Suryaa.co.in

Andhra Pradesh

చిత్తూరు జిల్లా మరో ఘోర ప్రమాదం

-బంగారు పాళ్యం ఫ్లై ఓవర్ పై టైరు పేలి ఇన్నోవా పల్టీ
-కారు నుజ్జు నుజ్జు .. ఇద్దరు అక్కడికక్కడే మృతి
-మరో అయిదుగురికి తీవ్ర గాయాలు
-కోలార్ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు

చిత్తూరు: మొగిలి ఘాట్ లో ఆర్టీసీ బస్సును లారీ ల రూపంలో ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్న టెర్రిఫిక్ ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే… చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం సమీపంలో రోడ్డు రక్తసికత్తమైంది.

ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో అయిదుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు నుంచి తిరుపతికి దైవ దర్శనానికి బెంగళూరు దొడ్డ బల్లాపుర నుంచి ఒక ఫ్యామిలీ శనివారం వేకువ ఝామున బయలు దేరింది. ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో బంగారుపాళ్యం చేరుకుంది. ఈ కుటుంబం ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు టైరు అకస్మాత్తుగా పేలింది.

అంతే బంగారుపాళ్యం ప్లై ఓవర్ బ్రిడ్జిపై ఈ కారు అదుతప్పింది. పల్టీలు కొట్టింది. కారు నుజ్జు నుజ్జు అయ్యింది. బెంగళూరుకి చెందిన గంగయ్య (56), లక్ష్మీ (35) అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాసమూర్తి ( 51), సుచిత్ర (48), ఉష (32), ధరణి (22) గాయపడ్డారు.

ప్రమాద సమాచారం తెలియగానే బంగారుపాళ్యం ఎమ్మార్వో బాబు రాజేంద్రప్రసాద్, బంగారుపాళ్యం సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రాంభూపాల్ ప్రమాద స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను బంగారుపాళ్యం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను బంగారుపాళ్యం ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి పోలీసులు సిద్ధమయ్యారు. తాము కోలారు ఆసుపత్రికి వెళ్తామని అన్నారు. దీంతో క్షతగాత్రులను అంబులెన్స్ లో కోలారు కు పంపారు.

LEAVE A RESPONSE