– తల్లుల పెంపకం వల్లే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయటం సిగ్గుచేటు
– జగన్ రెడ్డి అసమర్ధ, చేతకాని పాలనను కప్పిపుచ్చుకునేందుకు తల్లుల్ని కించపర్చుతారా?
– తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
అసమర్ధ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేతకాని పాలన వల్లే రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, కానీ దాన్ని కప్పి పుచ్చుకునేందుకు తల్లుల్ని అవమానించేలా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడటం సిగ్గుచేటని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు.
వైసీపీ మూడేళ్ల పాలనలో 800 మందికిపైగా మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, దాడులు జరిగాయి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసమర్ధ, చేతాకాని పాలన వల్లే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళకు రక్షణ కల్పించటం చేతకాని హోంమంత్రి తల్లుల పెంపకం వల్లే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ మాట్లాడటం బాధాకరం. తల్లుల్ని కించపరిచేలా మాట్లాడిన హోంమంత్రి తాను ఓ తల్లి కడుపున పుట్టిన విషయం మర్చిపోయారా?
విజయవాడ నడిబొడ్డున ఆస్పత్రిలో 36 గంటల పాటు బాలికపై అత్యాచారం జరిగింది. దీనిలో హోంమంత్రికి ఆ బాలిక తల్లి పెంపకంలో తప్పు కనిపించిందా? గుంటూరు జిల్లా తుమ్మపూడిలో ముగ్గురు బిడ్డల తల్లిపై అఘాయిత్యం జరిగింది ? దానికి ఆమె తల్లి పెంపకమే కారణమా? రేపల్లెలో భర్త ముందే రైల్వే స్టేషన్ లో రేప్ చేశారు. అది ఏ తల్లి పెంపకం తప్పో హోంమంత్రి చెప్పాలి ?
విజయనగరం జిల్లాలో అమ్మాయి కాల్చి చంపారు అది ఏ తల్లి తప్పు? పులివెందులో నాగమ్మను హత్య చేశారు, మరో చోట వరలక్ష్మి గొంతు కోశారు, వీటికి ఏ తల్లి పెంపకం తప్పో హోంమంత్రి సమాధానం చెప్పాలి? విశాఖలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో ఓ బాలిక గర్బవతి అయింది? ఇవన్నీ జగన్ రెడ్డి చేతకాని పాలనకు అద్దం పడుతున్నాయి.
కానీ వైసీపీ మంత్రులు మాత్రం తమ చేతాకాని అసమర్ద పాలనను కప్పి పుచ్చుకునేందుకు తల్లుల పెంపకాన్ని ప్రశ్నించటం సిగ్గుచేటు. అలా అంటే జగన్ రెడ్డి 11 కేసులతో 16 నెలలు జైల్లో ఉండటానికి ఆమె తల్లి విజయమ్మ పెంపకమే కారణమా ? అని మేం ప్రశ్నిస్తే ఊరుకుంటారా? చివరకు ఏడాది పసిపిల్లలపై రేప్ లు జరుగుతున్నాయి, దానికి కూడా తల్లులు పెంపకం తప్పేనా?
ప్రభుత్వం, పోలీసులు తప్పేమీ లేదా? పోలీసులు ఉంది ముఖ్యమంత్రి, మంత్రులకు పహారా కాయడానికా లేక, ప్రతిపక్ష నేతల ధర్నాలు, ర్యాలీలు అడ్డుకోవడానికేనా? ఆడబిడ్డకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం, పోలీసు వ్యవస్ధ ఎందుకు ? ఆడపిల్లకు అన్యాయం జరిగితే గన్ గన్నా జగన్ ముందు వస్తాడన్నారు. ఇప్పుడు గన్ లేదు, జగన్ రావటం లేదు.
పైగా మీ చేతకాని తనాన్ని బాధితులపైకి, మహిళపై నెడుతున్నారు. తిరుపతమ్మ హత్య కేసులో.. అక్రమ సంబందం కారణంనే హత్య జరిగిందని పోలీసులు చెప్పటం దుర్మార్గం. మీ చేతకాని తనాన్ని ఎదుటివారిపైకి, బాధితులపైకి నెట్టం, పరామర్శకు వచ్చిన వారిపై రాళ్ల దాడి చేయటం సిగ్గుచేటు. 3 ఏళ్లలో 800 మందికిపైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి, ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో మహిళలపై రేప్ జరిగినా ముఖ్యమంత్రి కనీసం స్పందించపోవటం సిగ్గుచేటు.
ఆడ పిల్లకు అన్యాయం జరిగినా నోరు తెరవలేని మూగ వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండటం దౌర్బాగ్యం. వైసీపీ పాలనలో ఊరికో ఉన్మాది, కాలకేయుడు తయారయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏం జరిగినా చంద్రబాబు, లోకేశ్ లే కారణం అంటూ..ప్రచారం చేసిన వైసీపీ నేతలు ఇప్పడు ఇంకా దిగజారి తల్లుల్ని తప్పు పడుతున్నారు.
మాతృదేవోభవ అని దేవుని కంటే ముందు తల్లిని కీర్తించే సమాజంలో ఉండి తల్లులి పెంపకాన్ని తప్పు పట్టేలా మాట్లాడిన వ్యక్తి హోంమంత్రిగా కాదు, కనీసం ప్రజా ప్రతినిధిగా కూడా పనికిరాదు. వెంటనే హోంమంత్రి రాజీనామా చేయాలి. మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాన్ని ఇంకెన్నాళ్లు భరించాలి. మహిళంతా ఏకమై ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ముందుకు రావాలని వంగలపూడి అనిత పిలుపినిచ్చారు.