– ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం
– తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత
అంగన్వాడీ కార్యకర్తలకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి నియంతృత్వానికి పరాకాష్ట. చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ కుప్పంలో ఏర్పాటు చేసిన టీడీపీ దీక్షా శిబిరంలో అంగన్వాడీలు పాల్గొనడం తప్పా? చంద్రబాబు గారు ప్రజా నాయకుడు. ఆయన జీవితమంతా ప్రజల కోసమే పనిచేశారు. అలాంటి వ్యక్తిపై అక్రమ కేసులు బనాయించి జైలు పాల్జేస్తే చూస్తూ ఊరుకోవాలా?
నిరసన తెలిపే హక్కు లేదా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? 70 మంది అంగన్వాడీలు, సహాయకులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అంగన్వాడీలపై సీఎం జగన్ రెడ్డి కక్ష కట్టారు. నాలుగేళ్లుగా వారి సమస్యలు పరిష్కరించకుండా ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అణిచివేత ధోరణి విడనాడాలి. తక్షణమే అంగన్వాడీలకు ఇచ్చిన షోకాజ్ నోటీసు ఉపసంహరించుకోవాలి.