– వివేకాహత్యకేసులో అవినాశ్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు లభించింది తాత్కాలిక ఉపశమనమే
• జగన్మోహన్ రెడ్డి పలుకుబడి, ప్రభావం, అధికారంముందు సీబీఐ చేసిందంతా తుడిచిపెట్టు కు పోయిందా అన్న అనుమానం ప్రజలకు కలుగుతోంది
• అవినాశ్ రెడ్డిని కాపాడేందుకు ముఖ్యమంత్రి చేసిన ఢిల్లీపర్యటనలు విజయవంతమయ్యాయనే చెప్పాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రిని నిజంగానే అభినందిస్తున్నాం
• వైసీపీకి వ్యవస్థల్ని మేనేజ్ చేయడం కొత్తకాదు. గతంలో గాలిజనార్థన్ రెడ్డి కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి పట్టాభిరామారావుని ఏంచేశారో అందరికీ తెలుసు
• అవినాశ్ రెడ్డి అమాయకుడని సర్టిఫికెట్ ఇచ్చిన సజ్జల, రాష్ట్రంలోని చిన్నపిల్లల్ని కాకుండా, వివేకాను ఎవరుచంపారని తనమనవళ్లను అడిగితే అవినాశ్ రెడ్డేనని చెబుతారు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
“ దేశవ్యాప్తంగా వివేకానందరెడ్డి హత్యకేసు సంచలనకేసుగా పేరుపొందిందని, కేసుని దర్యాప్తుచేస్తున్నతీరు, సేకరించినసాక్ష్యాలుసహా, ప్రతిఅంశాన్నిలోతుగా విశ్లేషించి, అధునా తన సాంకేతికపరిజ్ఞానంతో కనిపెట్టామని సీబీఐ చెప్పినప్పుడు వాస్తవాలు బయటకువస్తు న్నాయి..దోషులకుశిక్షపడుతుందని దేశమంతా భావించిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యు లు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“ జగన్మోహన్ రెడ్డి పలుకుబడి, ప్రభావం, అధికారంముందు సీబీఐ చేసిందంతా తుడిచిపెట్టు కు పోయిందా అన్న అనుమానం ప్రజలకుకలుగుతోంది. తననితాను కాపాడుకోవడానికే జగన్మోహన్ రెడ్డి, అవినాశ్ రెడ్డికి తాత్కాలింగా యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించుకోలిగేవరకు వెళ్లాడు. కానీ వివేకాహత్యకేసులో ముద్దాయిలుగా చెప్పబడుతున్నవారి పాత్రకు సంబంధిం చి తిరుగులేని సాక్ష్యాలు సీబీఐవద్ద ఉన్నాయి. ఇది వాస్తవం.
2019 మార్చి14వతేదీ సాయంత్రం, అవినాశ్ రెడ్డి ఇంట్లో నిందితులందరూ కూర్చొని మాట్లా డుకోవడం, కదిరినుంచి గొడ్డలితెప్పించడం వంటివి గూగుల్ టేకౌట్ ద్వారా సీబీఐ కనిపెట్టింది . అవినాశ్ రెడ్డి ఫోన్ కాల్ లిస్ట్ బయటకువచ్చింది. 2019మార్చి15 అర్థరాత్రి 1.30 నిమిషాల నుంచి, తెల్లవారుజామున 5గంటలవరకు జరిగిన ఫోన్ సంభాషణలు, వాట్సాప్ మెసేజ్ లు, వాట్సాప్ కాల్స్, ఫేస్ టైమ్ కాల్స్ వివరాలను ఐ.పీ.డీ.ఆర్ (ఇంటర్నేషనల్ ప్రొటోకాల్ డిటెయిల్డ్ రికార్డ్) ద్వారా సీబీఐ బయటపెట్టింది. ఈరోజు జరిగింది చూస్తే, ఇవన్నీ ఎటుపో యాయా అనిపిస్తోంది.
వివేకానందరెడ్డి హత్యజరిగాక, ఘటనాస్థలానికి వెళ్లిన మొట్టమొదటివ్యక్తి అవినాశ్ రెడ్డి. ఆయన ఆదేశాలతోనే బాత్రూమ్ నుంచి మృతదేహాన్ని బెడ్ రూమ్ కి మార్చారు. రక్తపుమర కలు తుడిచేశారు. అక్కడి పనిఅమ్మాయి, వాచ్ మెన్ రంగయ్య, ఇతరులు సీబీఐకి చెప్పిన వాంగ్మూలం, ఇతరసాక్ష్యా ల్లో ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి. వీటన్నింటినీ తలదన్నేలా జగ న్మోహన్ రెడ్డి మేనేజ్ మెంట్ పనిచేసిందంటే ఆశ్చర్యంగా ఉంది.
సకలశాఖల సలహాదారు సజ్జల గారు అవినాశ్ రెడ్డి శ్రీరామచంద్రుడు అంటున్నారు. సజ్జల రాష్ట్రంలోని ఇతరచిన్నపిల్లల్నికాకుండా, తనమనవడినో, మనవరాలినో అడిగితే వివేకానంద రెడ్డిని అవినాశ్ రెడ్డే చంపాడని చెబుతారు. మే23న గౌరవన్యాయస్థానం సుప్రీంకోర్టు అవినాశ్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ పై కొన్నికామెంట్స్ చేసింది. తెలంగాణహైకోర్టుకి కొన్నిఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ ఆరోజునకూడా సీబీఐ న్యాయవాది సుప్రీంకోర్టులో జరిగిన వాదనల్లో పాల్గొనలేదు.
ఇంత సీరియస్ కేసులో న్యాయవాది హాజరుకాకపోవడం విచిత్రంగా ఉంది. కేసువిచారణను అడ్డుకోవడానికి ఏపీప్రభుత్వం సీబీఐని బెదిరించినట్టు దేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వం బెదిరించలేదు. 27వతేదీన జగన్మోహన్ రెడ్డి చేసిన ఢిల్లీపర్యటన అవినాశ్ రెడ్డిని కాపాడటంలో విజయవంతమైనట్టే భావిస్తున్నాం. ఈ విషయంలో ముఖ్యమంత్రికి నిజంగా అభినందనలు చెప్పాల్సిందే. ఇంతబాగా వ్వవస్థలను మేనేజ్ చేశారు కాబట్టి అభినందించా ల్సిందే.
43వేలకోట్లఆస్తులు సీజ్ చేయబడి, దాదాపు 11 సీబీఐ, ఈడీకేసుల్లో ముద్దాయిగా ఉండి, 18 నెలలు జైల్లో ఉండివచ్చిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక 4ఏళ్లలో ఒక్కసారి కూడా కోర్టువాయిదాకు హాజరుకాలేదు. అదీ జగన్మోహన్ రెడ్డి పనితనం. ఎంతబాగా వ్యవస్థ ల్ని మేనేజ్ చేస్తున్నారో ఇక్కడే అర్థమవుతోంది. వైసీపీకి వ్యవస్థల్ని మేనేజ్ చేయడం కొత్త కాదు.
గతంలో గాలిజనార్ధన్ రెడ్డి కేసులో సీబీఐస్పెషల్ కోర్టు న్యాయమూర్తి పట్టాభిరామారా వుగారు జైలుకెళ్లారంటే వైసీపీనిర్వాకమే. వ్యవస్థల్ని మేనేజ్ చేయడం వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టినవిద్యే. అవినాశ్ రెడ్డికి ఇప్పుడు లభించింది తాత్కాలిక ఉపశమనమేనని సజ్జలసహా వైసీపీనేతలంతా గుర్తించాలి. ఈకేసు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఈ వాస్త వం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు.
జగన్మోహన్ రెడ్డి అవినాశ్ రెడ్డిని ఎందుకు రక్షిస్తున్నాడంటే, హత్యజరిగిన రోజు అర్థరాత్రి అవినాశ్ రెడ్డి ఫోన్ నుంచి జరిగిన వాట్సాప్ ఛాటింగ్ లు, వాట్సాప్ కాల్స్ భయంతోనే. అవినాశ్ రెడ్డి ఫోన్ నుంచి కాల్స్ , మెసేజ్ లు అన్నీ జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ, ఆయభార్య శ్రీమ తి భారతి గారి పీఏకే ఎక్కువ వెళ్లాయని ఇప్పటికే సీబీఐగుర్తించింది.
అది ముమ్మాటికీ తిరు గులేని సాక్ష్యమే. అందుకే ఈకేసు నుంచి ఎవరూ ఎక్కడికీ తప్పించుకోలేరని గట్టిగా చెబుతు న్నాం. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఎంతటిదిట్టో మరోసారి ప్రజలకు తెలిసింది. తెలంగాణ హైకోర్టు తీర్పురాగానే సజ్జల మీడియాతో మాట్లాడటం, అవినాశ్ రెడ్డి పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించడమే అందుకు నిదర్శనం. అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ చూశాక ఐ.పీ.సీ 302పై నిజంగా సమీక్షచేయాల్సిందేనని అనిపిస్తోంది.”