• ఆన్లైన్ రికార్డుల్లో అక్రమ మార్పులు.. వారసత్వ భూమి కోసం పోరాటం
• అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు గండి బాబ్జి, ఉండవల్లి శ్రీదేవి
మంగళగిరి : వైఎస్ఆర్ జిల్లా, సిద్దవటం మండలం మాధవరం -1 గ్రామానికి చెందిన వెంకటేష్ మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమ గ్రామంలో సర్వే నెం 985లో గతంలో ప్రభుత్వం తమకు భూమి కేటాయింది. ఆ భూమిని తమ ఆధీనంలోనే ఉంచుకున్నాం.. గత ప్రభుత్వంలో ఆ భూమిని జగనన్న కాలనీకి కేటాయించారు. ఆ భూమి తమది కావునా కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చాం.. అయినా కూడా గత ప్రభుత్వంలో వీఆర్వో రజినీ, తహసీల్దార్ రమాకుమారి, ఎస్ఐ మధుసూదన్ రెడ్డి లు తమని బెదిరించి కేసులు నమోదు చేస్తామని పోలీస్ స్టేషన్ లో ఒకరోజు ఉంచి వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపారు.
ఆ భూమి మీది కాదు అక్కడికి వెళ్లొద్దని బెదిరించారు. అలాగే గతంలో కేటాయించిన జగనన్న ఇళ్ల పంపిణీల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి. వాటిపై విచారణ జరిపి వీఆర్వో, తహసీల్దార్, ఎస్ఐలపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు మాజీ ఎమ్మెల్యే, ఏపీ కోఆపరేటివ్ ఆయిల్‌సీడ్స్ గ్రోవర్నర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గండి బాబ్జి, మాజీ ఎమ్మెల్యే, ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవిలకు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామానికి చెందిన సురేఖ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ తాత పునుగోటి రామస్వామి పేరున ఉన్న డీకే పట్టా నం.547లో సర్వే నం.715/2లో ఉన్న 2.82 సెంట్ల భూమిని అక్రమంగా దొంగ రిజిస్ట్రేషన్ చేసి తమ కుటుంబాన్ని న్యాయబద్ధమైన హక్కుల నుండి దూరం చేశారు. తమ తాత 2000లో మరణించిన తరువాత పునుగోటి శ్రీను తండ్రి సుబ్బయ్య అనే వ్యక్తి ఆ భూమిని ఆన్లైన్ రికార్డుల్లో తన పేరుమీద మార్చుకున్నాడు.
వీఆర్వో డబ్బులు తీసుకుని పేరు మార్చాడు. ఈ విషయమై తాము కోర్టును ఆశ్రయించగా కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ కోర్టు ఉత్తర్వులను వీఆర్ఓ, ఎంఆర్ఓ, స్థానిక పోలీసులు అమలు చేయకుండా తిరిగి పునుగోటి శ్రీను కుటుంబం పక్షాన వ్యవహరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
పల్నాడు జిల్లా అచ్చంపేట కోనూరు గ్రామానికి చెందిన మార్కిండేయులు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామ పరిధిలోని సర్వే నెం.65-ఎలో 1.09 సెంట్ల వ్యవసాయ భూమి తమ పూర్వికుల వారసత్వంగా తనకు సంక్రమించింది. అందులో 1 ఎకరం భూమి మాత్రమే ఆన్లైన్ రికార్డుల్లో ఎక్కించారు. ఆ భూమిని తన కుమార్తె మత్యా రాజలక్ష్మి పేరుతో గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చారు. మిగిలిన 0.09 సెంట్ల భూమిని కూడా తమ కుమార్తె పేరుతో ఆన్ లైన్ చేయాలి దీనిపై తహసీల్దార్ కి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కావునా తమయందు దయవుంచి తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన కీర్తీ ప్రసన్న గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. విజయవాడలోని భవానిపురం లక్ష్మీ నగర్ లో స్థలం కొన్నాను. ఆ స్థలం నాది అని చెప్పి చెంచు నరసింహరావు అనే వ్యక్తి వచ్చి దౌర్జన్యంగా దాడి చేసి అందులో ఉన్న సామాన్లు దొంగలించి స్థలం మాది అంటూ 20 కుర్రోళ్లను తీసుకొచ్చి బెదిరిస్తున్నాడు. వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు