– లగచర్ల కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉన్న రైతన్నకు గుండెపోటు వచ్చినా బేడీలు వేయడంపై తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ : ఇదేనా ప్రజాపాలన ? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? రైతు తనకు గుండెనొప్పి వచ్చిందన్నా ఈ పాలకుల గుండె కరగదా ? ప్రజాపాలనలో లగచర్ల రైతుకు జరిగిన సన్మానమిదా ? ఫార్మా క్లస్టర్ పేరిట గిరిజన తండాలలో మంటలు రాజేసి ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు బనాయిస్తారా ? అర్దరాత్రి ఇండ్ల మీద పడి ఆడబిడ్డలను వేధించిన సర్కారుకు అన్నదాత అంటే గౌరవం ఉంటుందా ? భూమిని నమ్ముకుని బువ్వను అందించే రైతన్న మీద ప్రేమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేమ ఇదా ?