Suryaa.co.in

Telangana

ఇదేనా.. మీరు చెప్పే తెలంగాణ మోడల్ అంటే

– .ఈ పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది శూన్యం
– సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క

తెలంగాణ రాష్ట్రానికే తలమానంగా ఉండేలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ రాజశేఖర్ రెడ్డిగారు.. అవుటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషల్ ఎయిర్ పోర్టు తీసకువచ్చారు. తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి ఏ మాత్రం పట్టించుకోని టీఆర్ఎస్ ప్రభుత్వం అవుటర్ రింగు రోడ్డును 30 ఏళ్లపాటు టోల్ వసూలు చేసుకేందుకు ఒక పకరవేట్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుందని పత్రికల్లో వచ్చింది. వీళ్లను ఎన్నుకున్నదే ఐదేళ్ల కోసం.. అదికూడా పాలించడానికే తప్ప భూములు అమ్ముకోవడానికి, గత ప్రభుత్వాలు ప్రజల కోసం నిర్మించిన ఆస్తులను , సంస్థలను వ్యవస్థలను దశాబ్దాలపాటు లీజుకు ఇవ్వడానికో అమ్ముకోవడానికో కానేకాదు. తెలంగాణ రాష్ట్రాన్ని కుదవపెట్టి.. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్లు అప్పులు చేసింది. మోయలేనంత భారాన్ని ప్రజలపై వేసింది.

అపారమైన వనరులు, అద్భతంగా వస్తున్న పన్నులతో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నా.. మిగులు బడ్జెట్ ను నాశనం చేసి, రూ. 5 లక్షల కోట్లు అప్పులు చేసి, అది సరిపోక రింగ్ రోడ్డును టోల్ వసూలు చేసుకునేందుకు ఒక ప్రవేట్ కంపెనీకి అగ్రిమెంట్ చేసుకున్నావు. ఆ 30 ఏళ్ల టోల్ మొత్తాన్ని ఇప్పుడే ఈయన వసూలు చేసుకుని ప్రజల ఆస్తిని నాశనం చేస్తున్నాడు. ప్రభుత్వం వసూలు చేయాల్సిన పన్నులను ఒక అదానీకో, అంబానీకో రాబోయే 30 ఏళ్లకు తెలంగాణ పన్నుల వసూలు చేసుకొమ్మని అగ్రిమెంట్ చేసుకుని.. ఆ డబ్బులు ఇప్పుడే నాకు కట్టండని చేస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఇదీ అలాగే ఉంది. రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టిన దుర్మార్గ పాలన.

తెలంగాణ ప్రభుత్వం అందినకాడికి అమ్మేసే ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్ లో ఉన్న భూములను అమ్ముతున్నారు. చివరకు గత ప్రభుత్వాలు పేదలకు అసైండ్ చేసిన భూములను వదలడం లేదు. ఇంతటి దోపిడీ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ, ఎక్కడా లేదు. కేటీఆర్ ను నేను సూటిగా అడుగుతున్నాను. గత 70 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమీ చేయలేదని అంటున్నావు. దేశాన్ని తెలంగాణ మోడల్ తో అద్భుతంగా పాలన చేస్తామని అంటున్నావు.. అసలు తెలంగాణ మోడల్ అంటే లిక్కర్, కాళేశ్వరం, భగీరథ, మిషన్ కాకతీయ స్కాములు, హైదరాబాద్ భూముల అమ్మకం, అవుటర్ రింగురోడ్డు 30 ఏళ్లకు లీజుకు ఇవ్వడం, రూ. 5 లక్షల కోట్లు అప్పులు చేయడం, మద్యం అమ్మకాలు రూ.36 వేల కోట్లకు పెంచడం ఇదే.. మీరు చెప్పే తెలంగాణ మోడల్ అంటే.

కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమీ చేయకపోతే.. 30 ఏళ్లకు లీజుకు ఇచ్చిన అవుటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషలన్ ఎయిర్ పోర్టు, హైదరాబాద్ చుట్టూ స్థాపించిన పరిశ్రమలు, తెలంగాణ రాష్ట్రంలో పారుతున్న నీళ్లు, ఎస్సారెస్పీ, కడెం, దేవాదుల ఎత్తిపోతల పథకం, శ్రీపాద ఎల్లంపల్లి, జూరాల, నెట్టెంపాడు, కోయల్ సాగర్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ శ్రీశైలం, నాగార్జున సాగర్, భీమా సాహా అనేక ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వాలే.ఈ పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది శూన్యం మాత్రమే. ఈ రోజు రాష్ట్రంలో 15 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమైతే. ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందించిపెట్టించింది కాంగ్రెస్ మాత్రమే.నీళ్ల కోసం ఈ రాష్ట్నాన్ని తెచ్చుకున్నాం. రెండు జీవనదుల మధ్య డెక్కన్ పీఠభూమిగా మనది. గోదావరి మీద మీరుమొదలు పెట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి ఎక్కడైనా ఒక్క ఎకరానికి నీళ్లు పారిస్తున్నారా?

క్రిష్ణా నది మీద మీరు మొదలు పెట్టింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. ఇంతవరకూ ఒక్క చుక్క నీళ్లు పంపు చేసేందుకు ఒక మొటార్ కూడా పెట్టలేదు. నీళ్ల కోసం తెచ్చుకున్న తెలంగాణలో అటు గోదావరి, ఇటు క్రిష్ణ నీళ్లు కూడా తీసుకురాలేదు. దశాబ్దకాలంలో రాష్ట్రంలో ఒక్క బీహెచ్ఈఎల్ వంటి పరిశ్రమ తీసుకురాలేదు.

LEAVE A RESPONSE