Suryaa.co.in

Editorial

కిల్లి.. సీఎం హెలీపాడ్ నుంచి వెనక్కి వెళ్లి!

– అవమానంతో వె నుదిరిగిన మాజీ ఎంపీ కిల్లి కృపారాణి
– హెలీపాడ్ వద్ద క ళింగనేతకు ఘోర అవమానం
– ధర్మాన బుజ్జగించినా దక్కని ఫలితం
– బీసీ నేతను అవమానిస్తారా అంటూ ఆగ్రహం
– కళింగ వర్గం కన్నెర్ర
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆమె వైసీపీ బీసీ మహిళా నేత. పైగా మాజీ ఎంపీ. అలాంటి మహిళానేత సీఎం జగనన్న పర్యటనలో పరాభవం పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో జగనన్న సోమవారం నిర్వహించిన అమ్మఒడి కార్యక్రమ సభకు

వస్తున్న సీఎంను స్వాగతించేందుకు హెలీపాడ్ వద్దకు వెళ్లేందుకు ఆమెను అధికారులు అడ్డుకున్నారు. ప్రొటోకాల్ లేదంటూ వెనక్కిపంపేశారు. దానితో ఆమె విసవిసా నడుచుకుని, వెనుదిరిగి వెళ్లారు. ‘‘బీసీ మహిళ, మాజీ ఎంపీకి మీరిచ్చే మర్యాద-గౌరవం ఇదేనా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు తాజా ఘటన కళింగ సామాజికవర్గం ఆగ్రహానికి గురయింది. జిల్లా పార్టీని ఒక సామాజికవర్గమే నడిపిస్తోందని, వారికి మరొక సామాజికవర్గం అవసరం లేదన్న వాస్తవం కృపారాణికి జరిగిన అవమానంతో తేలిపోయిందన్న వ్యాఖ్యలు కళింగ నేతల నుంచి వినిపించాయి.

సీఎం జగన్ సోమవారం నాటి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పార్టీకి సంబంధించి ఒక అపశృతి చోటు చేసుకుంది. అమ్మఒడి కార్యక్రమంలో తల్లుల ఖాతాలో డ బ్బు వేసే కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా వచిచ్న సీఎం జగన్‌కు స్వాగ తం చెప్పేందుకు వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కిల్లి కృపారాణి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హెలీపాడ్ వద్దకు వెళ్లారు. అయితే ప్రొటోకాల్ జాబితాలో మీ పేరు

లేదని అధికారులు చెప్పడంతో ఆమె హతాశులయ్యారు. తాను మాజీ ఎంపీనని చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. ప్రొటోకాల్ లేదని నిర్మొహమాటంగా చెప్పారు. మనస్తాపం చెందిన కృపారాణి ఆగ్రహంతో వెనక్కి వెళుతుండగా, జిల్లా వైసీపీ నేతలు ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు. దానితో ఆమె వారికి

చేతులెత్తి నమస్కరించి ‘‘చాలు బాబూ మీరు చేసిన మర్యాద. కిల్లి కృపారాణికి ప్రొటోకాల్ ఇవ్వరా’’అంటూ కారెక్కి కూర్చుకున్నారు.

కృష్ణదాస్ బుజ్జగించినా వినని మాజీ ఎంపీ
విషయం తెలిసిన మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దానితో ఆమె మరింత మండిపడ్డారు. ‘వద్దన్నయ్యా. నేను చాలా హర్టయ్యాను. ఇది నా ప్రతిష్ఠకు సంబంధించిన అంశం. మీరేమీ చెప్పవద్ద’ంటూ కారు అద్దాలు వేసుకుని మరీ కృష్ణదాస్‌కు నిర్మొహమాటంగా చెప్పారు. దానితో

కృష్ణదాస్ ఏమీ చేయలేక వెళ్లిపోయారు.

కళింగ నేతల ఆగ్రహం
కాగా మహిళా నేత, మాజీ ఎంపీ కిల్లి కృపారాణికి జరిగిన అవమానంపై ఆమె అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘‘ జిల్లా కలెక్టర్ చెప్పారన్న సాకుతో ఆమెను హెలీపాడ్ వద్దకు వెళ్లనీయకుండా జిల్లా నేతలే కుట్ర చేశారు. కలెక్టరుకు ఆదేశాలిచ్చేదెవరో మాకు తెలియదా? ప్రొటోకాల్ లేని వాళ్లు ఎంతమందిని సీఎంను కలవడం లేదు? సీఎం ఉన్న వేదికపై కూర్చోవడం లేదు? జిల్లాలో పార్టీని మొదటినుంచీ ఒక సామాజికవర్గం ఒక కుటుంబమే శాసిస్తోంది. పార్టీకి ఇంకో సామాజికవర్గం అవసరం లేదని ఇప్పటి సంఘటనతో తేలిపోయింది. కృపారాణికి జరిగిన అవమానం కళింగ వర్గాన్ని మన స్తాపానికి గురిచేసింది’’ అని కళింగ వర్గానికి చెందిన నేతలు మండిపడుతున్నారు.

LEAVE A RESPONSE