– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప
ప్రభుత్వ అసమర్థను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన టెక్కలికి చెందిన ముడిదాన ఆనందరావు, రెయ్యి ప్రీతిష్ లను ప్రభుత్వం వేధిస్తోంది. టెక్కలి సీఐ వైసీపీ తొత్తుగా మారి వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. డీజీపీ అతనిపై తక్షణమే చర్యలు తీసుకుని విధుల నుండి తప్పించాలి. మీ తప్పులను ఎత్తి చూపితే కేసులు పెట్టి ఇబ్బందులు పెడతారా.? ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)ను ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. టీడీపీ నేతలను కించపరుస్తూ వైసీపీ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులను బట్టి అరెస్టు చేస్తే జైల్లు కూడా సరిపోవు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా పోస్టులపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు గుర్తుంచుకోవాలి. వైసీపీ నేతలు ఉసిగొల్పగానే పోలీసులు వచ్చి అరెస్టు చేస్తున్నారు. పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఇబ్బందులు పడేది పోలీసులే. వేధింపులు, అక్రమ కేసులతో ప్రజల వాక్ స్వాంతంత్ర్య హక్కును కాలరాస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయటకురాకుండా పోలీసులతో తొక్కిపెడుతున్నారు. బ్రిటిష్ పాలకులకంటే దుర్మార్గంగా వైసీపీ పాలకులు వ్యవహరిస్తున్నారు. వృద్ధులు పెట్టే పోస్టులకు భయపడి కేసులు పెట్టిన నీచపు చరిత్ర వైసీపీకి వుంది. మీలాగా జడ్జిలను, కోర్టులను కించపరుస్తూ పోస్టులు ఏనాడూ పెట్టలేదు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ మాత్రమే రాష్ట్రంలో సామాజిక కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు. ఆఫ్ఘన్ లో తాలిబన్లు వ్యవహరించినట్లు ఏపీలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.