– అమరావతి ముంపు ప్రాంతం కాకపోతే.. ఎందుకు లిఫ్ట్‌లు, రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నారు?
– మొదటి దఫా రైతుల సంగతి తేల్చకుండా రెండో పూలింగ్ రైతులకు భ్రమల్లో పెట్టే హామీలు
– చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో పెట్టింది కేవలం రూ.5వేల కోట్లే
– మొదటి దఫా డెవలప్ చేయాలంటే రూ.లక్ష కోట్లు అవుతుంది
– 50 లక్షల చదరపు అడుగుల సచివాలయం అవసరమా?
– తెలంగాణలో సుమారు 10 లక్షల చదరపు అడుగుల్లో కొత్త సచివాలయం వచ్చింది?
– అమరావతిలో పనులన్నీ మూడు నాలుగు కంపెనీలకే
– రాజధాని అంశంపై వైయస్సార్సీపీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
విజయవాడ: మీడియాపై అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అమరావతిపై జగన్ మాట్లాడారు: ఆయన మాట్లాడిన అంశాలపై సమాధానం చెప్పలేకపోతున్నారు. తొలి దశలో తీసుకున్న 50వేల ఎకరాలు తీసుకున్నారు. ఆ రైతులకు ఏమీ చేయలేదని జగన్ అడిగారు. రోడ్లు లేవు, కనెక్టివిటీలేదు, ప్లాట్ల డెవలప్ మెంట్లేదు.
ఇది చేయకుండానే రెండోదశకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. అమరావతిలో చంద్రబాబు సృష్టించిన సమస్యలు రైతుల ప్రాణాలు తీస్తున్నాయి. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు చెరువుల్లో ఇచ్చారు. ఇవి తప్పులు కావా? వాస్తవాలు కావా? అని జగన్ ప్రశ్నించారు.
చంద్రబాబు తన ఇంటికి సుమారు రూ.7500కు గజం కొన్నారు. మరి ఈ రేటుకు భూములు అమ్మితే ఆ డబ్బు అమరావతికి సరిపోతుందా? ఈ రేటు అబద్ధమైతే వాస్తవ ధరకు ఎంతకు కొన్నారు? ప్రజలను దృష్టిలో పెట్టుకుని అడిగే ప్రశ్నలను నానా రకాలుగా డైవర్ట్ చేస్తున్నారు.
రైతులకిచ్చిన ప్లాట్లు ఇతరులు కొనేరకంగా ఉన్నాయా? అని అడిగారు. ప్లాట్లు డెవలప్ చేయకపోతే ఎవరు కొంటారు? అమరావతి రైతుల గోడుని జగన్ ప్రశ్నించారు. మొదటి దఫా రైతుల సంగతి తేల్చకుండా రెండో పూలింగ్ రైతులకు భ్రమల్లో పెట్టే హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో పెట్టింది కేవలం రూ.5వేల కోట్లే. మొదటి దఫా డెవలప్ చేయాలంటే రూ.లక్ష కోట్లు అవుతుంది. ఈ పేస్‌లో పోతే.. ప్రాజెక్టు ఎప్పటికి అయ్యేది అనే ప్రశ్న జగన్ లేవనెత్తారు.
దీంతోపాటు అమరావతి చుట్టూ పూర్తి స్కాంలు ఉన్నాయి. ఇప్పటికే చంద్రబాబు అమరావతి పేరుమీద దాదాపు 40వేల కోట్లకు పైబడి అప్పులు తెస్తున్నారు. తెచ్చిన అప్పులు కూడా ప్రయార్టీ పనులపై ఖర్చు పెట్టడంలేదు. రైతుల సమస్యలు తీర్చకుండా నానా రకాలుగా ఖర్చు పెడుతున్నారు. 50 లక్షల చదరపు అడుగుల సచివాలయం అవసరమా?
తెలంగాణలో సుమారు 10 లక్షల చదరపు అడుగుల్లో కొత్త సచివాలయం వచ్చింది?
అమరావతిలో చదరపు అడుగుకు రూ.10వేలకు పైబడి ఖర్చు చేస్తున్నారు. రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్నారు. కొత్త పార్లమెంటు భవనం సుమారు 7 లక్షల చదరపు అడుగుల్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ 11 లక్షల చదరపు అడుగుల్లో కడతామంటున్నారు. మొబలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చి.. కమీషన్లు నొక్కేస్తున్నారు.
అమరావతి ముంపునకు గురికాకుండా లిఫ్ట్‌లు కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. చివరకు అమరావతి పేరుమీద చేస్తున్న ఖర్చు ఎక్కడకు పోతుందో అర్థం కావడంలేదు: ప్రధాన భాగస్వాములైన రైతుల సమస్యలే ఇప్పటికీ తీరలేదు.
అమరావతిలో రైతులు టాప్ ప్రయార్టీ. ఈ ప్రశ్నలను జగన్ లేవనెత్తితే కుక్కల మాదిరిగా అరిచి జగన్ మీద విరుచుకుపడబ్డారు. రాయల సీమ లిఫ్ట్ అంశాన్ని పక్కకు నెట్టివేసేందుకు నానా వక్రీకరణలకు పాల్పడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రకటన మీద చంద్రబాబు ఇప్పటివరకూ సూటిగా సమాధానం చెప్పలేదు. ఇది వదిలేసి… జగన్ మీద బూతులతో అసభ్యంగా రెచ్చిపోయారు.
అమరావతిని మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్‌గా చంద్రబాబు మార్చారు. అమరావతి ప్రాంతానికి జగన్ వ్యతిరేకం కాదు. అమరావతిలో కూడా అభివృద్ధి జరగాలని కోరుకున్నారు.2019 ఎన్నికలకు ముందే జగన్ ఈ ప్రాంతంలో ఇల్లు, పార్టీ కార్యాలయాలను కట్టారు.
అమరావతిని రాజధాని అన్న తర్వాత ఆయన ఇక్కడే నివాసం ఉన్నారు. ఇప్పటివరకూ చంద్రబాబు ఇక్కడ ఇల్లే కట్టుకోలేదు. చంద్రబాబు అక్రమ నివాసంలో ఉన్నారు. అది కూడా ఒక స్కామే. ఇద్దరు నాయకుల్లో ఎవరు నిజాయితీగా ఉన్నారో ప్రజలు ఇట్టే కనిపిస్తుంది. అభివృద్ధి వికేంద్ర కరణ అంశం వచ్చినప్పుడు కూడా అమరావతిని జగన్ తక్కువ చేసి చూడలేదు.
కాని అమరావతి ప్రాంతానికి జగన్‌గారు వ్యతిరేకి అని ముద్ర వేయడానికి చంద్రబాబు:
ప్రతిపక్ష నేతగా అ ప్రశ్నలను అడిగితే కుక్కల మాదిరిగా జగన్‌పై విరుచుకుపడుతున్నారు. కానీ, అమరావతి విషయంలో ఎదురవుతున్న ప్రశ్నలనుంచి చంద్రబాబు తప్పించుకోలేడు
తెచ్చిన అప్పులన్నీ ఎక్కడకు పోతున్నాయో తెలియడంలేదు. అమరావతిలో మూడు నాలుగు కంపెనీలకే పనులన్నీ వెళ్తున్నాయి. గతంలో నమోదైన ఐటీ కేసును ఎదుర్కొంటున్న చంద్రబాబు.. ఇప్పుడు అదే కంపెనీలకు పనులు కట్టబెడుతున్నాడు: అన్నీ పనులూ 4 శాతం ఎక్సెస్‌కు ఇస్తున్నాడు. రైతులకు రిటర్న్‌బుల్ ప్లాట్లు చెరువుల్లో ఇచ్చారన్నది వాస్తవం కాదా?
మొన్న గుండెపోటుతో కుప్పకూలిన రైతల ప్రశ్నలకు చంద్రబాబు నుంచి సమాధానం లేదు: మరి ఈస్కాంలను ప్రశ్నించరా?: అదే పని జగన్ చేశారు.
రాజధాని ఎంపిక సమయంలోనే ప్రభుత్వ భూమి ఉన్నచోటో, రాష్ట్రానికి ఆర్థికంగా భారం కాని విధంగా జగన్ చెప్పారు: పదేళ్లు హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉన్నా.. ఎందుకు వదలిపెట్టి పారిపోయి వచ్చారు? ఆ సమయాన్ని వాడుకుని రాజధానిని కంప్లీట్ చేసుకోవచ్చు కదా? మరి అప్పుడు ఎందుకు అలా అప్పుడు చేయలేదు? అమరావతి ముంపు ప్రాంతం కాకపోతే.. ఎందుకు లిఫ్ట్‌లు, రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నారన్న ప్రశ్నలు కూడా వస్తాయి.
ఈ నేపథ్యంలో విజయవాడ- గుంటూరు మధ్య పెడితే… మొత్తం ఏరియా డెవలప్ అవుతుందని జగన్ సూచించారు: రాష్ట్రానికి పెద్ద భారం ఉండదని సూచించారు. అమరావతి సహజంగా ఎదుగుతుందని చెప్పారు.
ఎక్కడ పరిపాలనా కేంద్రం ఉండాలన్నది రాష్ట్రం ఇష్టం. వాస్తవిక దృక్పథంతో చూస్తూ.. వచ్చే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనేది జగన్ అన్నమాట.