– దివ్యాంగుడి కన్నీళ్లు ఎవరు తుడుస్తారు?
– జగిత్యాల కలెక్టరేట్ సంఘటన మానవత్వానికి మాయని మచ్చ..
– రాష్ట్ర దివ్యాంగుల కార్పోరేషన్ మాజీ చైర్మన్. డా.కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
హైదరాబాద్ : ప్రజావాణిలో తనకున్న సమస్యను చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడిని పోలీసులు ఈడ్చికొని తీసుకువెళ్లడం అత్యంత అమానవీయం. ఇది ప్రజాస్వామ్యమా? లేక రాచరికమా ? కాంగ్రెస్ చెప్పిన ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం ఇదేనా ?
ఇంత దారుణ ఘటన తన కండ్లముందే జరిగినా చూసి చూడనట్టు వెళ్ళిపోయిన కలెక్టర్. దివ్యాంగుల గౌరవం ఎక్కడ? దివ్యాంగుడి కన్నీళ్లు ఎవరు తుడుస్తారు? ప్రజల గౌరవం కాపాడలేని ప్రభుత్వం ఏ పని చేస్తుంది? తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, జగిత్యాల మంత్రి, జిల్లా కలెక్టర్ స్పందించి ఆ దివ్యాంగుడి సమస్యను తీర్చాలని కోరుతున్నాను.