15వ తేదీన ఏకకాలంలో 9 జిల్లాల్లో మెడికల్ కాలేజీ ల ప్రారంభం
ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్
15వ తేదీన జరిగే మెడికల్ కాలేజీ ల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయా జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు
20,000 మందికి తగ్గకుండా ర్యాలీ నిర్వహించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచన
దేశంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ
50 ఏళ్ల కాంగ్రెస్ జమానాలో తెలంగాణకు దక్కింది కేవలం రెండు మెడికల్ కాలేజీలే
157 మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది శూన్యం
తెలంగాణ ఆహార ఉత్పత్తిలోనే కాదు దేశ ఆరోగ్యానికి కీలకమైన డాక్టర్ల ఉత్పత్తిలోనూ అగ్ర స్థానంలో ఉంది
టెలి కాన్ఫరెన్స్ లో మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. ఈ దశ ఈనెల 15వ తేదీన 9 మెడికల్ కాలేజీలను ఏకకాలంలో ప్రారంభం చేసి చరిత్ర సృష్టించనున్నది.జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ని ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నది
రాష్ట్రంలోని జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, అసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో నూతన మెడికల్ కాలేజీలను ఈనెల 15వ తేదీన ప్రారంభించుకోబోతున్నాం.
మెడికల్ కాలేజీలు ప్రారంభించుకుంటున్న 9 జిల్లా కేంద్రాల్లో కనీసం 15 నుంచి 20 వేల మందికి తగ్గకుండా భారీ ర్యాలీలను చేపట్టాలి. స్వయంగా ముఖ్యమంత్రి ఒక మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కామారెడ్డి లో పాల్గొననున్నారు.
ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా ఆ జిల్లా పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలకు, జిల్లా ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఆయా జిల్లాల పరిధిలో ఉన్న శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు 15వ తేదీన జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలి.
మెడికల్ కాలేజీ ప్రారంభం వలన కలిగే ప్రయోజనాలను ప్రజల్లో రిజిస్టర్ అయ్యేవిధంగా ఈ కార్యక్రమంలో భారీగా పెద్ద ఎత్తున యువతను, విద్యార్థులను భాగస్వాములను చేయాలి.మెడికల్ కాలేజీ ఏర్పాటు వలన కేవలం విద్యార్థులకే ప్రయోజనం కాకుండా దానికి అనుబంధంగా ఉండే హాస్పిటల్ వలన ప్రజలకు అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతాయి.
మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, బిజెపిల వైఫల్యాన్ని ప్రజలకు వివరించాలి.రెండు జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిన విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి.
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ఈరోజు భారతదేశంలో అతి ఎక్కువ ఎంబిబిఎస్ సీట్లు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది.ప్రతి లక్ష జనాభా కి 22 ఎంబిబిఎస్ సీట్లతో తెలంగాణ ఆగ్రస్థానంలో ఉంది. 2014లో ఈ విషయంలో చిట్ట చివరి స్థానంలో ఉన్న తెలంగాణ, నేడు అగ్రస్థానంలోకి చేరింది.మరోవైపు కేంద్ర ప్రభుత్వం దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే కనీసం ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదు.
మరోవైపు 50 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం తెలంగాణ ఉద్యమ ఒత్తిడి వలన నిజామాబాద్, ఆదిలాబాద్ లో మాత్రమే మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది.మన ప్రభుత్వం రాకముందు తెలంగాణ విద్యార్థులు వైద్య విద్య కోసం పక్క రాష్ట్రాల నుంచి మొదలుకొని ఉక్రెయిన్ , రష్యా వంటి విదేశాలకు వెళ్లి అనేక కష్టాలు పడి చదువుకునేవారు.
కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ పిల్లలు తెలంగాణ రాష్ట్రంలోని ఎలాంటి కష్టం లేకుండా వైద్య విద్యను అభ్యసించే గొప్ప సౌకర్యాన్ని కల్పించారు.కొత్త మెడికల్ కాలేజీలో ఏర్పాటు వలన అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య సౌకర్యాలను ప్రజలకి వివరించాలి.రాష్ట్రం వచ్చిన రోజు ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి.ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా పెరిగిన ఎంబిబిఎస్ సీట్లలో 43% తెలంగాణ రాష్ట్రంలోనే పెరిగాయి.