Suryaa.co.in

Andhra Pradesh

సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఉండే సంస్కారం ఇదేనా: పరిటాల సునీత

వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శలు గుప్పించారు. వ్యక్తిగతంగా విమర్శించే హక్కు ఏ ఒక్కరికి లేదని ఆమె అన్నారు. 40 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిపై ఇన్ని అబాండాలు వేస్తుంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి వెకిలి నవ్వులు నవ్వుతున్నాడని సునీత మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఉండే సంస్కారం ఇదేనా అని పరిటాల సునీత ప్రశ్నించారు. వివేక హత్య గురించి మాట్లాడతారేమోనని ఈ విధంగా మాట్లాడారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE