Suryaa.co.in

Andhra Pradesh

‘సిద్దం’ అంటే రౌడీ భాష కాదా?

– సిద్ధం అంటే ఎవరిపై? ప్రజల పైనా? ప్రతిపక్ష పార్టీల పైనా?
– సీఎంకు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య హితవు

ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సిద్ధం పేరిట సభలు పెడుతున్నారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి రెచ్చగొట్టే రౌడీ పదాలు ఆక్షేపనీయమని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు.బుధవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు.*సిద్ధం అంటే దేనికి? కొట్టుకోవటానికా?, కోసుకోవటానికా?, నరుక్కోవటానికా?. మరో గొడ్డలి వేటు కోసమా? మరో కోడి కత్తి కోసమా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సిద్ధం అంటే ఎవరిపై? ప్రజల పైనా?*ప్రతిపక్ష పార్టీల పైనా? అని ప్రశ్నించారు. తెలుగు భాషకు గోరికడితే, తెలుగు పదాలకు అర్థం ఎలా తెలుస్తుందన్నారు.‌ 40 మంది సలహాదారులు ఉండి సుఖం లేకుండా పోయిందని, పైగా అందరూ సాక్షి రాతగాళ్ళే అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాకముందు, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో, షర్మిలమ్మ మరో ప్రజాప్రస్థానం పేరుతో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో, ప్రజా ఓదార్పు వంటి పదాలను ప్రజల ముందుకు తీసుకెళ్ళిన విషయాన్ని గుర్తు చేశారు.

ఐదేళ్లపాటు అధికారాన్ని అనుభవించిన, తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు సిద్ధం అంటూ రౌడీ భాషను వాడుతున్నారన్నారు. బిపీ ఉన్న వైసీపీ కార్యకర్తలను, గంజాయి దాగించినట్లు, కొకైన్ వంటి డ్రగ్స్ ను అలవాటు చేసి,
ఉద్రేకానికి గురి చేసే విధంగా ఇలాంటి పదాలు వాడుతున్నారన్నారు
‌బంగారు గనుల కోసం కేజిఎఫ్ లాంటి సినిమాల్లో గ్యాంగ్ లీడర్లు, ప్యాక్షనిస్టులు పలికే పెదాలు ఇవే అన్నారు.

దీనికి ప్రతిగా కొన్ని పార్టీలు మేమూ సిద్దం అంటూ ప్లెక్సీలు కడుతున్నారన్నారు. రాబోవు ఎన్నికలకు ఇలాంటి సవాళ్ళు ప్రమాదకరమని, శాంతి భద్రతలకు విఘాతం అని అభిప్రాయపడ్డారు. వెంటనే దీనిని మార్చుకోవాలని బాలకోటయ్య సూచించారు.

LEAVE A RESPONSE