– మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: చేవెళ్ల బస్సు ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది… మృతుల కుటుంబాలకు 7 లక్షల ఎక్స్ గ్రేషియా ముఖ్యమంత్రి ప్రకటించారు. క్షతగాత్రులకు 2 లక్షల పరిహారం ప్రకటించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చిన ప్రజల సహకారం అవసరం. తెలంగాణ లో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఆర్ అండ్ బి నుండి బ్లాక్ స్పాట్స్ గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం. బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ సీరియస్ గా చర్యలు తీసుకుంటుంది. ఘటనకు పై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు