Suryaa.co.in

Telangana

వ్యాపారం బాగా న‌డుస్తుందా?

-బాగుంది…అంతా మీ ద‌య‌… మీ వ‌ల్లే ఇవ్వాళ ఇక్క‌డ ఈ వ్యాపారం పెట్టుకున్నాం
-ఫుట్ పాత్ మీద ల‌స్సీ తాగి, ఆ వ్యాపార మహిళతో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాటా మంతి

తొర్రూరు, మే 28 ః మాస్ లీడ‌ర్ రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఏం చేసినా అదో సెన్సేష‌న్ గానే ఉంటుంది. జ‌నంలో క‌లిసిపోయినా, వారిని ప‌ల‌క‌రించినా, జ‌నంతో మ‌మేమ‌య్యే తీరే వేరుగా ఉంటుంది.

అలా వెళుతూ వెళుతూ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆదివారం పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని తొర్రూరు ప్ర‌ధాన ర‌హ‌దారిపై హ‌ఠాత్తుగా ఆగారు. ఆ రోడ్డుప‌క్క‌నే నెట్టుడు బండిపై ఫ్రూట్స్, సాలాడ్స్ అమ్ముకునే మ‌హిళ ద‌గ్గ‌ర‌కు వెళ్ళారు. ల‌స్సీ తాగారు. ఈ సంద‌ర్భంగా ఆ మ‌హిళ‌తో మంత్రి జ‌రిపిన సంభాష‌ణ ఈ విధంగా సాగింది.

ఈ జ్యూస్ బండి నీదేనా? వ్యాపారం ఎలా ఉంది? బాగా న‌డుస్తున్న‌దా? అంటూ కుశ‌ల ప్ర‌శ్న‌లు వేశారు. దీంతో ఆ ఫుట్ పాత్ మీద‌ వ్యాపారం చేసుకునే మ‌హిళ… బ‌దులిస్తూ, అంతా మీ ద‌య సార్‌, మీరు చూపిన దారి ఇది. మీరిచ్చిన అవ‌కాశం వ‌ల్లే… ఇవ్వాళ మా కుటుంబం బ‌తుకుతోంది. మేమే కాదు. మాలాగ చాలా కుటుంబాల ఐదు వేళ్ళూ నోట్లోకి వెళుతున్నాయంటే…మీ వ‌ల్లే సార్‌. అంది.

అది నా బాధ్య‌త‌… మీరే కాదు మీలా అంద‌రూ బాగుండాలె. అందులో మ‌న‌ముండాలె. సిఎం కెసిఆర్ గారి ద‌య వ‌ల్ల ఫుట్ పాత్ వ్యాపారుల‌కు కూడా ప్ర‌భుత్వం అండ‌గ నిలుస్తున్న‌ది. రుణాలిస్తున్న‌ది. నా వంతుగా నేను మీకు అండ‌గా నిల‌బ‌డ్డాను అంతే… అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు చెప్పారు.

అంతేకాదు… మీ వ‌ద్ద ఏమేం దొరుకుతాయి? ల‌స్సీ ఉందా? మాకు ఇవ్వు… అంటూ ల‌స్సీ తాగి, డ‌బ్బులు ఇచ్చారు. వ‌ద్దు సార్‌, మీకు మేం ఏం చేసినా రుణం తీర్చుకోలేమ‌ని ఆ మ‌హిళ అంది. అలాగ‌ని ఫ్రీ గా తాగేది లేదు. మీ వ్యాప‌ర ధ‌ర్మంగా మీరు తీసుకోవాలి. అంటూ ఆమె చేతిలో డ‌బ్బులు పెట్టి, అక్క‌డి నుండి క‌దిలారు. మంత్రి నేరుగా తన వ‌ద్ద‌కు వ‌చ్చి ల‌స్సీ తాగి, మాట్లాడి వెళ్ళ‌డంతో ఆ మ‌హిళ ఆనందానికి అవ‌ధుల్లేవు. ఇక ఈ దృశ్యాన్ని చూసిన వారంతా మంత్రి అయినా, ద‌య‌న్న మాత్రం మాతోనే అంటూ… సంతోషం వ్య‌క్తం చేశారు.

LEAVE A RESPONSE