Suryaa.co.in

Telangana

రుణాలివ్వడమూ సాయమేనా ?

– ఢిల్లీలో స్క్రిఫ్టు .. హైదరాబాద్ లో మీడియా సమావేశం
– వ్యవసాయ రంగానికి రూ.20 లక్షల కోట్ల రుణ వితరణ, రూ.23,948 వేల కోట్ల గొర్రెల రుణం కేంద్రం గొప్పతనమా ?
ఒక కేంద్రమంత్రి రుణాలను గొప్పగా చొప్పుకోవడం సమంజసమా ?
కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఆత్మస్తుతి పరనింద
– కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశంపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ఎరువుల సబ్సిడీ అనాదిగా వస్తున్నదే .. బీజేపీ పాలనలో ఎరువుల సబ్సిడీ తగ్గింది. ఎరువుల వినియోగం పెరిగింది. 6300 కోట్లతో ప్రారంభించిన రామగుండం యూరియా ఫ్యాక్టరీ నుండి అరబస్తా యూరియా రైతులకు ఉత్పత్తి చేశారా ? దానిని వాణిజ్య మార్కెట్‌లోకి పంపించారా ? మరి ఇందులో కేంద్రం రైతాంగానికి చేసిన మేలేంటి ?

వాస్తవాలను మరుగున పరుస్తూ కేంద్రమంత్రి రైతులను మభ్యపెడుతున్నారు . దేశంలో 11 కోట్ల మంది ఉన్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన లబ్దిదారులు 3 కోట్లకు పడిపోయిన విషయం వాస్తవం కాదా ? రైతుబంధును అనుసరిస్తున్న కేంద్రం కేవలం రైతులకు ఇచ్చింది రూ.9500 వేల కోట్లు మాత్రమే. 38 లక్షల మంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన రైతులను 29 లక్షలకు తగ్గించారు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద నాలుగేళ్లలో కేవలం రూ.9 వేల కోట్లు ఇచ్చి రైతుబంధు కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.65 వేల కోట్లు ఇచ్చిన విషయాన్ని మరిచిపోతున్నారు. ఫసల్ భీమా యోజన భీమా కంపెనీల ప్రయోజనాల కోసమే .. ప్రీమియం ఎక్కువ .. పరిహారం తక్కువ.

పెంచిన మద్దతుధరల గురించి కాదు పెరిగిన సాగు ఖర్చుల గురించి మాట్లాడాలి.పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలతో రైతాంగం నడ్డి విరిచారు.2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అన్న కేంద్రప్రభుత్వం రైతుల సాగు ఖర్చులు రెట్టింపు చేసింది.రాష్ట్రాల వారీగా సాగు ఖర్చులను బట్టి మద్దతుధర ప్రకటించాల్సిన కేంద్రం రాష్ట్రాల విజ్ఞప్తులను పక్కనపెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నది.

సాగునీటి ప్రాజెక్టుల గురించి కిషన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదం.కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వాలని ఒక్కరోజైనా మీ ప్రభుత్వాన్ని కోరారా కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కు జాతీయహోదా ఇచ్చి నిధులు కేటాయిస్తే, ఒక్క తెలంగాణ బీజేపీ నేతా మాకూ కావాలని అడిగిన పాపాన పోలేదు.

మద్దతుధర కింద పండిన పంటలో నూటికి కేవలం 25 శాతం పంటలు మాత్రమే సేకరిస్తూ కేంద్రం భారం రాష్ట్రాల మీద నెడుతున్నది.ధాన్యం సేకరణ నుండి ఎఫ్ సీఐని, పత్తి సేకరణ నుండి సీసీఐని కేంద్రం కనుమరుగు చేసింది .. భారం మొత్తం రాష్ట్రాల మీద నెట్టింది. ఎరువుల వినియోగం, పంటలమార్పిడి మీద కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు .. దానిని అమలుచేస్తున్న రాష్ట్రాలకు ఒక ప్రోత్సాహం లేదు. కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఆత్మస్తుతి పరనింద మాదిరిగా సాగింది

LEAVE A RESPONSE