చంద్రబాబు అమలు చేసిన 65కుపైగా పథకాల్ని రద్దుచేయడమేనా జగన్ రెడ్డి అమలుచేస్తున్న సామాజికన్యాయం?
• రాష్ట్రజనాభాలో 75శాతానికి పైగా ఉన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీల సంక్షేమం జగన్ పాలనలో మేడిపండు చందంగా తయారైంది
• చంద్రబాబు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీల సంక్షేమానికి మూడేళ్లలో రూ.2లక్షలకోట్లు ఖర్చుచేస్తే, జగన్ రెడ్డి నాలుగేళ్లలో కేవలం లక్షా80వేలకోట్లు మాత్రమే ఖర్చుపెట్టాడు
– టీడీపీ హెచ్.ఆర్.డీ ఛైర్మన్ బూర్ల రామాంజనేయులు
“జగన్ రెడ్డి జమానాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం మేడిపండు చందమైందని, నవరత్నాలపేరుతో ఆయావర్గాల్ని దారుణంగా వంచిస్తున్న ముఖ్యమంత్రి, మూడేళ్ల10 నెల ల్లో కేవలం ఆయావర్గాలకు లక్షా80వేలకోట్లు మాత్రమేఖర్చుచేశాడని టీడీపీ హెచ్.ఆర్.డీ ఛైర్మన్ బీ.రామాంజనేయులు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …
రాష్ట్ర జనాభాలో 75శాతంపైగా ఉన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని జగన్ రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితం చేశాడు
“రాష్ట్రజనాభాలో 75శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం, మరియు అభివృద్ధే నిజమైన సామాజికన్యాయం. వైసీపీప్రభుత్వం ఆయావర్గాల సంక్షేమానికి కేటాయిస్తున్ననిధులు, చేస్తున్నఖర్చులు చూస్తే జగన్ రెడ్డి వారిని ఎంతగా మోసగిస్తున్నాడో అర్థమవుతోంది. వైసీపీప్రభుత్వం నాలుగేళ్లలో రూ.7లక్షల 80వేల కోట్ల బడ్జెట్ ఖర్చు చేసింది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమానికి చేసిన ఖర్చు కేవలం లక్షా 80వేల కోట్లుమాత్రమే. కానీ టీడీపీప్రభుత్వం ఆయావర్గాలకు మొదటి మూడుసంవత్సరాల్లోనే రూ.2 లక్షలకోట్లు ఖర్చుచేసింది. జగన్ ప్రభుత్వ బడ్జెట్ తోపోలిస్తే, టీడీపీ వార్షికబడ్జెట్ సరాసరి రూ.1.40 లక్షలకోట్లు మాత్రమే. వైసీపీ సరాసరి వార్షిక బడ్జెట్ రూ.2.29 లక్షల కోట్లు. ఈ లెక్కన వైసీపీ ప్రభుత్వం బడ్జెట్లో ఆయా వర్గాలకు ఖర్చు చేసింది చాలా చాలా తక్కువే. జగన్ రెడ్డి ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీల సంక్షేమాన్ని ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితం చేస్తు న్నాడు అనడంలో ఎలాంటి సందేహంలేదు.
ఎస్సీ,ఎస్టీ,బీసీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించడం, చంద్రబాబు వారికోసం ప్రత్యేకంగా అమలుచేసిన పథకాల్ని రద్దుచేయడం ఎలాంటి సామాజికన్యాయమో జగన్ సమాధానం చెప్పాలి
చంద్రబాబు ఎస్సీలకు ప్రత్యేకంగాఅమలుచేసిన 27పథకాల్ని, బీసీలకు అమలుచేసిన 28 పథకాల్ని, మైనారిటీలకోసం ప్రవేశపెట్టిన10పథకాల్ని జగన్ రెడ్డి నిష్కారణంగా రద్దు చేశాడు. ఎందుకు రద్దుచేశాడంటే ఇప్పటికీ సమాధానంలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకోసం ప్రత్యేకంగా చంద్రబాబు అమలుచేసి, జగన్ రెడ్డి రద్దుచేసిన పథకాల్లో ఏఒక్క పథకమైనా ఆయావర్గాలకు ఉపయోగపడదని వైసీపీనేతలు, మంత్రులు చెప్పగలరా? వైసీపీ ప్రభుత్వం ఎస్సీఎస్టీల అభ్యున్నతికి అతిప్రధానమైన సబ్ ప్లాన్ చట్టాన్ని తుంగలో తొక్కింది. 10వేలకోట్ల రూపాయల ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని దారిమళ్లించింది. బీసీల సంక్షేమం కోసం వెచ్చించాల్సిన రూ.34వేలకోట్ల సబ్ ప్లాన్ నిధుల్నికూడా దారిమళ్లించారు. బడుగుబలహీనవర్గాల ఆర్థికఅభివృద్ధికి కీలకమైన ఆదరణపథకం, సబ్సిడీ రుణాల వంటి 28 పథకాల్ని రద్దుచేయడంద్వారా, బీసీలకు సామాజిక న్యాయాన్ని దూరంచేసిన వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు. మైనారిటీలకు ఉత్తుత్తిరిజర్వేషన్లు ఇచ్చి మోసగించిన తండ్రి రాజ శేఖర్ రెడ్డి బాటలోనే, జగన్ కూడా వారికి ఉత్తుత్తిసంక్షేమాన్నే అందించాడు.
అలానే చంద్రబాబుహాయాంతో పోలిస్తే, జగన్ జమానాలో ప్రజలపై పన్నులు, ధరలపెరుగదలభారం ఎక్కువగా పడింది. ఆ విధంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మూడింతలకు పైగా పెరిగింది. ఆదాయం పెరిగినా, లక్షలకోట్లు అప్పులుతెచ్చినా కూడా జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి సాలీనా నిధులు ఖర్చుచేయలేకపోయాడు. వారికోసం మూడేళ్లలో ఖర్చుపెట్టిన రూ.లక్షా80వేలకోట్లను కూడా జగన్ నవరత్నాల ఖర్చులోనే చూపుతున్నాడు. అందరితో పాటే ఆయావర్గాలని జగన్ తన నవరత్నాలతో తేటతెల్లంచేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారి టీలకు కేటాయించాల్సినన్ని నిధులుకేటాయించకుండా, వారికి అందించాల్సిన చేయూత అందించకుండా జగన్ రెడ్డి ఎలా సామాజిక న్యాయంఅమలుచేశాడో వైసీపీనేతలు, మంత్రులు సమాధానంచెప్పాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 38ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత, గుర్తింపు జగన్ రెడ్డి ఇవ్వలేదని తేలిపోయింది.
సామాజికన్యాయాన్ని ఎన్టీఆర్, చంద్రబాబులు తూచా తప్పకుండా ఆచరణలో చేసి చూపిస్తే, జగన్ దాన్ని కేవలం మాటలు, కాగితాలకే పరిమితంచేసి పబ్బంగడుపుకుంటున్నాడు
సామాజికన్యాయాన్ని తూచాతప్పకుండా అమలుచేసింది టీడీపీప్రభుత్వాలే అని ఆధారాలు అంకెలతో సహా తాము నిరూపించడానికి సిద్ధం. బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాముల్ని చేసిన ఘనుడు స్వర్గీయ ఎన్టీఆర్ మాత్రమే. పక్కాఇళ్లు, రూపాయికే కిలోబియ్యం, మహిళ లకు ఆస్తిహక్కు, గురుకుల పాఠశాలలఏర్పాటు, స్థానికసంస్థల్లో రిజర్వేషన్లు, డ్వాక్రాసంఘాల ఏర్పాటుతో స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు అసలైన సామాజిక న్యాయాన్ని ఆచరణలో చేసిచూపించారు. డ్వాక్రాసంఘాల్లో మహిళల్ని భాగస్వాముల్నిచేసి, వారిపనితీరుని ప్రపంచా నికి పరిచయం చేసినఘనత చంద్రబాబుకే దక్కుతుంది.
పసుపు-కుంకుమ కింద ప్రతిడ్వాక్రా మహిళకు చంద్రబాబు రూ.20వేలఆర్థికసాయం అందించారు. కానీ జగన్ రెడ్డి డ్వాక్రాసం ఘాల రుణాలరద్దుతో కేవలం కొందరుమహిళలకే న్యాయంచేశాడు. రుణాలు కట్టినవారికి, జగన్ మాఫీచేసిన డ్వాక్రారుణాలరద్దుతో ఎలాంటి ఉపయోగంలేకుండా పోయింది. చంద్రబా బు రైతులకు రూ.3లక్షలవరకు వడ్డీలేని రుణాలు అందిస్తే, జగన్ రెడ్డి దాన్నికేవలం రూ.లక్షకే పరిమితంచేశాడు. రైతులకు అందించాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమా, గిట్టుబాటు ధర వంటివాటిని జగన్ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించింది. అప్పులకు కక్కుర్తి పడి, ఆఖరికి రైతులమోటార్లకు మీటర్లుపెట్టడానికి జగన్ సిద్ధమయ్యాడు.
చంద్రబాబు ప్రవేశ పెట్టిన అన్నక్యాంటీన్లు రద్దుచేయడం సామాజికి న్యాయం ఎలాఅవుతుందో జగన్ సమాధా నం చెప్పాలి. చంద్రబాబు అన్నివర్గాలకు ఎలాంటి నిబంధనలులేకుండా పెండ్లికానుక ఆర్థికసాయం అందిస్తే, జగన్ వధూవరులు ఇద్దరు 10వతరగతి చదివితేనే పెండ్లికానుక ఇస్తానని మెలికపెట్టాడు. నాడు-నేడు, ఉపాధ్యాయఖాళీలభర్తీ నిలుపుదలతో పాఠశాలల్ని, విద్యని విద్యార్థులకు దూరంచేసిన జగన్ రెడ్డి పెండ్లికానుక సాయానికి పదోతరగతి చదవాలనే నిబంధనపెట్టడం ముమ్మాటికీ దుర్మార్గమే.
కేంద్ర ప్రభుత్వం ప్రత్యే కంగా దళిత, గిరిజనులకోసం అమలుచేసే ఎన్.ఎస్.డీ.సీ, ఎన్.ఎస్.కే.ఎఫ్.డీసీ వంటిపథకాలకు రాష్ట్ర ప్రభుత్వవాటాగా ఇవ్వాల్సిన నిధుల్ని కూడా జగన్ రెడ్డి ఇవ్వకుండా ఆపేశాడు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలకు ఇన్నోవాకార్లు, ట్రాక్టర్లు, పవర్ ఆటోలు, వంటివాటిని సబ్సిడీపై అందించాడు. జగన్ వచ్చాక ఒక్క ఆటోకూడా ఇచ్చిందిలేదు. అదేనా ఆయన వారికి అమలుచేస్తున్న సామాజికన్యాయం?
ఎస్సీ, ఎస్టీలరక్షణకోసం తీసుకొచ్చిన ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నే జగన్ దుర్వినియోగం చేస్తున్నాడు. ఆచట్టాన్ని వారిపైనే ఉపయోగించి, తన కక్షసాధింపు లకు వారిని ఆయుధాలుగా చేసుకున్నాడు. విదేశీవిద్య కింద ఎస్సీలకు రూ.15 లక్షలు, ఇతరవర్గాలకు రూ.10లక్షలు ఇచ్చి, దాదాపుగా 4,500మందిని విదేశాలకు పంపించడం చంద్రబాబు చేసిన సామాజికన్యాయం కాదా?
అలాంటిపథకాన్ని మూడేళ్లపాటు ఆపేసి, ఇటీవల తూతూమంత్రంగా కేవలం 230మందికే విదేశీవిద్యకింద డబ్బులిస్తామని జగన్ రెడ్డి చెప్పడం సామాజికన్యాయం అవుతుందా? అలానే చంద్రబాబు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేదానితో పాటు, ఎస్సీ, ఎస్టీలకు ఇళ్లనిర్మాణానికి అదనంగా రూ.50 వేలు అందించారు. గతప్రభుత్వంలో చంద్రబాబు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలకు ప్రత్యేకంగా అమలు చేసిన అన్నిపథకాల్ని జగన్ రెడ్డి తక్షణమే పునరుద్ధరించాలి.” అని రామాంజనేయులు డిమాండ్ చేశారు.