ఎన్ని సార్లు నడుం వంచాడో! ఇటుక పెట్టడానికి ఓ సారి, కరెనతో సిమెంట్ వెయ్యడానికి ఓ సారి, కొబ్బరి కాయ కొట్టడానికి ఓ సారి, హారతి ఇవ్వడానికి ఓ సారి, ఇలా ఐదు చోట్ల ఇరవై సార్లకు పైగా..!
విశాఖలో ఐటి పండుగ… ఐదు శంకుస్థాపనలు, ఒకేరోజు!
విశాఖపట్నం మధురవాడ ఐటి హిల్స్… గురువారం ఉదయం నుంచి అక్కడ వాతావరణం మారిపోయింది. ఒకేరోజు ఐదు కంపెనీలకు భూమిపూజ… లోకేష్ చేతిలో ఐటి విప్లవానికి శంకుస్థాపన! సిఐఐ సమ్మిట్‌కు ముందు రోజు… మంత్రి నారా లోకేష్ ఐటి రంగంలో చరిత్ర సృష్టించారు. ₹3,800 కోట్ల పెట్టుబడులతో 5 సంస్థలకు భూమిపూజ చేసి, 30,000 ఉద్యోగాల దిశగా తొలి అడుగు వేశారు. గూగుల్ ఎఐ హబ్ ప్రకటన తర్వాత విశాఖపై పెట్టుబడిదారుల చూపు ఎలా మారిందో… ఈ రోజు దానికి ప్రత్యక్ష ఉదాహరణ!
శంకుస్థాపనల శ్రేణి:
– సెయిల్స్ సాఫ్ట్వేర్: ₹21 కోట్లతో ఎఐ ఎక్సలెన్స్ సెంటర్, 430 ఉద్యోగాలు.
– ఐస్పేస్ సాఫ్ట్వేర్: ₹119.18 కోట్ల పెట్టుబడి, 2,000 ఉద్యోగాలు.
– ఫీనోమ్ పీపుల్స్: ₹207.5 కోట్లతో గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్, 2,500 ఉద్యోగాలు.
– రహేజా డెవలప్మెంట్ స్పేస్: ₹2,172 కోట్లతో ఐటి, రెసిడెన్షియల్ స్పేస్, 15,000 ఉద్యోగాలు.
– వరల్డ్ ట్రేడ్ సెంటర్: ₹1,250 కోట్ల పెట్టుబడి, 15,000 ఉద్యోగాలు.
ఐటి రంగం… ఇప్పుడు విశాఖకు వందనం!
ఎఐ, క్లౌడ్, గ్లోబల్ డెలివరీ, డాటా సెంటర్లు, జిసిసి కంపెనీలు… ఇవన్నీ ఇప్పుడు విశాఖలో అడుగుపెడుతున్నాయి. టిసిఎస్, కాగ్నిజెంట్ ఒప్పందాల తర్వాత… కొత్త కంపెనీలు కూడా క్యూ కడుతున్నాయి. పారిశ్రామికవేత్తల ఉత్సాహం మధ్య, లోకేష్ పర్యటనకు నగర ప్రజలు నీరాజనాలు పట్టారు. తర్వాత వచ్చి సిఐఐ వేదికలో రోజంతా.. రాత్రి మళ్లీ.. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకకు హాజరైయ్యాడు, విజయనగరం భోగాపురం వెళ్లి. పొద్దున దిగింది ఢిల్లీ నుండి వచ్చి వైజాగులో. కష్ట పడడంలో.. నాయుడికి తీవ్ర పోటీ ఆయన అబ్బాయే.