– హరీష్ రావు ను తిడితే కవిత కు ఎందుకు రావడం లేదు?
– కేటీఆర్, హరీష్ రావు లను ఉరితీసినా తప్పు లేదా?
– కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ లాబీ చిట్ చాట్
– ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ పై మంత్రి కోమటి రెడ్డి స్పందన
హైదరాబాద్: కేసీఆర్ నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే…ఊరూరా తిరుగుతున్నావ్. కేసీఆర్ ను ఉరితీసినా తప్పు లేదన్న దానికి రక్తం జరిగిపోయిందన్న కవిత… కేటీఆర్, హరీష్ రావు లను ఉరితీసినా తప్పు లేదా? కవిత చెప్పాలి. బిఆర్ఎస్ నేతలందరినీ కోట్ల రూపాయలు దోచుకున్నావ్ అని కవిత విమర్శిస్తుంది.
కేసీఆర్ సభకు రోజు వస్తే బిఆర్ఎస్ పుంజుకుంటుంది అని కవిత అంటుంది. కవిత బిఆర్ఎస్ లో ఉన్నదా అనే అనుమానం ఉంది. కేసీఆర్ ను తిడితే వస్తున్న కోపం హరీష్ రావు ను తిడితే కవిత కు ఎందుకు రావడం లేదు? కవిత కన్ఫ్యూజన్ లో ఉంది. జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బిఆర్ఎస్ తప్పు అని కవిత ఒప్పుకుంది. సంతోషం.
బిఆర్ఎస్ హాయాం లో నల్లగొండ మంత్రి జిల్లా కు చేసిన అన్యాయం పై కవిత ప్రశ్నించాలి.
కవిత గత 10 ఏళ్లలో నల్గొండ లో జరిగిన మోసాలు పైన కూడా మాట్లాడితే బాగుంటుంది. నాకు మా తమ్ముడి మధ్య ఎటువంటి గొడవలు లేవు. నేను మంత్రి పదవి కోసం ఏరోజు పాకులాడలేదు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసా. సొంత రాష్ట్రంలోనే మంత్రి బాధ్యతలు తీసుకుంటా అని ఆనాడే చెప్పిన. నాకు ముఖ్యమంత్రి అంటే గౌరవం. ఆయనను ఏమన్నా అంటే ఖచ్చితంగా కౌంటర్ ఇస్తా. నాకు మంత్రి పదవి కావాలని ఎవరిని అడగలేదు.