‘నాట్ బిఫోర్ మీ’ అంటూ వైదొలిగిన న్యాయమూర్తి
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ నుంచి న్యాయమూర్తి వైదొలిగారు.ఈ పిటిషన్ దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ (వెకేషన్ బెంచ్)ముందు విచారణకు రాగా.. ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఈ పిటిషన్ను ఏ బెంచ్ విచారించాలనే అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు.ఈ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నెల 19న హైకోర్టు ఈ పిటిషన్పై విచారణ జరిపి వెకేషన్ బెంచ్ ముందుకు వాయిదా వేసింది..