Suryaa.co.in

Telangana

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా?

– బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా అనే అనుమానం వస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ నుంచి పత్రిక ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ, తెలంగాణ రాష్ట్రంలో తెరాస నాయకులు ప్రధాన మంత్రి శవ యాత్రలు చేస్తుంటే, పోలీసులు చోద్యం చూస్తున్నారని డీకే అరుణ ద్వజమెత్తారు.

ప్రజా సమస్యల పై బీజేపీ నిరసనలకు పిలుపునిస్తే ,ముందస్తు అరెస్టుల పేరుతో బీజేపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసే పోలీసులు, తెరాస పార్టీ నాయకులు చేస్తుంటే డీజీపీ మహేందర్ రెడ్డి కి కనిపించడం లేదా అంటూ డీకే అరుణ ప్రశ్నించారు. పోలీసులు ప్రజల కోసం పని చేయాలి కానీ , తెలంగాణ లో మాత్రం అధికార పార్టీ నాయకులచే శబాష్ అనిపించుకునేందుకు పోలీస్ అధికారులు పోటీ పడుతున్నట్టు ఉన్నదని డీకే అరుణ వ్యాఖ్యనించారు.

ఇప్పటికైన పోలీస్ అధికారులు తమ వైఖరి మార్చుకోవాలని , లేదంటే ప్రజల నుంచి మరింత వ్యతిరేకతను ఎదుర్కోవల్సి వస్తుందని, ఎపుడు తెరాస పార్టీ మాత్రమే అధికారంలో ఉండదన్న విషయాన్నీ పోలీస్ అధికారులు గుర్తు పెట్టుకుంటే మంచిదని, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

LEAVE A RESPONSE