Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ పాలనలో రైతులకు అడుగడుగునా అన్యాయం జరుగుతోంది

-తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

విత్తనాల నుంచి విక్రయం వరకు రైతులకు అడగుడునా అన్యాయం జరుగుతోంది. ఆర్బీకేలను ఏర్పాటు చేసి దళారి వ్యవస్దను పెంచిపోషిస్తున్నారు. గత ఖరీఫ్ లో 39 లక్షల ఎకరాల్లో వరి పంట పండిస్తే 80 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం వచ్చిందని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. కానీ కనీసం 25 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేయలేకపోయింది. 25 లక్షల టన్నుల మెట్రిక్ దాన్యంలో కనీసం 1 లక్ష టన్నులు కూడా రైతుల నుంచి నేరుగా సేకరించలేదు.

దళాలరులను అడ్డుపెట్టుకుని రైతుల శ్రమను దోచుకుంటున్నారు. దళారులు, వైసీపీ నేతలు రైతుల్ని దగా చేస్తుంటే ప్రభుత్వం యంత్రాగం ఏం చేస్తోంది? సకల శాఖమంత్రి సజ్జల పెదవాలంటీర్ ఏం చేస్తున్నారు? ఆర్బీకేలకు దాన్యం ఇచ్చిన రైతులు డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడలేక తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటున్నారు.

మరో వైపు ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లా్ల్లో యూరియా కొరత ఏర్పడింది. దీనికి ప్రభుత్వం యెక్క చేతకానితనమే కారణం. రైతు భరోసా కేంద్రాలు రైతు దోపిడి కేంద్రాలుగా మారిపోయాయి. ఆర్బీకేలో రైతులకు కావాల్సిన ఎరువులను నిల్వ చేసేందుకు కనీస సౌకర్యాలు లేవు. సౌకర్యాలు లేని ఆర్బీకేలకు ఎరువులు అప్పగించటం వల్లే ఈ కొరత ఏర్పడింది.కేంద్రం ఎరువులపై సబ్సిడిని తగ్గించినా కేసుల కోసం ప్రశ్నించలేని స్థితిలో జగన్ రెడ్డి ఉన్నారు. ఎరువుల ధరలు పెరగటంతో కాంప్లెక్స్ ఎరువులు వేయాల్సిన స్ధానంలో యూరియా వేస్తున్నారు.

టీడీపీ హయాంలో వ్యవసాయానికి పెద్దపీట వేశాం. సాగునీటి రంగానికి అధిక నిధులు కేటాయించాం. మిగులు విద్యుత్ సాధించి వ్యవసాయానికి నిరంతతం కరెంట్ ఇచ్చాం. డ్రిప్స్, రెయిన్ గన్ లు, యంత్ర పరికరాలు సబ్సిడీలకు ఇచ్చాం. ప్రకృతి వైఫరిత్యాల్లో రైతులకు నష్ట పరిహారం చెల్లించాం. కానీ నేడు వైసీపీ పాలనలో వ్యవసాయరంగం నిర్వీర్యమైపోయింది. ధాన్యం కొనుగోలు లేవు, కొనుగోలు చేసిన దాన్యానికి చెల్లింపులు లేవు. మరో వైపు ఎరువుల కొరత, కరెంట్ కొరతతో తీవ్ర ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ పై ఆదారపడి 30 లక్షల ఎకరాల్లో పంట సాగవుతోంది. కరెంట్ లేకపోతే ఆ రైతుల పరిస్థితి ఏంటి?

ప్రకాశం జిల్లాలో ఒక్క చిన్న టాన్స్ పార్మర్ రీ ప్లేస్ చేయమని రైతులు అధికారుల్ని అడిగితే 6 నెలల సయమం పడుతుందన్నారంటే వైసీపీ పాలనలో రైతుల పరిస్థితి ఏంటో అర్దమౌతోంది. గోదావరి జిల్లాల్లో డీఏపీ ఎరువు 1250 ఉంటే… వ్యాపారులు రూ. 1500 కి అమ్ముతున్నారు. పరిస్థితి ఈ విధంగా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? దీనిపై కనీసం సజ్జల, మంత్రి కన్నబాబు జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వం వెంటనే సేకరించిన దాన్యానికి రైతులకు డబ్బులు చెల్లించాలి, సరిపడా ఎరువులు అందించాలని, లేకపోతే ప్రభుత్వం ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

LEAVE A RESPONSE