– ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కార్పొరేట్ స్వరూపా రవిప్రసాద్ గౌడ్
సికింద్రాబాద్: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బౌద్ధ నగర్ డివిజన్ లోని బౌద్ధ నగర్, వారసిగూడ, ఈశ్వరినగర్, ఎల్ నారాయణ నగర్. పార్సిగుట్ట. అంబర్ నగర్ సంజీవపురం, తదితర ప్రాంతాల్లో పతాకావిష్కరణ జరిగింది. వారాసిగూడ లో జరిగిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ పాల్గొనగా , వివిధ ప్రాంతాల్లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి ప్రసాద్ గౌడ్, డివిజన్ మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్, డివిజన్ బిజెపి అధ్యక్షులు సాయి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగగా వారాసిగూడలో 200 మంది పేదలకు ఉదయం ఫలహారం అందజేయడం జరిగింది. దత్తు, వి ఎస్ రాజు, సంపత్ కుమార్, నాగరాజు, జయంత్, భాస్కర్, ఓమ్లు, బిక్షపతి, శ్యామ్ ముదిరాజ్, డి రాజు, సురేష్ అమరావతి, సుశీల, గజరాజు పాల్, ఆవుల్ల శీను, నాగేష్ సుధాకర్, ఆర్ నర్సింగ్, లింగం చిక్క నరసింహ తదితరులు పాల్గొన్నారు.