– సమాచార శాఖ కమిషనర్ఎక్స్ అఫిషియో సెక్రటరీ టి.విజయకుమార్ రెడ్డి
2023 గణతంత్ర్య దినోవాత్సవాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేయనున్న పద్మ పురస్కారాలకు నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ మరియు ఎక్స్ అఫిషియో సెక్రటరీ టి.విజయకుమార్ రెడ్డి తెలిపారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి పలు రంగాల్లో అత్యుత్తమ సేవా నిరతిని కనబర్చిన వారికి 2023 గణతంత్ర్య దినోవాత్సవాల్లో ప్రతిష్టాత్మక “పద్మ పురస్కారాల” ను ప్రధానం చేసేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపేందుకు గాను ఈ నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఔత్సాహికులైన వారు తమ నామినేషన్లను ఈ నెల 5 వ తేదీ లోపు ప్రిన్సిఫల్ సెక్రటరీ (పొలిటికల్), సాధారణ పరిపాలనా (ఎస్.సి.II) విభాగం, ఎ.పి. సెక్రటేరియట్, వెలగపూడి, గుంటూరు జిల్లా-522238 కి అందేలా పంపించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.