Suryaa.co.in

Telangana

‘‘ఇంటింటికీ బిజెపి’’ విజయవంతం

– బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి. సుభాష్

రాష్ట్రవ్యాప్తంగా ‘‘ఇంటింటికీ బిజెపి’’ విజయవంతమైంది. అనుకున్నదానికంటే ఎక్కువే బిజెపి నాయకులు ప్రజలను చేరుకున్నారు. బూత్ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు బిజెపి శ్రేణులంతా తమ పోలింగ్ బూత్ లోని కుటుంబాల వద్దకు వెళ్లి నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలనను విజయాలను వివరిస్తూ, కరపత్రాలను పంపిణీ చేశారు. స్టిక్కర్లు అతికించారు. లక్షలాది మంది స్వచ్ఛందంగా 9090902024 నెంబర్ కు మిస్డ్ కాల్ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి మద్దతు తెలిపారు.

9 సంవత్సరాల మోదీ ప్రభుత్వ విజయాలను ప్రజలకు చేరవేస్తున్న ‘‘మహా జన్ సంపర్క్ అభియాన్’’లో భాగంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ ఇవాళ నిర్వహించిన ‘‘ఇంటింటికీ బిజెపి’’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని తన సొంత వార్డులో 122 కుటుంబాలను 2 వందలకు పైగా ఓటర్లను కలిశారు.

ఇక కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్ ల పరిధిలో, కేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చేవెళ్ల అసెంబ్లీలోని హిమాయత్ నగర్ లో, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల చెన్నూరు అసెంబ్లీలో, రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కె.లక్ష్మణ్ గాంధీనగర్ డివిజన్ లోని స్వామి వివేకానంద నగర్ బస్తీ, కృపారావ్ లేన్, బాలాజీ ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్స్, జనప్రియ అబోడ్ లో, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనా రెడ్డి మలక్ పేట అసెంబ్లీలో, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఏ.పి. జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ పట్టణంలో, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు డా. వివేక్ వెంకటస్వామి రామగుండం అసెంబ్లీలో, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి డా. నిఖిల్ ఆనంద్ గద్వాల అసెంబ్లీలో, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హయత్ నగర్ డివిజన్ శారదా నగర్ లో, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్ గోదావరిఖని GM కాలనీ 79వ పోలింగ్ కేంద్రంలో, రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి బాచుపల్లి పోలింగ్ బూత్ నెం.82లో, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్ ఖైరతాబాద్ అసెంబ్లీ హిమాయత్ నగర్ డివిజన్ బూత్ నెం.31లో పాల్గొని మోదీ పాలన విజయాలను ప్రజలకు వివరిస్తూ, కరపత్రాల పంపిణీ చేయడంతో పాటు, ప్రతి ఒక్కరితోనూ 9090902024 నెంబర్ కు మిస్డ్ కాల్ చేయించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బిజెపి శ్రేణులు ఎక్కడికి వెళ్లినా ప్రజలు సానుకూలంగా స్పందించారు. సాదరంగా ఆహ్వానించి మోదీ పట్ల అభిమానాన్ని, బిజెపి పట్ల మద్దతును చాటుకున్నారు.

LEAVE A RESPONSE