Suryaa.co.in

Andhra Pradesh

ఉచిత పంటల బీమా పేరుతో జగన్ ప్రభుత్వం రైతుల కొంప ముంచింది

• పంటలు నీళ్లపాలై రైతులు బోరుమంటుంటే, జగన్ రెడ్డి తాడేపల్లిలో సంబరాలు చేసుకుంటున్నాడు
• రైతులకన్నీళ్లు కష్టాలు పట్టని అభినవ నీరోచక్రవర్తి జగన్మోహన్ రెడ్డి
• బడ్జెట్లో రూ.2,943కోట్లు కేటాయించిన జగన్, కేవలం రూ.1193 కోట్లుమాత్రమే ఖర్చుపెట్టి, పంటలబీమాకు కోతపెట్టి, రైతులనోట్లో మట్టికొట్టాడు
• డిసెంబర్ 31లోపు ప్రభుత్వవాటాగా చెల్లించాల్సిన పంటబీమాసొమ్ము 80శాతాన్ని జగన్ ప్రభుత్వం చెల్లించలేదని కేంద్రప్రభుత్వ ఫసల్ బీమా వెబ్ సైట్ చెబుతోంది
• ప్రతిఎకరాకు నష్టపరిహారం ఇస్తానన్న జగన్, 50లక్షలమంది రైతులుంటే, 25లక్షలమందికే పంటలబీమా సొమ్ము అందించి చేతులుదులుపుకున్నాడు
• రైతులకు న్యాయంచేస్తామంటూప్రభుత్వమిచ్చిన జీవోలు కాగితాలకే పరిమితమయ్యాయి
• అకాలవర్షాలతో నష్టపోయిన ప్రతిరైతుని ఆదుకునేవరకు చంద్రబాబుగారు టీడీపీ ప్రభుత్వాన్ని వదిలపెట్టవు
మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్

అకాలవర్షాలకు రాష్ట్రంలో 5లక్షలకు పైనఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, రైతులు తాము పండించిన ఉత్ప త్తుల్ని అమ్ముకోవడానికి నానాఅగచాట్లు పడుతున్నారని, రంగుమారిన ధాన్యం కొనే దిక్కులేకుండా పోయారని, ధాన్యాన్నికొని రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, దున్నపోతుమీద వానపడిన చందంగా వ్యవహరిస్తోందని, ప్రతిపక్ష నేత చంద్రబాబు రోడ్డెక్కి పోరాడినాకూడా పాలకుల్లో చలనంలేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసన సభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే మీకోసం…!

“అకాలవర్షాలనుంచి పంటల్ని కాపాడుకోవడానికి రైతులు నానాఅవస్థలుపడుతుంటే, జగన్ ప్రభుత్వంమాత్రం అర్భాటపు ప్రకటనలకే పరిమితమైంది. క్షేత్రస్థాయిలో అధికారులు, మంత్రు లు ఎవరూ రైతుల్నికలిసి వారిగోడు విన్నదిలేదు. జగన్ గొప్పగా చెప్పే రైతుభరోసా కేంద్రాలు రైతుదోపిడీ కేంద్రాలుగా మారాయి. న్యాయంచేయాలంటూ అన్నదాతలు ఆందోళనచేస్తున్నా , బాధ్యతగలప్రతిపక్షంగా తమపార్టీ, తాము వారికిఅండగా నిలిచి, వారితరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఉపయోగంలేకుండా పోయింది.

ప్రభుత్వం గొప్పగా చెప్పిన ఉచిత పంటల బీమా పథకమే వాళ్ల కొంపలు ముంచింది
నేడు రైతులు ధాన్యం అమ్ముకోవాలంటే మిల్లర్ల నిలువుదోపిడీకి బలికావాల్సిన దుస్థితి రాష్ట్రం లో ఉంది. ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తుంటే, వారు కష్టజీవుల కష్టాన్ని చులకనగా చూస్తున్నారు. తేమశాతం ఎక్కువగాఉందని, మొలకెత్తిందని చెబుతూ, ధాన్యాన్ని చౌకగా కొట్టేస్తున్నారు. మిల్లర్లదోపిడీ, రవాణాఛార్జీలు, ఇతరఖర్చులు భరించలేక, ధాన్యాన్ని అమ్ముకోలేక, దారిలో వదిలేయలేక రైతులుపడుతున్న వేదన అంతాఇంతా కాదని చెప్పడానికి నిజంగా బాధపడుతున్నాం. వర్షాలకు తడిచిన, రంగుమారిన ధాన్యం, మిర్చి, జొన్న, మొక్కజొన్న,ఇతర అపరాల కొనుగోలుదిశగా ప్రభుత్వం ఒక్కచర్య తీసుకున్నదిలేదు. రైతు లు కన్నీళ్లతో విలపిస్తుంటే, అభినవ రోమ్ చక్రవర్తి అయిన జగన్ తాడేపల్లిప్యాలెస్ లో సంబరాలు చేసుకుంటన్నాడు. ప్రజలుఎన్నుకున్న ముఖ్యమంత్రి, రైతులవద్దకెళ్లి వారితోమాట్లాడి ఎందుకు న్యాయంచేయలేకపోతున్నాడని ప్రశ్నిస్తున్నాం. రైతులుగోడు పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి అభినవనీరో చక్రవర్తి కాక ఏమవుతాడు?

వ్యవసాయమంత్రి మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. నిమిషానికోమాట, పూటకో వాగ్ధానంతో వ్యవసాయమంత్రి కాలం వెళ్లబుచ్చుతున్నాడు. మంత్రి గొప్పగాచెప్పిన ఉచిత పంటల బీమాపథకమే రైతులకొంపలుముంచి, వాళ్లను దిక్కులేనివాళ్లను చేసింది అని చెప్ప డానికి నిజంగాబాధపడుతున్నాం. రూ.2,943కోట్లను రివైజ్ బడ్జెట్లో చూపిన జగన్ ప్రభు త్వం, పంటల బీమాకింద ఖరీఫ్ లో చెల్లించింది మాత్రం కేవలం రూ.1193కోట్లు మాత్రమే. రాష్ట్రంలో 50లక్షలమందిఅన్నదాతలుంటే, కేవలం 25లక్షలమందికి మాత్రమే పంటలబీమా సొమ్ము చెల్లించారు.అదికూడా కేవలంబ్యాంకుల్లో లోన్లు తీసుకున్నవారికి మాత్రమే చెల్లించా రు. ఈ వివరాలన్నీ ఫసల్ బీమాయోజన పథకానికి సంబంధించిన సమాచారంలో ఉన్నా యి. బ్యాంకుల్లోకాకుండా, బయట, ప్రైవేట్ వ్యక్తులవద్ద రుణాలుతీసుకున్న రైతులకు ప్రభుత్వం రూపాయికూడా పంటలబీమాసొమ్ము చెల్లించకపోవడం దుర్మార్గంకాదా అని ప్రశ్నిస్తున్నాం. మంత్రిచెప్పిన 66, 67జీవోలు కేవలం రైతుల్ని మభ్యపెట్టడానికే. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రబీలో రైతులతరపున ప్రభుత్వం కట్టాల్సిన పంటలబీమా ప్రీమియం సొమ్ముని డిసెంబర్ 31లోపునే 80శాతంసొమ్ము చెల్లించాల్సిఉండగా జగన్ ప్రభుత్వం ఆపని చేయలేదు. దాంతోచాలామంది రైతులు పంటలునష్టపోయి ప్రభుత్వం నుం చి వస్తుందనుకున్న పంటలబీమాసొమ్ము రాక తల్లడిల్లిపోతున్నారు. కేంద్రప్రభుత్వ ఫసల్ బీమాయోజన పథకం వెబ్ సైట్లో ఎక్కడా ఏపీపేరే కనిపించడంలేదు. జగన్, వ్యవసాయ మంత్రి గోవర్థన్ రెడ్డి రైతులకు అదిచేశాం.. ఇదిచేశాం.. ఇంకా చేస్తున్నామన్న మాటలన్నీ పచ్చిబూటకాలే అనడా నికి ఫసల్ బీమా వెబ్ సైట్లోని సమాచారమే నిదర్శనం.

చంద్రబాబుని, టీడీ పీనేతల్ని విమర్శించడం తప్ప వ్యవసాయ మంత్రికి రైతుల బాధలు పట్టడం లేదు
వ్యవసాయమంత్రి మాటలు కోటలుదాటుతుంటే, చేతలు గడపకూడా దాటడంలేదు. పొద్దున లేస్తే చంద్రబాబుని, టీడీపీనేతల్ని విమర్శించడంతప్ప మంత్రికి తనశాఖలో ఏంజరుగుతోంది, రైతులపరిస్థితిఏమిటి, వారిబాధలేమిటి ఆలోచన లేకుండాపోయింది. పంటలబీమాసాయం విషయంలో జగన్ ప్రభుత్వం రైతులకు చేసిందిశూన్యం. రైతులకు గతంలో టీడీపీప్రభుత్వం ఏంచేసిందో, నాలుగన్నరేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏంచేశాడో బహిరంగంగా చర్చించడానికి తాముసిద్ధం. వ్యవసాయమంత్రి మాతో చర్చకు వస్తాడా అని నిలదీస్తున్నాం. చర్చ అనగానే ఏవేవో మాట్లా డి తప్పించుకోవడం వైసీపీనేతలు, మంత్రులకు అలవాటుగామారింది.

చంద్రబాబు హాయాంలో నిబంధనలు సడలించి ధాన్యం కొనుగోళ్లు జరిపి రైతుల్ని ఆదుకున్నారు
చంద్రబాబుగారి హాయాంలో రైతులునష్టపోయిన ప్రతిపంటకు పరిహారం అందించారు. మొక్క జొన్నకు గిట్టుబాటుధరలేదని ప్రభుత్వంతరుపున క్వింటాల్ కు రూ.200లు చెల్లించారు. మిర్చికి గిట్టుబాటుధరలేదని క్వింటాకు రూ.600చొప్పున టీడీపీప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులువేసింది. తుఫాన్లు, అకాలవర్షాలతో ధాన్యంతడిసిపోతే, నిబంధనలు సడలించి మరీ టీడీపీప్రభుత్వం గిట్టుబాటుధరకు కొనుగోలుచేసింది. ఇలా తమప్రభుత్వంలో తమ నాయకుడు రైతులకు ఏంచేశాడో చెప్పడానికి మేంచేసిన మంచి చాలాఉంది. తాను ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు, పంటలసాగు పెరగడానికి, నీటిపారుదలరంగానికి ఇదిగో ఇదిచేశానని జగన్మోహన్ రెడ్డిగానీ, అతని భజనబృందంగానీ చెప్పగలరా?

అకాలవర్షాలతో నష్టపోయిన ప్రతిరైతుని ఆదుకునేవరకు చంద్రబాబు ప్రభుత్వాన్ని వదిలపెట్టరు
ప్రభుత్వం ఉత్తుత్తిమాటలు, ఊకదంపుడు ఉపన్యాసాలకు పరిమితం కాకుండా రైతుల్ని ఆదు కునేదిశగా అడుగులు వెయ్యాలి. రైతులవద్ద ఉన్న ప్రతిధాన్యం గింజను ప్రభుత్వమే కొనాలి. అకాలవర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి. వాణిజ్యపంటలకు ఎకరాకు రూ.50వేలు, అపరాలపంటలకు ఎకరాకు రూ.25వేలకోట్ల పరిహారం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వ పసల్ బీమా యోజన వెబ్ సైట్లో ఏపీ పేరు ఎందుకులేదో, పంటబీమాతాలూకా సొమ్ముని డిసెంబర్ 31లోపు 80శాతంఎందుకు చెల్లించలేదో వ్యవసాయమంత్రి, ముఖ్యమంత్రి రైతులకు సమాధానంచెప్పాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఉచితవ్యవసాయ బీమాపథకం పచ్చి బూట కం. రాష్ట్రంలో భారీస్థాయిలో పంటనష్టం జరిగితే ఒక్కజిల్లాలో కూడా వ్యవసాయశాఖాధికారు లు పర్యటించి, రైతులతో మాట్లాడిందిలేదు. పంటనష్టం అంచనాకూడా సరిగా వేయని ప్రభుత్వం రైతులకు ఏంన్యాయంచేస్తుంది? అకాలవర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకునేవరకు చంద్రబాబుగారు, టీడీపీ ఈప్రభుత్వాన్ని వదిలిపెట్టదు” అని నరేంద్ర తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE