Suryaa.co.in

Telangana

లిక్కర్ పాలసీని దేశానికి విస్తరింపజేయడమే కేసీఆర్ ఆదర్శమా?

-రైతులను అరిగోస పెడుతున్న ధరణి పోర్టల్ దేశానికి ఆదర్శమా?
-బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయం..
-బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్

తెలంగాణలో టీఆర్ఎస్ కు నూకలు చెల్లినయ్. అందుకే బీఆర్ఎస్ పేరుతో మరో కొత్త డ్రామా చేస్తున్నారు.కేసీఅర్ 8 ఏండ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసింది ఏంటో ముందు చెప్పాలి… జాతీయ పత్రికలు, టీవీలకు తెలంగాణ బంగారమయమైందని తప్పుడు ప్రచారం చేస్తూ దేశ ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులు పాల్జేసి యావత్ రాష్ట్రాన్ని బ్యాంకులకు, కార్పొరేషన్లకు కుదువ పెట్టిన కేసీఆర్…. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమే బీఆర్ఎస్ విధానమా?

అవినీతి సొమ్ముతో రాజకీయాలు చేయాలనుకోవడమే బీఆర్ఎస్ సిద్ధాంతమా? లిక్కర్ పాలసీని దేశానికి విస్తరింపజేయడమే కేసీఆర్ ఆదర్శమా? రైతులను అరిగోస పెడుతున్న ధరణి పోర్టల్ దేశానికి ఆదర్శమా? ఉద్యోగస్తుల ఉసురు పోసుకుంటున్న 317 జీ వోను దేశమంతా విస్తరింపజేస్తారా? గుడి సొమ్ము, బడి సొమ్మును దిగమింగడం…డిస్కంలను నిండా ముంచడమే దేశానికి ఆదర్శమా?

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు కల్వకుంట్ల రాజ్యాంగాన్ని దేశంలో ఏర్పాటు చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమా? సన్న బియ్యం నువ్వు తిని దొడ్డు బియ్యం మాతో తినిపియ్యడడం నీ దేశ ఆహార విధానం…. బళ్ళో చాక్ పీసులు ఇవ్వకపోవడం, కొన్ని ఏళ్లు టీచర్ రిక్రూట్మెంట్ చేయకుండా వుండడం, యూనివర్సిటీ లను నాశనం చేయడం నీ దేశ విద్యా విధానమా..

భైంసా అల్లర్లను, హైదరాబాద్ లో తీవ్రవాద స్థావరాలను ప్రోషహించడం నీ కొత్త పార్టీ దేశ రక్షణ విధానమా? కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేయడం చేతగాక తెలంగాణ ఆడబిడ్డల ప్రాణాలు తీయడమే బీఆర్ఎస్ వైద్య విధానమా? పావలా ఖర్చుతో పంటలు పండించే వీలున్న చోట, రూపాయి ఖర్చుపెట్టి ప్రాజెక్ట్స్ పేరుతో దోచుకోవడమే బీఆర్ఎస్ నీటిపారుదల విధానమా?

బీఆర్ఎస్…. రాజకీయ పునరేకీకరణ కానే కాదు… వివిధ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నిరుద్యోగుల, కాలం చెల్లిన నేతల ఏకీకరణ మాత్రమే. తెలంగాణలో దోచుకున్న సొమ్ము లెక్క చెప్పలేక తన సొంత షోకుల కోసం ఖర్చు పెట్టడానికి ఆడుతున్న డ్రామాలివి…
మునుగోడు ఎన్నికల నుండి రాష్ట్ర ప్రజలను మళ్ళించే ఉద్దేశంతో , కేసీఆర్ చేస్తున్న విన్యాసాలను ప్రజలకు అర్ధమైంది. మునుగోడు బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయం..

LEAVE A RESPONSE