– 2047 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంగా శాఖలు ఆదాయం పెంచుకోవాలి
– రెవెన్యూ జనరేషన్ & రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీ వినియోగం, వివిధ శాఖల్లో పన్నుల ద్వారా వస్తున్న ఆదాయంపై నిరంతరం సమీక్ష, పకడ్బందీ నిర్వహణతో వివిధ శాఖల్లో ఆదాయం పెరుగుదల కనిపిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవిన్యూ జనరేషన్ & రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సభ్యులు, మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏఐ టెక్నాలజీ వినియోగంతో మైనింగ్, రవాణా శాఖల్లో ఆదాయ వనరులను పెంచుకోగలిగామని డిప్యూటీ సీఎం తెలిపారు.
అధికారులు మరింత పకడ్బందీగా పనిచేసి ఇసుక, క్రషర్ మైనింగ్ విభాగాల్లో అక్రమ రవాణా, ఓవర్ లోడ్ వంటి అంశాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని తెలిపారు. నిరంతరం సమీక్షలు, పన్ను ల నిర్వహణలో పకడ్బందీ చర్యల మూలంగా కమర్షియల్ టాక్స్ శాఖలో GST ఆదాయం గత మూడు నెలలుగా 15% పెరుగుదల కనిపించిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇదే తరహాలో రిజిస్ట్రేషన్ శాఖలో సైతం ఆదాయంలో పెరుగుదల కనిపించిందని తెలిపారు. ఆదాయం ఓనర్లు పెంచుకునేందుకు ప్రతి శుక్రవారం రెవిన్యూ జనరేషన్ & రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం క్రమం తప్పకుండా నిర్వహిస్తామని తెలిపారు.
2047 వరకు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధన లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకున్న ఆ మేరకు అన్ని శాఖలు ఆదాయ సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.
HMDA ఆధ్వర్యంలో భూముల విక్రయానికి సంబంధించి ప్రపంచ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని, ఈ అంశంపై అందరికీ ముందస్తుగా సమాచారం అందడం మూలంగా ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంటుందని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు.
భూముల విలువ పెంపునకు సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే వివిధ కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం పూర్తి చేశారు, ఆ కమిటీల నివేదికలను ముందుగా సబ్ కమిటీకి సమర్పించి ఆ తర్వాత క్యాబినెట్ కు నివేదించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. మెట్రో రైల్ స్వాధీనం, నిర్వహణ, ఆదాయ, వ్యయ మార్గాలపైన అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు.
ఎక్సైజ్, రెవిన్యూ, పరిశ్రమల శాఖలోనూ ఆదాయం పెంపునకు సంబంధించి చేపట్టిన చర్యలు ఫలితాలపై మంత్రులు సమీక్ష చేశారు. ప్రతి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వాటి ఫలితాలు యాక్షన్ టేకెన్ రిపోర్టు తో తదుపరి సమావేశానికి రావాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.