Suryaa.co.in

Andhra Pradesh

బీసీల అడ్డా ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి పెత్తనం ఏంటి?

-పేనుకు పెత్తనమిస్తే తలగొరికినట్టు విజయసాయిరెడ్డికి పెత్తనం ఇస్తే ఉత్తరాంధ్రను దోచేశాడు
-వైసీపీ పాలనలో ఇబ్బందులు ఎదుర్కోని కులం ఏదైనా ఉందా?
– పంచుమర్తి అనురాధ

బీసీలు అధికంగా ఉన్న ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి పెత్తనం ఏంటని, పేనుకు పెత్తనం ఇస్తే తల గొరికినట్టు విజయసాయిరెడ్డికి పెత్తనమిస్తే ఉత్తరాంధ్రను దోచేశాడని టీడీపీ రాష్ర్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ద్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ……

విశాఖలో విజయసాయిరెడ్డి దందాలు బయటకు రాకుండా ఉండేందుకు కమ్మకులాన్ని తిడుతున్నారు. గుణం లేని వాడే కులం గొడుగు పడతాడు. చార్టెట్ అకౌంటెంట్ ఉన్న విజయసాయిరెడ్డి వైయస్ కుటుంబం పంచన చేరి దొంగ లెక్కలు రాసి జగన్ రెడ్డితో సహా 16 నెలలు చిప్పకూడుతిన్నారు. రాజ్యసభ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉత్తరాంధ్రలోని ప్రజల ఆస్తులు, భూములు దోచేస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నాయకుడు అచ్చెన్నాయుడుని టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా చేస్తే బీసీలు అధికంగా ఉన్న ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జిలుగా విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను జగన్ రెడ్డి నియమించారు.

బీసీలు అధికంగా ఉన్న ఉత్తరాంధ్రలో నెల్లూరుకి చెందిన విజయసాయిరెడ్డి పెత్తనమేంటి? సాయిరెడ్డి తన కూతురు, అల్లుడిని అడ్డం పెట్టుకుని ఉత్తరాంధ్రను దోచేస్తున్నారు. భూ కబ్జాలు చేస్తూ నాకేం సంబందం లేదంటూ అమాయకుడిలా మాట్లాడటం సిగ్గుచేటు. విజయసాయిరెడ్డి మాటలు సొంత పార్టీ నేతలు కూడా నమ్మే పరిస్థితి లేదు. వివేకా హత్యపై ఉదయం గుండెపోటన్నారు, సాయంత్రం హత్య అన్నారు, హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో కూడా ఉదయం ఒక మాట, సాయంత్రం మరో మాట్లాడిన వ్యక్తి విజయసాయిరెడ్డి. తన కుమార్తె ఆస్తులతో తనకేం సంబంధమన్న విజయసాయి రాష్ట్రంలో ఎవరు భూములుకొన్నా చంద్రబాబుగారి బధువులవని ఎలా మాట్లాడతాడు?

గతంలో విశాఖలో మీ కూతురు కొన్న భూములు, ఆస్తులెన్ని? ఈ 3 ఏళల్లో కొన్నవి ఎన్ని? శ్వేతపత్రం విడుదల చేయగలరా? అమరావతిలో కమ్మ వాళ్లున్నారంటున్నారు, బీసీల అడ్డా అయిన ఉత్తరాంధ్రలో కూడా కూడా కమ్మవాళ్లున్నారని సిగ్గులేకుండా విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారు. గుణం లేనివాడే కులం గొడుగుపడతాడు. వైసీపీ 3 ఏళ్ల పాలనలో ఇబ్బంది పడని కులం ఏదైనా ఉందా? రాజులు, కాపులు, దళితులు, బీసీలు అన్ని కులాల్ని ఆర్దికంగా, రాజకీయంగా అణగ ద్రోక్కుతున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ ప్రెసిడెంట్ గా చంద్రశేఖర్ రెడ్డిని నియమించేందుకు గంగరాజును వెల్లగొట్టారు. ఎంపీ రఘురామరాజుపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. కాపు నేత మాజీ మంత్రి నారాయణపై అక్రమ కేసులు పెట్టారు, బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు, రిజర్వేషన్లు తగ్గించి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో 1600 మంది బీసీలకు పదవులు లేకుండా చేశారు. ప్రకాశం జిల్లాలో బీసీ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. దళిత డా సుధాకర్ ని మానసికంగా హింసించి చంపారు. చివరకు రెడ్లు కూడా జగన్ రెడ్డిని అసహ్యించుకుంటున్నారు.

తన కుమార్తె ఆస్తులతో తనకేం సంబంధమన్న విజయసాయి రాష్ట్రంలో ఎవరు భూములుకొన్నా చంద్రబాబుగారి బధువులవని ఎలా మాట్లాడతాడు? కార్తీకవనం, అనకాలపల్లిలో 400 ఎకరాల లేఅవుట్ దందా, హైగ్రీవా రియల్ ఎస్టేట్, బే పార్క్న ఎలా ఆక్రమించారో దసపల్లా భూముల దందా, భోగాపురం సహా అన్ని దందాలపై చర్చకు విజయసాయి సిద్ధమా? రుషికొండను ఎలా బోడిగుండుచేశారో చర్చిద్దామా? రేడియంట్ డెవలపర్స్ తో విజయసాయిరెడ్డికి ఉన్న లాలూచీ ఏంటో చర్చిద్దమా? విశాఖ వైసీపీ ఎంపీ డెవలప్ మెంట్ కి భూములు తీసుకుని యజమానులకు కేవలం 1 శాతమే ఇస్తున్నారని దసపల్లా భూముల్లో మాత్రం 30 శాతం ఇస్తున్నారని విజయసాయిరెడ్డి గొప్పలు చెప్పుకోవటం ఏంటి? వైసీపీ మూడేళ్ల పాలనలో కబ్జాలు తప్ప ఉత్తరాంద్రలో చేసిన అభివృద్ది ఏంటి? చంద్రబాబు నాయుడు తెచ్చిన ప్రాంక్లిన్ టెంపుల్టన్, లులూ, ఐబీఎం, స్టార్టప్ కంపెనీ విలేజ్ 150 కంపెనీలు, అదానీ వంటి కంపెనీలు వెళ్లగొట్టారు. పరిశమ్రలకు రాయితీలివ్వటం లేదు, కోవిడ్ టైం ప్రాపర్టీ టాక్స్ వేశారు. అసలు మీరు ఉత్తరాంధ్రకు చేసిన మేలేంటి? వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వద్దన్నారు, ఇప్పడు సీబీఐ ఎంక్వైరీ అంటున్నారు. విజయసాయిరెడ్డే తనపై ఎంక్వైరీ వేయించుకుని తన నిజాయితీ నిరూపించుకోవాలి.

టీడీపీ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ది
1.విశాఖపట్నం : IIM – పెట్రోలియం యూనివర్శిటీ – ఐటీ కేంద్రం – మెడ్ టెక్ జోన్ – లులూ, అదానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఫిన్టిక్ వ్యాలీ, మిలీనియం ఐటీ టవర్స్, క్లౌడ్ సిటీ ఏర్పాటు మూడు సార్లు CII సదస్సులు
2. శ్రీకాకుళం : IIT భావనపాడు ఓడరేవు డయాలసిస్ కేంద్రం – – – వంశధార.. బాహుదా అనుసంధానం
3. విజయనగరం : ట్రైబల్ యూనివర్శిటీ – మ్యూజిక్ అండ్ లలిత కళల హార్టీకల్చర్ కాలేజీ – సెంచూరియన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ – భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం – తోటపల్లి రిజర్వాయర్ – పతంజలి ఫుడ్ పార్క్ ఇవన్నీ చంద్రబాబు నాయుడి ఘనతే. కాదని వైసీపీ నేతలు చెప్పగలరా? ఉత్తరాంధ్రలో వైసీపీ బీసీ నేతల్ని కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం చేశారు? కులమతాలకు అతీతంగా పనిచేస్తామని ప్రమాణం చేసిన వైసీపీ నేతలు కమ్మకులంపై విషం చిమ్ముతున్నారు, అన్ని కులాల్ని అనగద్రొక్కుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో తన దందాలపై విజయసాయిరెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE