Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయా?

• జగన్ రెడ్డి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారిస్తే, డీజీపీ ఆయనకు సన్నాయినొక్కులు నొక్కడం విచారకరం
• ఏలూరులో యువతిపై యాసిడ్ దాడి, బాపట్లజిల్లాలో బాలుడి సజీవదహనం, హైకోర్ట్ ప్రాంగణంలోన్యాయవాది కిడ్నాప్ యత్నం..ఇదేనా శాంతిభద్రతలు భేషుగ్గా ఉండటం?
• న్యాయంకోసం పోలీస్ స్టేషన్ కువెళ్లే వారిపై తప్పుడుకేసులుపెట్టి, కబ్జాదారులు, నేరగాళ్లకు వత్తాసుపలకడమేనా శాంతిభద్రతలు అదుపులో ఉండటమంటే?
• ఉదయం కత్తిపోట్లు, మధ్యాహ్నం మర్డర్లు, సాయంత్రం సజీవదహనాలు, రాత్రుళ్లు రేప్ లు, భూకబ్జాలు జరుగుతుంటే డీజీపీకి కనిపించడం లేదా?
• పెనమలూరులో ట్రస్ట్ భూమిని దొంగపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీనేతల్ని వదిలేసి, ఫిర్యాదుచేసిన ఎన్.ఆర్.ఐలను బెదిరిస్తారా? కేసువాదిస్తున్న న్యాయవాదిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తారా?
• ట్రస్ట్ భూముల కబ్జావ్యవహారం వెనుక స్థానికఎమ్మెల్యే, అతని అనుచరులు, కర్నూలుజిల్లా వైసీపీనేత హస్తముందని డీజీపీకి తెలియదా?
– మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్

జగన్ రెడ్డి రాష్ట్రాన్ని రావణకాష్టంగామారిస్తే, డీజీపీ శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నా యని సన్నాయినొక్కులు నొక్కడం విచారకరమని, ఉదయం కత్తిపోట్లు, మధ్యాహ్నం మర్డర్లు, సాయంత్రం సజీవదహనాలు, రాత్రుళ్లు రేప్ లు, భూకబ్జాలు నిత్యకృత్యాలయ్యాయని టీడీపీనేత, మాజీశాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే ..

“ ఏలూరులో యువతిపై యాసిడ్ దాడి, బాపట్ల జిల్లాలో బాలుడి సజీవదహనం వంటివి రోజూ ఏదోఒకమూల రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. కొన్నినేరాలు అయితే ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలోనే జరుగుతున్నాయి. అన్నింటికీమించి ప్రైవేట్ ట్రస్ట్ భూముల్ని కాపాడేప్రయత్నంచేస్తున్న న్యాయవాదిని హైకోర్ట్ ప్రాంగణంలో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ఇన్నిదారుణాలు జరుగుతున్నా డీజీపీ అంతాభేష్ అని చెప్పడం సిగ్గుచేటు కాదా?

పెనమలూరులో ట్రస్ట్ భూమిని దొంగపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీనేతల్ని వదిలేసి, భూముల్నికాపాడమని ఫిర్యాదుచేసిన ఎన్.ఆర్.ఐలను బెదిరిస్తారా? న్యాయవాదిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారా?
విశాఖపట్నంలో వైసీపీఎంపీ కుటుంబసభ్యుల కిడ్నాప్ వ్యవహారాన్నికూడా రాజకీ యం చేయవద్దంటూ స్వయంగా ఎంపీనే చెప్పడం బాధాకరం. ఎంపీ మాట్లాడాక అది రాజకీయం కాకుండా ఎలాఉంటుంది? లలిత్ అనేవ్యక్తి తనభూమిని వైసీపీ భూబకాసు రుల నుంచి రక్షించుకోవడానికి సుప్రీంకోర్టువరకు వెళ్లాల్సి వచ్చింది. విజయవాడ పక్క నుండే పెనమలూరులో 100కోట్ల విలువైన, ముప్పవరపు చౌదరి మరియు లీలారామ కృష్ణప్రసాద్ ఛారిటబుల్ ట్రస్ట్ కు చెందిన భూమిని దొంగపత్రాలతో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులకుఫిర్యాదు చేశారు. దానిపై స్పందించి న్యాయంచేయాల్సిన పెనమలూరు పోలీసులు భూమిని కబ్జాచేయాలనుకుంటున్నవారి తో చేతులుకలిపి, ఫిర్యాదుచేసినవారిని వేధింపులకు గురిచేయడమేనా శాంతిభద్రతలు బాగుండటమంటే?

డీజీపీ దీనిపై ఏంసమాధానంచెబుతారు? డీఎస్పీస్థాయి అధికారి ఈ వ్యవహారంలో ప్రధానపాత్రపోషించారని చెబుతున్నారు. అలానే పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితుడైన బబ్లూ అనే వ్యక్తి, కర్నూలుజిల్లాకు చెందిన వైసీపీ యువనేత పాత్రఉందని డీజీపికి తెలియదా? భూమిని రక్షించడానికి ముందుకొచ్చిన ఎన్.ఆర్.ఐలను కాపాడకుండా, తిరిగి వారిపైనే తప్పుడుకేసులుపెట్టి వేధిస్తారా? భూమిని కాపాడటానికి ప్రయత్నించేవారితరుపున వాదనలు వినిపించడానికి సిద్ధమైన న్యాయవాదిని కిడ్నాప్ చేయాలని ప్రయత్నిస్తారా? ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో కోకొల్లలుగా జరుగుతున్నా పోలీసులు చోద్యంచూస్తున్నారు. డీజీపీ ఏమో అంతా అద్భుతమని తనకు తానే కితాబులు ఇచ్చుకుంటున్నారు.

సీఐడీ చీఫ్ సంజయ్ మాట్లాడిన తీరు చూశాక ఐపీఎస్ అధికారేనా అన్న సందేహం కలిగింది
మార్గదర్శి సంస్థ డిపాజిట్లకు సంబంధించి సీఐడీ చీఫ్ సంజయ్ మాట్లాడిన తీరు నిజం గా పోలీస్ వ్యవస్థకు సిగ్గుచేటుకాదా? మార్గదర్శి ఖాతాదారుల నుంచి ఫిర్యాదు రాకుండానే తనకుతానే విచారణ చేపట్టిన సీఐడీవిభాగం, తమచర్యను సమర్థించుకుంటూ మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే, తాను మేజర్ అయ్యి ఫిర్యాదుచేసేవరకు ఆగాలా అని పోల్చడం సిగ్గుఅనిపించలేదా? ఏవిషయాన్ని దేనికి ముడిపెట్టాలో తెలియకుండా నే ఐపీఎస్ అయ్యారా?

ఐపీఎస్ అధికారులం..పోలీసులమనే విషయం పూర్తిగా మర్చి పోయి, వైసీపీనేతలు కార్యకర్తల ఆదేశాలే ఐపీసీ సెక్షన్లు అన్నట్టు పనిచేయడమేనా శాంతిభద్రతలు భేషుగ్గా ఉండటం? నంద్యాలలో దళితయువకుడు సెల్ఫీ వీడియో ద్వారా పోలీసులుపెట్టిన హింసను, తననుదొంగగా చిత్రీకరించిన దారుణాన్ని బయట పెట్టి, రైలుకింద పడిచనిపోయాడు. దానిపై డీజీపీ ఏంసమాధానంచెబుతారు? గతంలో అదే నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం అకారణంగా బలైపోయింది. అనంతపురం లో మద్యంమత్తులో వీరంగంవేసిన వైసీపీనేతను పల్లెత్తుమాట అనకుండా సాగనంపడ మేనా శాంతిభద్రతలు అదుపులో ఉండటమంటే?

ఎలాంటిఫిర్యాదులు లేకపోయినా పనిగట్టుకొని మరీ మార్గదర్శి సంస్థపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసులు, ట్రస్ట్ భూముల్ని కాపాడే వ్యవహారంలో కబ్జాదారులకు అండగా ఉండటమేంటి?
న్యాయంకోసం పోలీస్ స్టేషన్ కువెళ్లే బాధితులపై తప్పుడు కేసులుపెట్టి, వారిని వేధించి , చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీసుకునేలా చేస్తున్న పోలీసులుతీరుతో రాష్ట్రంలో శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయా డీజీపీ? ఇదేనా మీరుప్రజల్ని కాపాడేవిధానం? మార్గదర్శిపై సంస్థపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా పనిగట్టుకొని కేసులుపెట్టిన పోలీస్ విభాగం, ట్రస్ట్ భూముల్ని కాపాడేవ్యవహారంలో మాత్రం కబ్జాదారులకు అండగా ఉండటమేంటి?

వందలకోట్ల విలువైనభూమిని వైసీపీకబ్జాకోరులకు అప్పగిస్తే, తమకు కూడా వాటాలు అందుతాయన్న దురుద్దేశంతో పోలీసులు పనిచేయడం ఎంతవరకు సబబు? చట్టాన్ని కాపాడాల్సినవారే దాన్నివైసీపీనేతల కాళ్లకిందతొక్కేసి, సిగ్గులేకుం డా శాంతిభద్రతలు భే షుగ్గా ఉన్నాయని చెబుతారా? కిందిస్థాయి పోలీస్ సిబ్బందికి ఉండే ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, ఐ.పీ.ఎస్ పూర్తిచేసిన అధికారులకు లేకపోవడం బాధాకరం.

ఇదేపంథా కొనసాగితే వైసీపీనేతలతో కుమ్మక్కైన పోలీసు అధికారుల చర్యలు, చేష్టలతో ప్రజలఆస్తులు, ప్రాణాలకు రక్షణలేకుండా పోతుంది. దీనిపై ప్రజలం తా ఆలోచించాలి. భూములిచ్చినవారికి, వాటిని కాపాడేవారికి, ఆఖరికి న్యాయవాదుల కు కూడా రక్షణలేని పరిస్థితిని రాష్ట్రంలోకల్పించిన డీజీపీ, ఇప్పటికైనా పాలకులకు ఊడిగంచేయకుండా చట్టప్రకారం వ్యవహరించాలి.” అని శ్రావణ్ కుమార్ సూచించారు.

LEAVE A RESPONSE