Suryaa.co.in

Telangana

జమ్మి మొక్కలు నాటిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు చిలుకూరి బాలాజీ ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కలు నాటిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర మహిళ విభాగ్.

గుడికి ఒక జమ్మి చెట్టు – ఊరుకు ఒక జమ్మి చెట్టు అనే నినాదంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళ విభాగ్ ఆధ్వర్యంలో చిలుకూరి బాలాజీ ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కలు నాటిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రథమ మహిళ ఉప్పల స్వప్న.

ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర మహిళ విభాగం అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి, జనరల్ సెక్రటరీ లంకెలపల్లి మంజుల, ivf చీఫ్ అడ్వైజర్ మణిమాల, సలహాదారులు శైలజ, అనిత, ivf మహిళ నాయకురాళ్లు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE