– మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
తెలుగు దేశం హయాంలో షెడ్యూల్ ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ది జరిగిందో రాష్ట్ర ప్రజలు చూశారని అన్నారు. గిరిజన ప్రాంతాలలో 2014 కు ముందు.. తరువాత అనే విధంగా అభివృద్ది జరిగిందన్నారు. చదువుకున్న ప్రతి గిరిజనుడికి ఉద్యోగం కల్పించాలని గిరిజన ప్రాంతాలలో ఉపాధ్యాయ పోస్టులు కేవలం గిరిజనులకు దక్కేలా జీవో నెం.3 చంద్రబాబు నాయుడు తీసుకు వచ్చారని అన్నారు. వై.సీ.పీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసి గిరిజనులను ఉపాధికి దూరం చేశారని మండిపడ్డారు. గిరిజన ఓట్లుతో అధికారంలోకి వచ్చిన తరువాత గిరిజనులను విస్మరించారని అన్నారు.
7గురు గిరిజన ఎమ్మెల్యేలు, ఒక ఎం.పి ఉన్న గిరిజన సమస్యలపై మాట్లాడడం లేదన్నారు. జీవో నెం. 3 పై కనీసం అసెంబ్లీ తీర్మాణం చేయక పోవడం గిరిజనుల జగన్ రెడ్డికి ఉన్న చిత్త శుద్ది ఏ పాటిదో అర్దం అయ్యింది. తెలుగుదేశం హయంలో బెస్ట్అవెలబుల్ స్కూల్స్ ద్వారా గిరిజనులకు లబ్ది చేకూరేది కాని
నేడు ఆ పధకం అమలు కాక గిరిజనులు చదువులకు దూరం అవుతున్నా పరిస్దితి. ప్రతి గిరిజనుడికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం జరిగింది. చంద్రన్న భీమా సదుపాయం లేక కుటుంబంలో ఏవరైనా చనిపోతే సహయం అందని పరిస్దితి. అమ్మవడి, రైతు భరోసా చాల మందికి అందడం లేదు.
గిరిజన సలహా మండలిలో షెడ్యూల్ ఏరియాలను కలిపివేశాం అన మోసం చేశారు. కనీసం ఆ ప్రతిపాదన కూడ రాలేదు అని నిజాం పార్లమెంట్ సాక్షిగా బట్టబయలు అయ్యింది. మీరు గిరిజనాలకు చేసిన అన్యాయం, మీరు గిరిజన ప్రాంతాలలో మైనింగ్ చేస్తూ అక్రమాలపై ప్రజా పోరాటం చేస్తాం. గిరిజనాలకు అండగా ఉన్న చంద్రన్న మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసం గిరిజనులు అంతా అండగా ఉంటాం.
మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ :
వైసీపీ పాలనలో గిరిజనుల పరిస్థితి చాలా ధైనీయంగా ఏర్పడిందని మాజీ మంత్రి కిడారి శ్రావణ్ పేర్కోన్నారు. మంగళగిరి, ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడతూ.. గిరుజనుల అండతో గెలిచిన వైసీపీ నాయకులు వారి ప్రయోజనాల కోసం చట్టాల పరిరక్షణ కోసం కృషి చేయడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న 554 గిరిజన గ్రామాల ప్రజలను 1/70 జీవో ప్రకారం షెడ్యూల్ క్యాస్ట్ లో చేర్చాలని పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి మాట్లాడుతూ..కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుండి వినతిపత్రం కూడా రాలేదని స్వయంగా పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగిందన్నారు.
షెడ్యూల్ 5 ప్రకారం గిరిజన ప్రాంత హక్కులు పటిష్టంగా ఉంటాయి. గిరిజనలను షెడ్యూల్ 5 పొందుపరిస్తే వైసీపీ నాయకులకు మైనింగ్, బాక్సెట్, చేసుకోవటానికి అవకాశం ఉండదని అమాయకులైనా గిరిజనులను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. గిరిజన ప్రాంతాలల్లో మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు వేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతోందన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం దాదాపు రూ.15వేల కోట్లు ఖర్చు చేసి శ్వేత పత్రం విడుదల చేసిన వ్యక్తి చంద్రబాబునాయుడే అని అన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించారు.
రంపచోడవరంలో 5గురు గిరిజనులు చనిపోతే ముఖ్యమంత్రి, గిరిజనశాఖ మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రిగా కనీసం స్పందించలేదన్నారు. మానవత్వం ఉన్న వ్యక్తులుగా మేము అక్కడకు వెళ్లడం జరిందన్నారు. జీవో నెం: 3 ప్రకారం గిరిజనులకు ఉద్యోగా అవకాశాలు చంద్రబాబు నాయుడు కల్పించారని పేర్కొన్నారు. జీవో నెం : 3ని సుప్రీమ్ కోర్టు కొట్టివేస్తే కనీసం జీవో నెం:3 కి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం రివ్యూ ఫిటిషన్ కూడా వేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. గిరిజన ప్రాంతాల్లో దొరికే సహజవనరులు కావాలి కానీ గిరిజన ప్రాంత ప్రజలు అభివృద్ధి మాత్రం వైసీపీ నాయకులకు అవసరం లేదన్నారు. వైసీపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే గిరిజనులను జీవో నెం: 1/70లో చేర్చాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి :
వైసీపీ పాలనలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ….. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గిరిజన సంక్షేమానికి పాడుపడితే…జగన్ గిరిజన హక్కుల్నికాలరాస్తున్నారు. వైసీపీ పాలనలో వైసీపీకార్యకర్తలకు తప్ప సామాన్య గిరిజనులకు సంక్షేమ ఫధకాలు అందటంలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేకమందికి రేషన్ కార్డులు, ఫించన్లు తొలగించారు. కొత్తగా ఒక్క ఇళ్లు కట్టకపోగా గత ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లకు బకాయిలు చెల్లించలేదు. మన్యం ప్రాంతంలోని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా సమస్యలు గాలికొదిలి స్వార్ద ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ వదలి గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తే ప్రజల సమస్యలు తెలుస్తాయని అన్నారు.
నిమ్మక జయకృష్ణ :
జగన్ మోహన్ రెడ్డి పాలనలో గిరిజనులు అన్యాయానికి గురైవుతున్నారని…….జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు నేటీకి గిరిజన ప్రాంతాల్లో అమలు కావడం లేదన్నారు. హామీలు నెరవేర్చడంలో సీఎం జగన్, గిరిజన ఎమ్మెల్యేలు విఫలమయ్యారని మండిపడ్డారు. గిరిజన ప్రాంత అభివృద్ధి, సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, మంచినీటి సదుపాయం కల్పించారని పేర్కన్నారు. నేడు గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడం లేదు.
గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. గిరిజన గ్రామాల్లో నాన్ షెడ్యూల్ ప్రాంతాలను షెడ్యూల్ ప్రాంతాల్లో కలుపుతామన్న ఎమ్మెల్యేల హామీలు తుంగలో తొక్కారని మండిపడ్డారు.గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గిరిజన ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని అన్నారు.