– గత ప్రభుత్వంలో 1800 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయిలు
– పిపిపి మోడల్ పై శాసన మండలిలో చర్చిద్దామన్న వైసిపి పారిపోయింది
– బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ
గుంటూరు: భారత్ స్వయం సమృద్ధిని సాధిస్తున్న తరుణంలో మన దేశంపై ఆంక్షలు విధిస్తున్నాయి. తొంభై రోజుల పాటు ఆత్మ నిర్భర భారత్ కార్యక్రమం నిర్వహిస్తాం. ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారని షర్మిలా అంటున్నారు. ప్రజలు చెల్లించే పన్నులు ద్వారానే ఆరోగ్య శ్రీ అప్పుడు ఇప్పుడు అమలు చేస్తున్నారు. నిర్వీర్యం చేసినట్లు చెప్పడం సత్యదూరం అని బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు.
కోటి అరవై మూడు లక్షల మందికి ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఆరోగ్య శ్రీ అందిస్తున్నాం. గత ప్రభుత్వం 1800 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయిలు పెట్టింది. మెడికల్ కాలేజ్ ల పిపిపి మోడల్ పై శాసన మండలిలో చర్చిద్దామన్న వైసిపి పారిపోయింది. దమ్ము ధైర్యం లేని వ్యక్తులు ప్రజలు రెచ్చగొడుతున్నారు. శాసన సభ ,మండలిలో చర్చించేందుకు వైసీపీ అలీబాబా నలభై దొంగల బృందం సిద్దమా? అని ప్రశ్నించారు.
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ రాజ్ మాట్లాడుతూ, స్వాతంత్య్ర కాలం నాటి నుండే స్వదేశీ ఉద్యమం ఉంది. గత పాలకులు అవినీతికి పాల్పడటం, అధికారం కోసం పని చేయడం, నేర మయ రాజకీయాలు చేస్తూ వచ్చారు. “ఆత్మనిర్భర్ భారత్” – మన దేశాన్ని స్వయం సమృద్ధిగా, స్వయం ఆధారితంగా మార్చే ఉద్యమం. ప్రతి గ్రామం, ప్రతి రైతు, ప్రతి యువకుడు స్వయం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి.
దేశం అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది. మనం ఆత్మనిర్భర్ అయితేనే భారత్ ఆత్మనిర్భర్ అవుతుంది. స్వయం సమృద్ధిని సాధించడానికే ఆత్మ నిర్భర భారత్ కార్యక్రమం చేపట్టాం. స్వదేశీ వస్తువులను వినియోగిస్తే వికసిత భారత్ 2040 నాటికే సాధ్యమవుతుంది అని అభిప్రాయపడ్డారు.
జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన విలేఖరుల సమావేశంలో సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ర శివన్నారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, జిల్లా కార్యదర్శి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు