– అహంకారంతో మాట్లాడితే ఏ దేవుడు కూడా క్షమించడని గుర్తుంచుకో
– జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్
సర్వేపల్లి: హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాల్సిందే… తిరుమల వేంకటేశ్వర స్వామి హుండి అంటే అంత లోకువగా ఉందా జగన్. పరకామణి చోరీ కేసు విషయంలో అహకారంతో విలేఖర్ల సమావేశంలో నువ్వు మాట్లాడిన తీరును హిందూ సమాజం క్షమించదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
హుండి చోరీ చేస్తే తప్పేంటీ అంటావా…? పవిత్రమైన శ్రీవారి హుండిలో చేయి పెట్టినా తప్పు లేదన్నట్టు మాట్లాడుతావా? కోర్కెలు తీరిన భక్తులు తమ ఒంటి మీదున్న నగలన్నింటినీ శ్రీవారికి సమర్పించుకుంటారు.
కానీ, నువ్వు శ్రీవారినే నిలువు దోపిడీ చేసిన రకం. సీఎంగా ఉన్నప్పుడు శ్రీవారి విషయంలో నువ్వు అనేక పాపాలు చేశావు. ఆ పాపాలే శాపాలై నిన్ను 11 సీట్లకు పరిమితం చేసింది. అయినా ఇంకా విర్రవీగుతూనే ఉన్నావు.
శ్రీవారి హుండి నుంచి రూపాయి తీసినా పాపమే… అలాంటింది పరకామణి చోరీ… ఏదో చిన్న చోరీ అంటావా..? ఎంత ధైర్యం? ఒకటి గుర్తుంచుకో.. నువ్వు చేసిన పాపాలకు నువ్వెళ్లి కన్ఫెషన్ బాక్సులో కూర్చొన్నా ఏసు ప్రభువు కూడా అసహ్యించుకుంటాడు. భగవంతుడి విషయంలో అహంకారపూరితంగా మాట్లాడిన నిన్ను జీసస్ కూడా క్షమించరు. శ్రీవారి హుండీ విషయంలో జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. లెంపలు వేసుకోవాలి. వైసీపీలోని హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కూడా మరో మతాన్ని అంటే సమర్థించబోరని ఆయన హెచ్చరించారు.