Suryaa.co.in

Andhra Pradesh

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎంకు ఇచ్చే గౌరవం ఇదేనా..?

డిప్యూటీ సీఎం నారాయణస్వామి

అమరావతి: ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎంకు ప్రతిపక్ష సభ్యులు ఇచ్చే గౌరవం ఇదేనా..? అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. సభలో తనను అవసరంగా టీడీపీ సభ్యులు తిట్టారని, దూషణలకు పాల్పడిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు. సోమవారం సభలో టీడీపీ నేతల తీరును డిప్యూటీ సీఎం ఖండించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ.. అసెంబ్లీ అనే దేవాలయంలో టీడీపీ రాక్షస మూకలు వచ్చి దౌర్జన్యానికి దిగుతున్నారు.

చంద్రబాబుకు ఎస్సీలంటే ముందు నుంచి గిట్టదు. ఆయన ఇంట్లో పని చేసే వారంతా కూడా ఆయన సామాజిక వర్గానికి చెందిన వారే. టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఎస్సీలు ఎవరూ కూడా ముందుకు రాలేదు. బాల వీరాంజనేయులు అనే వ్యక్తి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన్ను చంద్రబాబు పావులాగా వాడుకుంటున్నారు. బుద్దభగవానుడిలా ఉన్న స్పీకర్‌పై ఎస్సీ ఎమ్మెల్యేను దాడికి పురిగొల్పారు. బాల వీరాంజనేయులు చెయ్యి స్పీకర్‌పై పడింది. మా సామాజిక వర్గానికి చెడ్డపేరు రాకూడదనే ఎలీషా అనే మా ఎమ్మెల్యే అడ్డుకునేందుకు పరుగెత్తుకొని వచ్చాడు. ఎస్సీలు బీసీలను కొట్టారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తాడు. సుధాకర్‌బాబు పరుగెత్తుకొనిపోగా ఆయన్ను కూడా కిందకు తోసేశారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు అసెంబ్లీకి రాడు. వైయస్‌ జగన్‌ నడక భూమిపైనే అంటే..చంద్రబాబు తన నడక కోటిశ్వరులతోనే అంటాడు.

వైయస్‌ జగన్‌ ఉద్యోగులు, పెన్షనర్లతో ప్రేమగా ఉంటే..చంద్రబాబు వీళ్ల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు చేస్తారు. చంద్రబాబు గతంలో 23 మంది మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు. మా వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి మా నేతను తిట్టించాడు. మా మైనారిటీ ఎమ్మెల్యేను కొనుగోలు చేసి మంత్రిని చేసి మమ్మల్ని తిట్టించాడు. స్పీకర్‌పై దాడికి పాల్పడిన అందరిపై చర్యలు తీసుకోవాలి. డిప్యూటీ సీఎంగా ఉన్న తనను రా రా ..నా ..అంటున్నారు. నేను స్పీకర్‌ పోడియం వద్దకు రాలేదు. అనవసరంగా నాపై దూషణలకు దిగారు. నలుగురు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేతలు అవమానకరంగా మాట్లాడారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎంకు ఇచ్చే గౌరవం ఇదేనా..? .వైయస్‌ జగన్‌ దళితులకు రాజ్యాధికారం ఇస్తుంటే..చంద్రబాబు మాత్రం ఎస్సీలను తిట్టిస్తున్నారు. టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణస్వామి డిమాండు చేశారు.

LEAVE A RESPONSE