Suryaa.co.in

Andhra Pradesh

ఇదా నీ రైతుభరోసా? సిగ్గుందా జగన్ రెడ్డి..

– రైతుభరోసాపై ముఖ్యమంత్రి చెప్పినవన్నీ క్విడ్ ప్రోకోలెక్కలే
– కేంద్ర ప్రభుత్వం పీఎంకిసాన్ యోజన పథకం రాష్ట్రంలో 36లక్షలమందికే అంటుంటే, జగన్ రెడ్డి మాత్రం తాను 52,30,939కిఇస్తున్నట్టు చెప్పడం అబద్ధంకాదా?
– 45లక్షల మెట్రిక్ టన్నులధాన్యం కొని, 75లక్షల మెట్రిక్ టన్నులు కొన్నట్టు చెప్పడం అబద్ధంకాదా?
రైతుభరోసా చెల్లింపులు, ధాన్యంకొనుగోళ్లలో జరిగినదోపిడీని త్వరలోనే ప్రజలముందు పెడతాం
• రైతుభరోసా కింది నాలుగేళ్లలో ఒక్కోరైతుకి రూ.7,500చొప్పున రూ.30 వేలిచ్చిన జగన్, రూ.50వేలుఇచ్చేశానని చెప్పడం అబద్ధంకాదా?
• కేంద్రసాయం లేకుండానే, చంద్రబాబు అన్నదాతాసుఖీభవ కింద రాష్రంలోని ఒక్కోరైతుకి రూ.15వేలు ఒకేసారి అందించారు. 14లక్షల కౌలురైతులకు కూడా సాయంచేశారు.
• టీడీపీప్రభుత్వం 4ఏళ్లలో రూ.4వేలకోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చింది. 4ఏళ్లలో జగన్ రెడ్డి ఇచ్చిన ఇన్ పుట్ సబ్సిడీ కేవలం రూ.1900 కోట్లు.
• వైసీపీఎంపీ లెక్కప్రకారమే ధాన్యంకొనుగోళ్లలో ఈ ప్రభుత్వం రూ.6వేలకోట్లు దోచేసింది. వాస్తవానికి జరిగింది రూ.12వేలకోట్ల దోపిడీ. దాన్ని త్వరలోనే జనంముందు బయటపెడతాం.
• విత్తనం నుంచి విక్రయంవరకు ఈ ప్రభుత్వంలో రైతు అడుగడుగునా దగాపడ్డాడు. పంటమునిగింది పరిహారం ఇవ్వమన్న రైతుల్ని వెర్రిపప్పలని ఎగతాళిచేసిన మంత్రుల్ని పక్కనపెట్టుకున్న జగన్ రెడ్డికి రైతుల గురించి మాట్లాడే అర్హతలేదు.
• చంద్రబాబు నేలపైకూర్చొని ధర్నాలుచేస్తే తప్ప పంటలబీమాసొమ్ముకి సంబంధించి అర్థరాత్రి జీవోలు ఇచ్చే దుస్థితిలో ఉన్న జగన్ కూడా రైతులగురించి మాట్లాడితే ఎలా?
– తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

“అబద్ధానికి బట్టలేసి ముక్కు, ముఖంపెడితే అది జగన్మోహన్ రెడ్డిలా ఉంటుంద ని, కర్నూలుజిల్లా పత్తికొండలో నేడు ముఖ్యమంత్రి 5వ సంవత్సరం 13వవిడత రైతుభరోసా పేరుతో రైతుల్ని నమ్మించే 420ప్రయత్నంచేశాడని, నిజం తననోటి నుంచివస్తే, తనశిరస్సు వెయ్యిముక్కలవుతుందన్న భయంతో ఆయన మాట్లాడి నట్టుగా ఉందని టీడీపీనేత, తెలుగురైతువిభాగం రాష్ట్రఅధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే ..

“ తానుమాట్లాడే అబద్ధాలు, అసత్యాలుచూస్తే జగన్మోహన్ రెడ్డి నిజంగా శాపగ్రస్తు డేమోనన్న అనుమానం కలుగుతోంది. తాను ప్రకటించినట్టు 52,30,939 మంది రైతులకు రూ.7,500ల చొప్పున రూ.3,923.21కోట్లను నిజంగా ముఖ్యమంత్రి రిలీజ్ చేశాడా? ఆయన బటన్ నొక్కినవెంటనే ఆ సొమ్మంతా రైతులఖాతాల్లోకి వెళ్లిపోయిందా? జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కానంటున్న రైతుభరోసా సొమ్ము రూ.7,500ల్లో రూ.2వేలు పీఎం.కిసాన్ పథకం కేంద్రప్రభుత్వసొమ్ము. జగన్ ఇచ్చే పత్రికాప్రకటనల్లోకూడా పీఎం కిసాన్ యోజన అని ఇంగ్లీషులో ఉంటుంది. జగన్ చెప్పినట్టుగా 52లక్షల30వేలమంది రైతులకు పీఎంకిసాన్ సొమ్ము రావడంలేదు.

రాష్ట్రంలో పీఎంకిసాన్ యోజన పథకంకేవలం 36లక్షలమందికే అని కేంద్రప్రభుత్వం ప్రకటించాక, అప్రయోజకుడు, అయోగ్యుడు, దద్దమ్మ ముఖ్యమంత్రికి సిగ్గులేదేమోగానీ, రైతులుమాత్రం సిగ్గుతో చచ్చిపోతున్నారు. జగన్ రైతుభరోసా సొమ్ము ఇస్తున్నాను అంటున్న 52లక్షల30వేలమంది రైతు ల్లో 36లక్షల మందిపోతే, మిగిలిన 16లక్షలపైచిలుకు రైతులు ఎక్కడున్నారు? ఎంతమంది రైతులకు జగన్ అరకొరడబ్బులిస్తూ, సిగ్గులేకుండా 52లక్షలమందికి ఇస్తున్నానని అబద్ధాలుచెబుతున్నాడు. దానికితోడు గతప్రభుత్వాన్ని, చంద్రబా బు గారిని విమర్శించడం. విమర్శచేయడానికి జగన్ కు ఒకపద్ధతి, అర్హత ఉన్నా యా?

రైతుభరోసా కింది నాలుగేళ్లలో ఒక్కోరైతుకి రూ.7,500చొప్పున రూ.30 వేలిచ్చిన జగన్, రూ.61,500లు ఇచ్చేశానని చెప్పడం అబద్ధంకాదా?
రైతుభరోసా కేంద్రాలతో రైతులకు మేలుచేస్తున్నావా? రైతుభరోసా కింద నాలుగేళ్ల లో రూ.50వేలు ఇద్దామనుకుంటే, ఇప్పటికే నువ్వు రూ.54వేలు ఇచ్చేశావా? అంటే 5వసంవత్సరంలో రైతుభరోసాసొమ్ము ఎవరిస్తారు జగన్ రెడ్డి? 4ఏళ్లకు నువ్వు రూ.50వేలు ఇద్దామనుకున్నావుసరే.. దానిలో కేంద్రప్రభుత్వ వాటా ఎం త? కేంద్రప్రభుత్వమిచ్చే రూ.6వేలుపోతే, నువ్వుఇచ్చే రూ.6,500లు చొప్పున నాలుగేళ్లకు రైతులకు ఎంతిచ్చావు? ఒక్కోరైతుకి రూ.30వేలుఇచ్చి, రూ.61, 500 ఇచ్చానని రైతుల్నేమోసగిస్తున్నావా? ఇదా నీ రైతుభరోసా?

సిగ్గుందా జగన్ రెడ్డి..
రైతులసాయంలో కూడా క్విడ్ ప్రోకోలెక్కలు చెప్పడానికి. అన్నదాత సుఖీభవ కింద చంద్రబాబుగారు రాష్ట్రంలోని ప్రతిరైతుకి రూ.15వేలు ఒకేసారి అందించారు. 14లక్షలమంది కౌలురైతులకుకూడా ఆర్థికసాయం అందించారు. నీకులాగా కేంద్రప్రభుత్వసొమ్ముకలిపి ఇవ్వలేదు. రాష్ట్రంలో ఒక్కరైతుకైనా సున్నా వడ్డీరుణం ఇస్తున్నారా జగన్ రెడ్డి. నువ్వు బ్యాంకుకి వెళ్తే నీకు వాస్తవం తెలుస్తుంది.

ధాన్యం కొనుగోళ్లపై జగన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే
సాలీనా రాష్ట్రవ్యాప్తంగా నువ్వూ, నీ ప్రభుత్వం 75లక్షలమెట్రిక్ టన్నులధాన్యం కొనుగోలు చేసిందా? ఎప్పుడు ఎక్కడ కొన్నారు జగన్ రెడ్డి? ఈ సంవత్సరం ఖరీఫ్ లో నీ దిక్కుమాలిన ప్రభుత్వం కొన్నధాన్యం 32లక్షలమెట్రిక్ టన్నులు… రబీలో కొంటానన్నది 13లక్షలమెట్రిక్ టన్నులు. మొత్తం కలిపితే 45లక్షలమెట్రి క్ టన్నులు.. 75లక్షల మెట్రిక్ టన్నులు కొన్నావా?

ప్రజలకు లెక్కలుతెలియవని ఇలా నోటికొచ్చినట్టు లెక్కలుచెబుతావా జగన్ రెడ్డి? ధాన్యంతాలూకా డబ్బు రైతులకుఇస్తే అదినువ్వు సాయంచేసినట్టా? ఎఫ్.సీ.ఐ రైతులకుఇచ్చేడబ్బుని మధ్యలో నీఅవసరాలకు వాడుకునే బ్రోకర్ పాత్రపోషిస్తూ, రైతుల్నిఉద్ధరించినట్టు మాట్లాడతావా? రాష్ట్రంలో ఏరైతుకైనా మద్ధతుధర ఇచ్చావా? నీ ప్రభుత్వంలోని కాకాణిగోవర్థన్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు , కొడాలినానీ నీ రాజప్రాసాదానికి కట్టినకప్పం ఎంత?

రైతులకు ఇచ్చిందిఎంత? సాక్షాత్తూ నీ పార్టీఎంపీ పిల్లిసుభాష్ చంద్రబోసే ధాన్యంకొనుగోళ్లలో నీ ప్రభుత్వం చేస్తున్నదోపిడీ గురించిచెప్పారు. క్వింటాధాన్యం కొనుగోలులో రూ.200ల మోసం జరుగుతోందన్నారు. వాస్తవంగా క్వింటాధాన్యం కొనుగోలులోకాదు.. 75కిలోల బస్తా కొనుగోలులోనే రూ.200దోపిడీ జరిగింది. మీ లెక్కప్రకారం క్వింటాకు రూ.200 చొప్పున, ధాన్యంకొనుగోళ్లకు సంబంధించి నువ్వురైతులకు ఇచ్చానం టున్న రూ.60వేలకోట్లలో రూ.6వేలకోట్లు కాజేశారు. మేంచెప్పే లెక్కప్రకారం ధాన్యంకొనుగోళ్లలో రూ.6వేలకోట్లుకాదు…రూ.12వేలకోట్లదోపిడీ జరిగిందని నేను నిరూపిస్తాను.

రైతులముందుకు వచ్చి మాట్లాడేధైర్యం నీకు, నీ మంత్రులకు ఉం దా? మీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని ధాన్యంకొనుగోళ్లపై ఒకరైతు ప్రశ్నిస్తే, అతన్ని వెర్రిపప్పా అన్నాడు. అదీ నీప్రభుత్వ పనితనం. జగన్ రెడ్డి రైతుల్ని ఎర్రిపప్పలన్న నీమంత్రి, నువ్వు రైతులపక్షమా? నీప్రభుత్వం రైతు ప్రభుత్వ మా? అలాంటిమంత్రుల్ని పక్కనపెట్టుకున్న జగన్ రెడ్డికి రైతులగురించి మాట్లాడేఅర్హతలేదు. ప్రకృతి విపత్తుల్నికూడా సవాల్ చేసేలా రైతులకుఅండగా నిలబడి పంటనష్టపోయిన రైతులకు కేవలం 48గంటల్లో చంద్రబాబుగారు ఇన్ పుట్ సబ్సిడీ అందించారు.

టీడీపీప్రభుత్వం 4ఏళ్లలో రూ.4వేలకోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చింది. మరి నీసంగతేంటి జగన్ రెడ్డి.. 4ఏళ్లలో నువ్వు రైతులకు ఇచ్చిన ఇన్ పుట్ సబ్సిడీ కేవలంరూ.1900కోట్లు. రైతులతరుపున పంటల బీమా సొమ్మే సకాలంలో కట్టనినువ్వు ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తావా? చంద్రబాబు  నేలపైకూర్చొని ధర్నాలుచేస్తే అర్థరాత్రి జీవోలు ఇచ్చేనువ్వుకూడా మాట్లా డితే ఎలా జగన్ రెడ్డి?

టీడీపీ కట్టించిన, పనులు ప్రారంభించిన ప్రాజెక్టులు తప్ప, 4ఏళ్లలో రాయలసీమలో ఒక్కప్రాజెక్ట్ అయినా పూర్తిచేశావా జగన్ రెడ్డి… ఒక్క ఎకరాకు అయినా నీళ్లిచ్చావా?
రాయలసీమలో టీడీపీ ప్రభుత్వం కట్టించిన, పనులుప్రారంభించిన ప్రాజెక్టులుతప్ప నాలుగేళ్లలో ఒక్కటైనా కట్టావా జగన్ రెడ్డి? ఒక్కఎకరాకైనా కొత్తగా నీరిచ్చావా? తుంగభద్రహైలెవల్ కెనాల్.. లోలెవల్ కెనాల్.. హంద్రీనీవాపనుల గురించి చెప్ప కుండా వెన్నుపోట్లు, ప్రజాపోట్లు అని చెబుతావేం జగన్ రెడ్డి? ఎన్టీఆర్ ని చంద్ర బాబుగారు వెన్నుపోటు పొడిచాడా? మరి రాజశేఖర్ రెడ్డిని నువ్వేపోటు పొడిచా వు.. శవాన్నిపక్కనపెట్టుకొని ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించుకొని పెన్నుపో టు పొడిచావా? ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డిల ఫొటోలు పక్కపక్కన పెట్టుకొని నువ్వు చూస్తే ఎవరికి ప్రజలు ఎంతస్థానమిచ్చారో నీకుతెలుస్తుంది?

28సంవత్సరాల క్రితం మరణించిన ఎన్టీఆర్ ను ప్రజలహృదయాల్లో నిలిపిన ఆయన రాజకీయవా రసుడు చంద్రబాబుగారు. రాజశేఖర్ రెడ్డిని ఏపార్టీ అయితే ఆదరించి, అభిమానించి ఆయనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిందో, ఆపార్టీని, ఆవ్యక్తి పేరుప్రఖ్యాతు ల్ని బురదలోతొక్కిన చరిత్ర నీది జగన్. ఒకమాట అనేముందు దానిపర్యవసానా లు ఎలాఉంటాయో ఆలోచించు జగన్ రెడ్డి. పేటీఎమ్ బ్యాచ్ రాసిచ్చింది చదివితే ప్రజలు ఛీ కొడతారు. ప్రభుత్వసలహాదారుగా ఉన్న సజ్జల వివేకాహత్యలో రాజకీ యకోణం లేదని చెప్పడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఏప్రమేయం ఉందో.. ఎవరిపాత్ర ఉందో అన్నీతెలిసిన సజ్జలే సీబీఐకి వాస్తవాలు చెప్పొచ్చుగా.

బిందెడు నీళ్లకే జగన్ రెడ్డి బెంబేలెత్తితే బావి నీళ్లకు ఏమైపోతాడో? టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో కేవలం ట్రయల్ మాత్రమే. అసలు సినిమా ముందుంది
టీడీపీ విడుదలచేసిన మేనిఫెస్టో మొదటిప్రణాళికే జగన్ రెడ్డి. బిందెడు నీళ్లకే నువు ఇలా అయిపోతే బావినీళ్లుబయటకు వస్తే ఏమవుతావు? 4ఏళ్ల నీపాలన రాష్ట్రానికి 13లక్షలకోట్ల అప్పులు మిగిల్చింది. ఇంకా సంవత్సరంలో ఇంకెంత అప్పుపడుతుందో తెలియదు. జగన్ నువ్వు పేదలకు రూపాయి ఇవ్వాలంటే అప్పులుతేవాలి.. కానీ చంద్రబాబు సంపదసృష్టించి దాన్నిపేదలకు పంచుతారు.

వ్యవసాయాన్ని పండుగలాగా చేసిన వ్యక్తి చంద్రబాబు. రైతునిరాజుగా చూసేలా వారికోసం ప్రత్యేకపథకాలు అమలుచేశారు. గతప్రభుత్వంలో ఏమైనా చేశారా.. రాజకీయంచేస్తున్నారు.. మేనిఫెస్టోల కిచిడీచేస్తున్నారు అని జగన్ మాట్లాడాడు . మేనిఫెస్టోపై కొత్తకొత్తమాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డికి, తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏంచెప్పాడో, ముఖ్యమంత్రి అయ్యాక ఏంచేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం.

వారంలో రద్దుచేస్తానన్న సీపీఎస్.. మద్యపాననిషేధం.. 2.30లక్షల ప్రభుత్వఉద్యోగాలభర్తీ.. ప్రత్యేకహోదా… ఏటా జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయి జగన్ రెడ్డి?
వారంలో సీపీఎస్ రద్దుచేస్తానని ఉద్యోగులకుచెప్పావు కదా జగన్ రెడ్డి… ఇంకా వారంకాలేదా? మాయదారిమద్యం వల్ల మా అక్కచెల్లెళ్ల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.. నేను ముఖ్యమంత్రి అయినవెంటనే 5స్టార్ హోటళ్లలో తప్ప, ఎక్కడా మద్యంలేకుండా చేస్తానన్నావుకదా? నీహామీ ఏమైంది జగన్ రెడ్డి? నువ్వే మద్యంవ్యాపారంచేస్తూ, వేలకోట్లుకొట్టేస్తూ ప్రజలప్రాణాలతో ఆడుకుంటు న్న నువ్వు టీడీపీమేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నావు.

సిగ్గులేకుండా నీ చీప్ లిక్కర్, నీసారాయి అమ్ముకోవడానికి అప్పులకోసం రాష్ట్రాన్నే తాకట్టుపెట్టావు. పాదయాత్రచేస్తూ యువతనెత్తిన చేతులుపెట్టి, కాలేజీల్లో నువ్వుచెప్పిన మాటలు గుర్తులేవా జగన్ రెడ్డి? పొన్నూరువస్తాదులాగా కేంద్రంమెడలు వంచి ప్రత్యేకహో దాతెచ్చి, ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి, 2.30లక్షల ప్రభుత్వఉద్యోగాలు భర్తీ చేసి యువతను ఉద్ధరిస్తానన్నావు కదా జగన్ రెడ్డి? ఏమైంది నీ ఉద్ధరణ? ఎక్క డుంది ప్రత్యేకహోదా? నీవా మేనిఫెస్టో అమలుగురించి మాట్లాడేది?

చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడా.. మరి నీ గొడ్డలిపోటు.. కోడికత్తి పోట్ల గురించి ప్రజలకు చెప్పవా జగన్ రెడ్డి
చంద్రబాబు ప్రజల్ని వెన్నుపోటుపొడుస్తాడా? నారాసురరక్తచరిత్ర పేరుతో నువ్వు, నీ నీలిమీడియా అల్లిన దిక్కుమాలిన కట్టుకథలు మర్చిపోయావా జగన్ రెడ్డి? చంద్రబాబే వివేకానందరెడ్డిని చంపాడు.. కోడికత్తితో పొడిపించుకున్నాడు…. నా తండ్రి చావుకి కారణమైన రిలయన్స్ సంస్థ చెప్పినవారికే రాజ్యసభసీటు ఇచ్చా డు.. అని నువ్వుచెప్పి ఉంటే జనాలకు గొడ్డలిపోట్లు గుర్తొచ్చేవి జగన్ రెడ్డి.

మీబిడ్డా… మీబిడ్డా అని మైకుల్లో చెప్పడంకాదు జగన్ రెడ్డి. తల్లిని చెల్లిని ఎక్కడికి పంపావు. తనభర్తను చంపారని కన్నీళ్లుపెట్టుకున్న నీ పినతల్లికి ఏంన్యాయం చేశావు? 4ఏళ్లలో బటన్ నొక్కుడుపేరుతో నువ్వు రైతులఖాతాల్లో వేసిందెంత? రైతులకుచేరింది ఎంత? ఈ మొత్తంవ్యవహారంలో నీప్రభుత్వం రూ. 15వేలకోట్లదోపిడీ చేసింది. ఆలెక్కలన్నీతేల్చి త్వరలోనే నిన్ను, నీ ప్రభుత్వాని ప్రజలముందు నిలబెడతాం.

నీబిడ్డా.. మీ బిడ్డా అని పదేపదే పలికావు.. నీ తల్లిని ఏంచేశావో.. తండ్రిని ఎక్కడ దాచేశావో వాళ్లబిడ్డవైన నీకైనా తెలుసా జగన్ రెడ్డి? నువ్వు మీబిడ్డను అంటుంటే తనభర్తను చంపారని గుడ్లలో నీళ్లుకక్కుతూ, నోట్లోకొంగు కుక్కుకొని విలపించిన మీపిన్నమ్మ గుర్తుకొస్తుంది జగన్ రెడ్డి. రాష్ట్రం నుంచి పారిపోయిన విజయమ్మ.. జగనన్నవదలినబాణం ఏమైయ్యాయో చెప్పు జగన్ రెడ్డి? గాజుగదిలో నువ్వుం డి, రాళ్లు జనంపైవేస్తూ, నీగుట్టు నువ్వేబయటపెట్టుకుంటే ఎలా జగన్ రెడ్డి?

నీ రూపం గురించి నువ్వే ప్రజలకుచెబుతూ, చంద్రబాబుని అంటే ఎలా జగన్? విధ వను దీవించమంటే నాలాగే వర్థిల్లమని ఆశీర్వదించినట్టు జగన్ మైకు పట్టుకొని తనగురించి తాను చెప్పుకుంటూ, అవన్నీ ఎదుటివారికి ఆపాదిస్తున్నాడు. ప్రభు త్వసొమ్ముతో జనాల్ని బలవంతంగా నీసభలకు తరలించి, నువ్వు చంద్రబాబుపై నిందలేసి, పిచ్చికూతలుకూసినంతమాత్రాన ఆయన్నేమీ చేయలేవు. వివేకా హత్యకేసులో బెయిల్ వచ్చినంతమాత్రాన సంపరపడిపోకు జగన్ రెడ్డి. ఇంకా చాలా ఉంది.. కథముగిసిపోలేదు.

జగన్ మీటనొక్కిన ప్రతిసారి రైతులకు డబ్బు లు వచ్చాయా? ఆయన చెప్పిన 52లక్షల30వేలమందికి డబ్బులు వెళ్లాయా.. ప్రభుత్వఖజానాలోని సొమ్ము రైతులకు అందకుండా ఎక్కడికిపోతోంది? ఎవరు తింటున్నారు. ఈ దోపిడీలో ఎవరిపాత్ర ఉంది.. ఈ రోజు జగన్ బటన్ నొక్కాను అంటున్న రూ.3923కోట్లు రైతులకు చేరలేదు. గతంలోనూ ఇలానే జరిగింది.

రైతుభరోసాపేరుతో జగన్ అతనిప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చానంటున్న రూ.30 వేలకోట్లసొమ్ములో, రూ.15వేలకోట్లదోపిడీ జరిగింది. అదిఎక్కడ జరిగింది … దానివెనక ఎవరున్నారనే దొంగలెక్కలన్నీ తేలుస్తాం.” అని మర్రెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE