ఎక్కడా పాలాభిషేకాలు లేవు…సంబరాలు లేవు. ,మోడీకి… నిర్మలా సీతారామన్ కు సన్మానాలు లేవు..
పన్నులు తగ్గితే…పన్నుల సంస్కరణలు వస్తే..ప్రజలు అంత ఉబ్బి తబ్బిబ్బు అయిపోరు అన్నమాట.
ఆర్థిక వేత్తలు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి…
అదే…ఉద్యోగులకు బోనస్ ఇస్తేనో..లేకుంటే ఉచితంగా ప్రజల ఖాతాలోకి డబ్బులు వేస్తేనో…కట్ ఔట్ లు పెట్టి గెంతులు వేస్తారు..
ఇంకా గమనిస్తే… ఏ సమ్మె లాంటిదో చేసినప్పుడు..అందర్నీ డిస్మిస్ చేసి ..మళ్ళీ దయతలచి ఉద్యోగాలు ఇస్తే కూడా అభిషేకాలు చేస్తారు…
ఎంత సేపూ..మోడీ పదిహేను లక్షలు వేస్తా అన్నాడన్న తప్పుడు ప్రచారం చేసి ఎద్దేవా చేస్తారు తప్పితే…ఇంత పెద్ద ఎత్తున పన్నులు తగ్గిస్తే..భాజపా శ్రేణులు కూడా పండుగ చెయ్యలేదు..
ఇది సులభంగా విస్మరించే విషయం కాదు. రహదార్లు మంచివి వెయ్యడం…మౌలిక వసతులు కల్పించడం..దీర్ఘకాలిక దృష్టితో…ఉపాధి కల్పన చెయ్యడం కూడా ప్రజలు ఆనంద పడే విషయంగా తోచడం లేదు..
వాజ్ పాయ్ పరిపాలన ఎన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేసింది ?అయినా ఇంటికి పంపించి…దోపిడీ ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చుకున్నారు ప్రజలు…
అంటే..ఇవన్నీ చూసే కదా..మూడో సారీ మోదీని తెచ్చింది అనొద్దు…240 కి తగ్గించారు అన్నదే నిజం!..
అసలు ఒక్కొక్క రాష్ట్రంలో రైల్వేలు..హైవేలు… వేర్ హౌస్ లు…ఇంటర్నెట్ కనెక్టివిటీ… కాలేజీలు… ఎయిర్పోర్టులు…గ్రామీణ రహదారులు..ఆఖరికి స్మశానాల నిర్మాణం కూడా కేంద్రం ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఇస్తోంది….
ఆయుధాలు..ఎగుమతులు … ఫారెక్స్ నిల్వలు…
అంతెందుకు…ఎనభై కోట్ల మందికి కరోనా నుంచి ఉచిత రేషన్.
ఎక్కడో ప్రజా ధోరణిలో…దాన్ని అర్థం చేసుకోవడంలో భాజపా వెనుకబడిందేమో అనిపిస్తోంది…
జీఎస్టీ తగ్గింపు పై భాజపా శ్రేణులు ఒక్క ఉదుటున రోడ్ల మీదకి వచ్చి బాణసంచా కాల్చారా…ఊరేగింపులు చేశారా?. దానికీ పార్టీ సూచనలు ఇచ్చి…కార్యక్రమం ఇవ్వాలా.
కమ్యూనిస్టులు అబద్ధాలు చెప్పి కూడా రోడ్లెక్కి సంబరాలు చేసుకుంటారే.!?. అంటే… ధరలు దిగిరావు అన్న అనుమానం బీజేపీ కార్యకర్తలకు ఏమైనా ఉందా.?. 22 వరకూ వేచి చూసి..అప్పుడు లేస్తారా బుద్ధి మంతులు.?!
అసలు ఖాన్ గ్రేస్ చూడండి….ఓట్ల చోరీ అని అబద్ధం చెప్పి…ఊరంతా యాగీ చెయ్యగలిగింది..
ఇంత విప్లవాత్మక పన్నుల తగ్గింపుకు ప్రజలు స్పందించ లేదు అంటే….అదే పెద్ద ఆశ్చర్యం అంటే…బీజేపీ స్తబ్ధత లో ఉండడం ఇంకా వింతగా ఉంది…
ఎక్కడో తేడా కొడుతోంది.!
గిచ్చి జోలపాడడమే సరైనదా.?!
సహజ సిద్ధమైన స్పందన కూడా రాలేనంతగా పార్టీ ఎలా నొక్కుకు పోయింది.?.
సాధారణ ప్రజా మనస్తత్వం బాగా అధ్యయనం చేయాలి….బీజేపీ పార్టీ వ్యవహారాన్ని కూడా బాగా స్టడీ చేయాలి..
లేకుంటే…ఖర్గే ఆరునెలల్లో ఈ ప్రభుత్వం పడి పోతుంది అని ఊరికే చెప్పి ఉండరు…పార్టీ ఆదేశిస్తేనే…పనులు చేస్తాం అంటే…ఈ పార్టీ ఖర్గే అనే ముసలాయన దెబ్బకు పడిపోయేదే అయివుంటుంది.
స్వీయ ప్రేరణ లేని…ఉక్కు సదృశ నిర్మాణాలు ఉన్న పార్టీ…మర మనుషుల గుంపులు కలిగి ఉన్న వ్యవస్థ చిన్న విప్లవానికే పడి పోవచ్చు.. ..తాత్కాలికంగా గట్టిగా కనిపించవచ్చు అంతే!..
అదే జాతీయ వాదులలో చాలా మంది…నిర్మలా సీతారామన్ ను అనేక విషయాల్లో ఆడిపోసుకున్న వాళ్ళు మనలోనే ఉన్నారు. ..ఈరోజు ఖాన్ గ్రేస్, కమ్యూనిస్టులు లాగే..వాళ్ళు కూడా…ఒక్క పొగడ్త లేదు…
తెలుగు న్యూస్ ఛానెళ్లు…నిర్మలా సీతారామన్ లైవ్ నడుస్తూనే ఉంది…ఠక్కున కవిత విషయానికి…లోకల్ కుక్కల నివారణకు షిఫ్ట్ అయిపోయాయి.. ఈ మానసికత…దేశాన్ని అమృత కాలానికి తీసుకుని వెళ్లడంలో పెద్ద అడ్డంకి…అవునా? .నేనే తప్పుగా ఆలోచన చేస్తున్నానా.?.
అన్నట్టు ఆ రోజు ఉదయం అందుబాటులో ఉన్న పదిమందికి స్వీట్లు పంచాను…. సంస్కరణల లాభాలు కొందరు విద్యార్థులకు వివరించాను… మరి ఈ జీఎస్టీ తగ్గింపు అంత చిన్న విషయమా… ప్రజలకు…అధికార రాజకీయ పార్టీకి.?..
మీకూ ఈ విషయం ముఖ్యమైనది అనిపించడం లేదా?..
– భారతీయుడు