అమరావతి : జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోయినట్లు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ ఒడిసా లోని ఒక కంపెనీని కొనుగోలు చేసింది. అక్కడ దక్షిణ కొరియాకు చెందిన పోస్కో అనే కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్ ప్రారంభిస్తున్నది. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ నుంచి జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ తరలిపోవడం లేదు.
గత నెల 18న జరిగిన బోర్డు మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో కలిసి సమగ్ర ఇనుప ఖనిజం ప్రాజెక్టును రూ.1,075 కోట్లతో ప్రారంభించేందుకు జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ ఆమోదించింది. ఇందులో ఎపిఎండిసికి 11 శాతం వాటా, జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ కు 89 శాతం వాటా ఉంటుంది. ఈ రెండు వేరు వేరు ప్రాజెక్టులు.
అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ తరలిపోతున్నట్లు ఫేక్ వార్తను రాజకీయ కారణాలతో సర్క్యులేట్ చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నది.
అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా, అమరావతి నీట మునిగినట్లు ఆ నీళ్లు తోడే పనిలో రాష్ట్ర ప్రభుత్వం బిజీగా ఉండగా జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ ఒడిసాకు తరలిపోయినట్లు కట్టుకథలు సర్క్యులేట్ చేస్తున్న మీడియా సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి.