టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ట్వీట్
ఈ సంవత్సరం ఏప్రిల్ 6 వ తేదీన సాక్షి టీవీలో ప్రముఖ ఆర్దిక విశ్లేషకునిగా ఇంటర్యూ చేయబడిన శ్రీ జీవీ రావు నేడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేసరికి ఆయన్ని దానయ్య అంటూ, జోకర్ అంటూ ముఖ్యమంత్రి మాట్లాడటం సిగ్గుచేటు. అంటే మీ సాక్షిలో స్టాక్ మార్కెట్ విశ్లేషణలాంటి ముఖ్యమైన ఇంటర్యూలు కూడా దారినపోయే దానయ్యలతో, జోకర్లతో చేస్తారని ప్రజలు అర్దం చేసుకోవచ్చా జగన్ రెడ్డి?
చీ..చీ.. ఇంత దిగజారుడు తనం ఎప్పుడూ చూడలేదు.. ఇంత చీప్ పార్టీనా వైసీపీ.. చీ..చీ..పోయే కాలం వస్తె ఇలానే చేస్తారు. జగన్ సర్కార్ ఏం చేసినా …తలకిందులుగా చూడాలని ఓ నిర్ణయం తీసుకున్నట్టుంది,తాము చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే ‘వ్యభిచారం’ అన్నట్టుగా ఉంది సాక్షి రాతల పరిస్థితి. వీటిని రాతలు అనే బదులు.. రోతలు అంటే నయం ఏమో.. మైండ్ నిండా వైసీపీ భజనను నింపుకొని.. ప్రతిపక్షాలను హీనులుగా అభివర్ణిస్తూ… జగన్ ను దైవాంశ సంభూతుడిగా కీర్తిస్తున్నారు.