటీసులు ఇప్పిస్తాడు. ఈ భూమి అసైన్డ్ భూమి అని.. సాగులో లేనందున తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని నోటీస్ ఇప్పిస్తాడు.. అప్పుడు ఆ రైతులు ఏం చేయాలో తెలియక భయపడి పోతారు. అప్పుడు ఈ ఎమ్మెల్యే తన అనుచరులని రైతుల దగ్గరకు పంపించి భూమిని తమకు అమ్మేయాలని బేరం పెడతారు. అప్పటికే భయపడిన రైతులు ఎంతో కొంత వస్తుందిలే అనే వీరికి తక్కువ ధరకు అమ్ముకుంటారు. ఇలా ధర్మవరం మెయిన్ రోడ్డుకు అనుకొని ఉన్న వందల ఎకరాలను స్వాధీనం చేసుకున్నాడు.
ధర్మవరం మండలం గరుడంపల్లి వద్ద సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం టిడిపి హాయంలో 106 ఎకరాలు కేటాయించాం. ఈ ధర్మవరం ఎమ్మెల్యే ఆ కంపెనీ యజమానులను బెదిరించి 106 ఎకరాలను తమ్ముడి పేరుతో రాయించుకున్నాడు. ఆ కంపెనీ ఐదేళ్ల క్రితం ఎకరా మూడున్నర లక్షలతో కొనుగోలు చేసింది. ఐదేళ్ల తర్వాత ఎకరా మూడు లక్షలకే ఎమ్మెల్యే తమ్ముడికి అమ్మేసిందంటే దీని వెనుక ఈ కేటు రెడ్డి బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్తం చేసుకోవచ్చు. ఈ డీల్ లో ఎమ్మెల్యే కొట్టేసింది 50 కోట్లు. ముదిగుబ్బ మండలంలో ఈ ఎమ్మెల్యే అనుచరుడు నారాయణరెడ్డి అని ఒక వ్యక్తి ఉన్నాడు. ముదిగుబ్బ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ స్థలాలు మొత్తం కబ్జా చేశాడు. సుమారు 50 కోట్లు విలువ చేసే 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ప్లాట్లుగా చేసి అమ్మేస్తున్నాడు. కావాలంటే సర్వే నంబర్లు.. ఆధారాలతో సహా అందిస్తాను. నారాయణరెడ్డి చర్యలు తీసుకునే ధైర్యం ఈ అధికారులకు గానీ.. ఈ ఎమ్మెల్యే గాని ఉందా అని సవాల్ చేస్తున్నా..
ధర్మవరం పట్టణంలోని మున్సిపల్ రిజర్వడ్ స్థలాలను ఎమ్మెల్యే అనుచరులు విచ్చలవిడిగా ఆక్రమించుకొని అమ్ముకుంటున్నారు. సర్వే నంబర్లతో సహా అన్ని ఆధారాలు ఇస్తాం చర్యలు తీసుకునే దమ్ముందా.ధర్మవరం బస్టాండ్ ఎదురుగా సాయి నగర్ కాలనీలో సుమారు 500 మంది 30 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. ఇప్పుడు ఒక కాలనీ మొత్తం నాదని ఎమ్మెల్యే చెబుతున్నాడు. డబ్బులు చెల్లించకపోతే ఇల్లు పడగొట్టి ఖాళీ చేయిస్తానని పేదలపై దౌర్జన్యం చేస్తున్నాడు. ఇప్పటికే అధికారుల నుంచి నోటీసులు కూడా ఇప్పించాడు. ఈ భూమి విలువ సుమారు 100 కోట్లు ఉంటుంది. ఎమ్మెల్యే ఇసుక దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఉప్పలపాడు రీచు నుంచి రోజు వందల కొద్ది టిప్పర్లు బెంగళూరుకు వెళ్తున్నాయి. పేరుకే జెపి వెంచర్స్ కి కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ ఈ పెత్తనం మొత్తం ఈ కేటు రెడ్డిదే. నలుగురు అనుచరులను బినామీలుగా పెట్టుకొని ఇసుక దందా చేస్తున్నాడు. నదికి అనుకోని ఉన్న పొలాలను కూడా వదలడం లేదు. ఇటీవల తన పొలంలో ఇసుక తవ్వకాలు చేపట్టవద్దని ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం కూడా చేశాడు. వీరి దౌర్జన్యాలకు అడ్డుచెప్పిన జిల్లా మైనింగ్ అధికారిని బదిలీ చేయించారు. వీరి ఒత్తిళ్లకు తట్టుకోలేక మరో అధికారి సెలవు పై వెళ్ళిపోయాడు.
తాము అధికారంలోకి వస్తే చిత్రావతి రిజర్వాయర్ ముంపు గ్రామాలకు పెద్ద మొత్తంలో పరిహారం ఇస్తామని చెప్పిన ఎమ్మెల్యే . తన అనుచరులను ముంపు బాధితుల జాబితాలో చేర్చి సుమారు 20 కోట్లు కాజేశాడు. కావాలంటే కలెక్టర్ గారికి ఆధారాలు సమర్పిస్తాం. చర్యలు తీసుకునే ధైర్యం ఉందా?? ఎమ్మెల్యే రాజీనామా చేస్తాడా? టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి నాయకుల భూకబ్జాల పై మొదటి సిట్ వేసేది ధర్మవరంలోనే. డిఎస్పీ స్థాయి అధికారి, రిటైర్డ్ జడ్జ్ని పెట్టి సిట్ వేస్తాం. ఎమ్మెల్యే దోచుకున్న భూములు అన్ని పేదలకు పంచుతాం. ఎమ్మెల్యే ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తి రూ.5 కోట్లు. ఇప్పుడు ఆయన ఆస్తి వెయ్యి కోట్లు. దోచుకున్న డబ్బు మొత్తం కక్కిస్తా. రూ.5 కోట్లు మాత్రమే ఉంచి మిగిలిన రూ.995 కోట్లు పేదలకి పంచుతాం. ధర్మవరాన్ని అభివృద్ధి చేసింది టిడిపి. పేదలకు టిడ్కొ ఇళ్లు, పేదలకు ఇళ్ల పట్టాలు, గ్రామాల్లో సిసి రోడ్లు, ఎల్ఈడి విధి దీపాలు, నీటి కుళాయి కనెక్షన్లు. ధర్మవరం చెరువు నుండి 4 ఏళ్ళు వ్యవసాయానికి నీళ్లు ఇచ్చాం. 386 కిలోమీటర్ల తారు రోడ్డు వేసాం. ధర్మవరం లో 4 లైన్ రోడ్డు వేసాం. 20 వేల ఇల్లు కట్టాం. 20 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 10 వేల టిడ్కొ ఇళ్లు శాంక్షన్ చేసాం.
పాదయాత్రలో భాగంగా ధర్మవరం వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రతి చేనేత కార్మికుడికి సంవత్సరానికి 24 వేలు అందిస్తానని హామీ ఇచ్చాడు. అయితే అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత నేతన్న నేస్తం అంటూ పథకాన్ని ప్రారంభించాడు. కార్మికులకు కాకుండా సొంత మగ్గం ఉన్నవాళ్లకి మాత్రమే పథకం అంటూ ఫిట్టింగ్ పెట్టారు. అందులోను కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని.. ఫోర్ వీలర్ ఉందని.. పది ఎకరాల భూమి ఉందని చెప్పి 15 వేల మందికి కోత విధించారు. ధర్మవరం నియోజకవర్గంలో 80 వేల మందికి పైగా చేనేతలు ఉంటే కేవలం 8 వేల మందికి మాత్రమే నేతను నేస్తం ఇస్తున్నారు. టిడిపి ప్రభుత్వంలో చేనేత వృత్తిపై ఆధారపడిన వారిని ఆదుకోవడం కోసం ముడి పట్టుపై రాయితీ అందించాం. ఒక్కొక్కరికి నెలకు 2000 రూపాయల వరకు రాయితీ అందించాము. ధర్మవరం నియోజకవర్గంలో సుమారు 25 వేల మందికి ప్రతినెల 2000 ఇచ్చి వ్యాపారానికి చేయూత అందించాం. అంటే ఒక్కొక్కరికి సంవత్సరానికి 24 వేల రూపాయలు గతంలోనే ఇచ్చాము. జగన్ కొత్తగా వచ్చి పథకంలో 15 వేల మందికి కోత పెట్టడం తప్ప కొత్తగా ఇచ్చింది ఏమి లేదు.
టిడిపి ప్రభుత్వంలో చేనేత కార్మికులకు ఆదరణ పథకం ద్వారా పరికరాలు అందించాం. ధర్మవరం నియోజకవర్గంలోనే పదివేల మంది చేనేతలకు ఆదరణ పథకం కింద పనిముట్లు ఇచ్చి ప్రోత్సహించాం. అలాగే అనంతపురం జిల్లాలో ధర్మవరం, పుట్టపర్తి, ఉరవకొండ ప్రాంతాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేసి చేనేత వృత్తిలో నైపుణ్యాలను పెంపొందించుకోవడం కోసం సుమారు పదివేల మందికి శిక్షణ అందించాం. శిక్షణ పొందిన వారికి రుణాలు ఇప్పించి వ్యాపారాలు పెట్టుకునేలా ప్రోత్సాహం అందించాము. టిడిపి ప్రభుత్వంలో చేనేత ఉత్పత్తులపై ఒక్క శాతం కూడా పన్ను విధించలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి చేనేత ఉత్పత్తిపై 18 శాతం జీఎస్టీ విధించి చేనేతలను కోల్కోలేని దెబ్బ కొట్టాడు. ఒక్కో చేనేత కార్మికుడు తయారు చేసే 10 వేల రూపాయల చీరపై.. 1800 రూపాయలు జగన్ లాక్కుంటున్నాడు. టిడిపి ప్రభుత్వం లో పట్టు వస్త్రాల విదేశీ ఎగుమతులను భారీగా ప్రోత్సహించాము.. వ్యాపారుల్ని ఇతర దేశాలలో అనుసంధానం చేసి సాఫీగా ఎగుమతులు సాగేలా చర్యలు తీసుకున్నాం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేనేతలకు చేనేత రుణమాఫీ కింద 110 కోట్ల రూపాయలు చెల్లించాం. 2 వేల రూపాయల పెన్షన్ అందించాం.
వైసిపి ప్రభుత్వ హయాంలో 53 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుండి పరిహారం అందలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యార్న్ సబ్సిడీ, కలర్ సబ్సిడీ అందిస్తాం. టిడ్కొ ఇళ్ళు కేటాయిస్తాం. కామన్ వర్కింగ్ షెడ్లు నిర్మిస్తాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తాం. చేనేత వస్త్రాలకు జీఎస్టి లేకుండా చేస్తాం. ధర్మవరం మళ్ళీ అభివృద్ధి చెందాలి అన్నా, పరిశ్రమలు వచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి అన్నా భారీ మెజారిటీతో టిడిపిని గెలిపించండి.